మెయిన్ ఫీచర్

మామిడి రుచులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హల్వా
కావలసిన పదార్థాలు:
మామిడి పండు గుజ్జు - 5 కప్పులు, బెల్లం - 2 కప్పులు
పంచదార - ఒకటిన్నర కప్పు
నెయ్యి - 1/2 కప్పు, ఏలకులు - 12
కొబ్బరి కోరు - 1 కప్పు
కార్న్‌ఫ్లోర్ - 1 కప్పు
జీడిపప్పులు -24
తయారీ విధానం:
నేతిలో జీడిపప్పు వేయించాలి. మామిడిపండు గుజ్జులో పంచదార కలపాలి. కార్న్‌ఫ్లోర్‌కి నీళ్ళు 2 కప్పులు కలిపి కరిగించాలి. బెల్లంలో ఒక కప్పు నీరు చేర్చి కరిగించాలి. బాణలిలో వెడల్పు గినె్న పెట్టి దానిలో నెయ్యి వేసి కార్న్‌ఫ్లోర్ ద్రవంపోసి బెల్లం ద్రవం పోసి ఉడకనివ్వాలి. మిశ్రమం దగ్గర పడుతుండగా మామిడి గుజ్జు, పంచదార కలిపింది పోసి బాగా కరగబెట్టాలి. గినె్ననుంచి మిశ్రమం విడిపోతుండగా జీడిపప్పులు వేసి దింపి పళ్లానికి నెయ్యి రాసి పోసి సర్ది ఏలకులపొడి జల్లి, వేయించిన కొబ్బరి జల్లి ఆరనిచ్చి ముక్కలు చేసుకోవాలి.
బర్ఫీ
కావలసిన పదార్థాలు:
మామిడి రసం - 2 లీటర్లు
పంచదార - 2 కప్పులు
బెల్లం - 2 కప్పులు
ఏలకులపొడి - 2 చెంచాలు
ఎండుకొబ్బరి - 1 కప్పు
నెయ్యి - 2 చెంచాలు
జీడిపప్పు - 24, కిస్‌మిస్ - 12
తయారీ విధానం:
ముందుగా పంచదార బెల్లం కలిపి 2 కప్పులు నీరు చేర్చి బాగా కలపాలి. ఇది పొయ్యిపై పెట్టి పాకం రానివ్వాలి. దానిలో ఈ రసంపోసి కలియబెట్టి దింపి పళ్ళానికి నెయ్యి రాసి ఈ రసం పోసి ఎండలో పెట్టాలి. ఇది ఎండకి ఎండుతుంది. ఇలా బాగా ఎండేలా 3, 5 రోజులు బాగా ఎండాక డైమన్‌లుగా కోయాలి. నేతిలో వేయించిన కొబ్బరి, జీడిపప్పులు, కిస్‌మిస్‌లు అద్ది వడ్డించండి. ఎప్పటికప్పుడు ఈ ముక్కలు వడ్డించేముందర అలంకరించాలి. పై బర్ఫీ ఏటికేడాది నిల్వ ఉంటుంది.
ఖీర్
కావలసిన పదార్థాలు :
మామిడి కోరు దోరగా ఉన్నది - 2 కప్పులు
కొబ్బరిపాలు - 1 కప్పు, పాలు - 2 కప్పులు
కోవా - 2 బిళ్ళలు, నెయ్యి - 5 చెంచాలు
ఏలకులు - 6, జీడిపప్పు - 12
కిస్‌మిస్ - 12, పంచదార - 1 కప్పు
తయారీ విధానం :
ముందుగా దోరగా ఉన్న మామిడికోరు నేతిలో వేయించాలి. దీనిలో కొబ్బరిపాలు, వేయించిన జీడిపప్పులు, కిస్‌మిస్‌లు వేసి ఉడకనివ్వాలి. ఏలకుల పొడి జల్లి మిగతా పాలు పోసి కలియబెట్టాలి. పొంగులు వస్తుండగా దింపాలి. చల్లార్చిన తరువాత ఫ్రిజ్‌లో పెట్టి కూలింగ్‌గా తాగితే ఎంతో మంచిది.
కేసరి
కావలసిన పదార్థాలు:
మామిడి గుజ్జు - 4 కప్పులు
బొంబాయి రవ్వ - 1 కప్పు
నెయ్యి - 1/2 కప్పు
జీడిపప్పులు - 12
ఏలకులు -6
కొబ్బరికోరు-1/2 కప్పు
పంచదార - 1 కప్పు
పాలు - 1 కప్పు
కీరా - 1/2 కప్పు
తయారీ విధానం:
ముందుగా బొంబాయి రవ్వ దోరగా వేయించి 2 కప్పుల నీరు, పాలు చేర్చి ఉడికించాలి. దీనికి మామిడి గుజ్జు, పంచదార చేర్చి బాగా కలపాలి. దానిలో నెయ్యి వేసి ఏలకుల పొడి చేర్చి, కొబ్బరి, ఏలకులు, జీడిపప్పులు చేర్చి కలిపి దింపి ఒక బౌల్‌లో సర్దాలి. ఆ తరువాత నచ్చిన ఆకృతిలో డైమన్‌లుగా, బిళ్ళలుగా చేసుకోవచ్చును.
గుత్తి
మెంతికారం
కావలసిన పదార్థాలు:
మామిడికాయలు - 12 చిన్నవి
వేయించిన కారం - 1 కేజీ
వేయించిన మెంతిపొడి - 1/2 కేజీ
ఉప్పు - 3/4 కేజీ
నూనె - 1 కేజీ, ఇంగువ - కొంచెం
తయారీ విధానం:
మామిడికాయలు పైతొక్కు గీతల్లా చెక్కి వంకాయ గుత్తుల్లా ముక్కలు చేయాలి. దానిలో పై పొడులు కారం, మెంతి, ఉప్పు కలిపింది కూరి, జాడీలో ఉంచాలి. మూడవ రోజున బాగా పిండి ఎండలో పెట్టాలి. విరగ ఎండాక ఈ ఊట కూడ విరగ ఎండాక నూనెలో ఇంగువ కాచి ఈ కారం ముద్దలో కలిపి ఎండిన మామిడి టెంకలు ముక్కలు కలిపి మూడు రోజులు నానబెట్టి దీనిని జాడీలో పెట్టి గాలి చొరకుండా గుడ్డ కట్టాలి. రెండు మూడు ఏళ్ళు నిల్వ ఉంటుంది.
*