మెయిన్ ఫీచర్

ట్రైబల్‌రాణి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్యాషన్‌షో అంటే అదో రంగుల లోకం. కాస్మొటిక్స్, భిన్నమైన దుస్తులు, ఎత్తుమడమల చెప్పులు, శారీరక కొలతలు, రంగురంగుల లైట్ల ర్యాంప్ పై పిల్లి నడకల ఫ్యాషన్ షోలు వెరసి అందాల పోటీలు.. కానీ ఈ అందాల పోటీలోని ఫ్యాషన్ షో భిన్నమైనది సుమా! సంప్రదాయ దుస్తులు, నచ్చిన ఆహార్యం, కొలతలు, కొలబద్దలతో పనేలేదు.. నచ్చిన సంప్రదాయ దుస్తులను మెచ్చేలా వేసుకుని ఆ గిరిజన యువతులు ప్రముఖ మోడళ్లుగా మెరిసిపోయారు. తమను తాము నిరూపించుకున్నారు. అందరిలోకి పల్లవి దారువా ట్రైబల్ క్వీన్ (ఆదిరాణి)గా ప్రముఖుల మన్ననలు అందుకుంది. అసలు విషయం ఏంటంటే.. ఒడిశాలోని భువనేశ్వర్‌లో ‘కళింగ ట్రైబల్ క్వీన్ కాంటెస్ట్’ పేరుతో భారతదేశంలోని గిరిజన యువతులకు మొదటిసారిగా అందాలపోటీని నిర్వహించారు. ఇందులో దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల నుంచి 150 మంది గిరిజన యువతులు పాల్గొన్నారు. ఈ పోటీని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ గిరిజన, పర్యాటక శాఖ నిర్వహించింది. ఇందులో తుది దశకు 22 మంది గిరిజన యువతులు చేరుకున్నారు. వీరందరూ తమదైన స్టైల్లో సంప్రదాయ దుస్తులను, ఆభరణాలను ధరించి వేదికపై నడిచారు. న్యాయనిర్ణేతల నుంచి అనేక ప్రశ్నలను ఎదుర్కొన్నారు. వీరందరిలో తెలివిగా సమాధానమిచ్చి విజేతగా నిలిచిచింది ఒడిశాలోని కోరాపూట్‌కు చెందిన పల్లవి దారువా. మొదటి రన్నరప్‌గా పంచమి మజ్హి, రెండో రన్నరప్‌గా రశ్మిరేఖా హన్సదాలు ఎంపికయ్యారు. అందాల పోటీల మాదిరిగానే ఇందులో కూడా వస్త్ధ్రారణ, ముఖతీరూ, చర్మకాంతీ, శరీరాకృతీ, ఆభరణాల ఎంపిక, సంస్కృతీ సంప్రదాయలను అనుసరించి ఏడుగురు యువతుల్ని కూడా విజేతలుగా ఎంపికచేశారు. గిరిజన యువతుల్లో చాలామంది నిరక్ష్యరాస్యులే.. ఆ గిరిజన మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి, వారి సాధికారికతను ప్రపంచానికి చాటడానికే ఈ పోటీని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. *

-- పల్లవి దారువా