మెయన్ ఫీచర్

అమెరికాలో ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్ని బలహీనతలు ఉన్నా, వ్యవస్థాగతమైన లోపాలున్నా, ఆశించిన విధంగా ప్రజలకు సామా జిక, రాజకీయ, ఆర్థిక న్యాయాన్ని అందిం చలేకపోతున్నా- ప్రపంచంలో అత్యుత్తమ పాలనా వ్యవ స్థగా ప్రజాస్వామ్యాన్ని పేర్కొంటుంటాము. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు బానిస సంకెళ్ళ నుండి విముక్తి లభించడమే కాకుండా, తమ అభిప్రాయాలను వారు వ్యక్తపరచుకోవడంతో పాటు తమ జీవన ప్రమాణాలను పెంపొందింప చేసుకోవడానికి అనువైన పాలనా వ్యవస్థను ఏర్పర్చుకొనే అవకాశం లభిస్తుందని విశ్వసిస్తుంటాము.
వందల ఏళ్లుగా ప్రపంచంలో ప్రజాస్వామ్యం కోరుకొనే వారందరికీ అమెరికా ఒక ఆదర్శంగా నిలబడుతూ వస్తున్నది. ఆ దేశ రాజకీయ, సామజిక విధానాల పట్ల ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఆ దేశం అనుసరిస్తున్న ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల గౌరవం కలుగుతూ వస్తున్నది. ప్రపంచంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలకు ఒక స్ఫూర్తి కేంద్రంగా, నిరంకుశ వ్యవస్థలను కట్టడి చేసే సమాజంగా మనగలుగుతూ వస్తున్నది. రాజకీయ కారణాల చేత ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాల ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిరంకుశ వ్యవస్థలకు అండగా అమెరికా ఉన్నప్పుడు సహితం ఆ దేశం అనుసరిస్తున్న ప్రజాస్వామ్య పక్రియ పట్ల ఒకింత అభిమానం పెరుగుతూనే వస్తున్నది.
అయితే ఇప్పుడు అమెరికాలో ప్రజాస్వామ్యం బలహీన పడుతున్నట్లు ఆ దేశ ప్రజలే భావిస్తున్నారు. కేవలం అమెరికాలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యం ఇటీవల కాలంలో గణనీయమైన సవాళ్ళను ఎదు ర్కొంటున్నది. ఆర్థిక ప్రగతి అసమాన పంపకం, ప్రజల ప్రయోజనాలకు సంబంధం లేకుండా జరుగుతున్న మార్పులు ఆశించిన ప్రయోజనాలను ఏమేరకు నెరవేర్చ గలవో అని ప్రజాస్వామ్య వ్యవస్థలపైన, ఆయా దేశాల నాయకులపైన నేడు అనుమానాలు కలుగుతున్నాయి. ఈ సందిగ్ధ పరిస్థితులను ఆసరా చేసుకొని నిరంకుశ వ్యవస్థలు, ప్రజామద్దతు గల జాతీయవాద ఉద్యమాలు స్వేచ్ఛకు మారుపేరుగా నిలచే ప్రజాస్వామ్య అవసరం ఏమిటనే ప్రశ్నలు లేవనెత్త గలుతున్నాయి.
ప్రజాస్వామ్యానికి కీలక సౌధాలైన చట్టబద్ధ పాలన, పత్రికా స్వాతంత్య్రం బలహీన పడుతూ ఉండడంతో అమెరికాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థలపైనా నమ్మకం సడలుతున్నది. ఇటువంటి పరిణామాల మధ్య ప్రజలు ప్రజాస్వామ్య వౌలిక సూత్రాల పట్ల విశ్వాసం కోల్పోతున్నారా? ఇటువంటి పరిస్థితులను కట్టడి చేయడానికి ఏమి చేయాలనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటువంటి ప్రశ్నలకు సమాధానాల అనే్వషణలో భాగంగా ఫ్రీడమ్ హౌస్, జార్జ్ డబ్ల్యూ బుష్ సంస్థ, పెన్ బిడెన్ సెంటర్ ఫర్ డిప్లమసీ అండ్ గ్లోబల్ ఎంగేజ్మెంట్ లు పలు బృందాలను ఏర్పాటు చేసి ప్రజాస్వామ్య సూత్రాలు, సంస్థల పట్ల అమెరికా ప్రజల ధోరణి గురించి జాతీయ స్థాయిలో సర్వే నిర్వహించారు. ప్రజాస్వామ్య విలువల విశ్వజననీయత, ప్రపంచ భవిష్యత్‌కు అమెరికా ప్రజాస్వామ్య ప్రమాణాల భవిష్యత్ ప్రాధాన్యతలకు సంబంధించి సమగ్రమైన అధ్యయనం చేశారు.
ప్రజాస్వామ్యం పట్ల అమెరికా ప్రజలు ఇప్పటికీ ధృడమైన విశ్వాసం కలిగి ఉన్నారని, అత్యధికంగా ప్రజలందరూ ప్రజాస్వామ్య వ్యవస్థలోనే నివసించాలని కోరుకొంటున్నారని, విదేశాలలో సహితం ప్రజా స్వామ్యాలకు అమెరికా మద్దతు ఇవ్వడాన్ని సమర్ధిస్తున్నారని ఈ సందర్భంగా వెల్లడైనది. అయితే దేశ రాజకీయ వ్యవస్థలో విశ్వాస సంక్షోభం ఏర్పడినట్లు ప్రజలు భావిస్తున్నారు. అమెరికా ప్రజలు అందరూ ప్రజాస్వామ్యం పట్ల ఒకేవిధమైన ప్రయోజనాలు ఉంటాయని భావించలేక పోతున్నా, ఈ వ్యవస్థ ప్రాధాన్యత పట్ల నమ్మకంతో ఉన్నారు.
దేశ ప్రజలు రాజకీయ పక్షాల వారీగా విడిపోవడం, జాత్యాహంకారం, వివక్ష వంటి వ్యవస్థాగత సమస్యల కారణంగా ప్రజలలో ఒకవిధమైన అశాంతి నెలకొం టున్నట్లు ఈ అధ్యయనం తెలిపింది. సాంప్రదాయేతర అభ్యర్థి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల కూడా అసంతృప్తి వ్యక్తం అవుతున్నది. అయితే ప్రజలలో ఎదురవుతున్న అసంతృప్తికి దీర్ఘకాలికంగా నెలకొన్న, విస్తృతంగా పరిశీలనలోకి వచ్చిన అంశాలే కారణం అని అర్థం అవుతుంది. అయితే సాధారణ ప్రజలలో వ్యక్తం అవుతున్న అసాధారణ క్రియాయాశీలత, ప్రజాస్వామ్య విలువలను పునరుద్ధరించడం కోసం చేబడుతున్న అర్థంతమైన చర్యలు స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయి. అమెరికా ప్రజాస్వామ్యం వారి క్రియాశీలత కారణంగా పరిపుష్టి పొందే అవకాశం ఉన్నదనే నమ్మకం ఏర్ప డుతుంది.
కేవలం అమెరికాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య విలువలు సంక్షోభంలోకి నెట్టివేయ బడుతున్నాయి. పౌర సమాజాలు పనిచేయలేని పరి స్థితులను ప్రజాస్వామ్య ప్రభుత్వాలే కల్పిస్తున్నాయి. విశేష ప్రచారం పొందే దాడులు ప్రజాస్వామ్య సంస్థల పట్ల విశ్వాసాన్ని సన్నగిల్లేటట్లు చేస్తున్నాయి. నాయకులు ప్రజాస్వామ్య సూత్రాలకు తిలోదకాలిచ్చి తమ వ్యక్తిగత అధికార దాహం తీర్చుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి ధోరణులకు ఇప్పుడు అమెరికా సహితం సహజంగానే భిన్నంగా ఉండలేక పోతున్నది. ప్రజాస్వామ్యానికి ముఖ్యమైన స్వేచ్ఛ, స్వాతంత్రాలను యథేచ్ఛగా పొందగలమని ప్రజలు అజాగ్రత్తతో ఉండరాదని, వాటిని కాపాడుకోవడానికి, పరిరక్షించు కోవ డానికి తగు కృషి చేసినప్పుడే వాటి ఫలాలు పొందగలమని ఈ అధ్యయనం స్పష్టం చేస్తుంది. పైగా ప్రజాస్వామ్యం ఎప్పటికీ అత్యుత్తమమైన వ్యవస్థ కాబోదని, ఆ వ్యవస్థ అందించే అత్యుత్తమ విలువలను కాపాడుకోవడం కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉండాలని కూడా ఈ సందర్భంగా సూచించినట్లు అయింది.
ప్రజాస్వామ్య వ్యవస్థలో నివసించడం తప్పనిసరిగా ప్రాధాన్యత గల అంశమని 84 శాతం మంది అమెరికా ప్రజలు ఈ అధ్యయనంలో తెలుపగా, దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనంగా ఉన్నదని 55 శాతం మంది, మరింత బలహీనంగా మారుతున్నదని 58 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం పట్ల, ప్రజాస్వామ్య సంస్థల పట్ల విశ్వాసాన్ని పెంపొందింప చేయడానికి తమ అధ్యయనం దోహదపడగలదని అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యు బుష్ భరోసా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల అత్యధికంగా ప్రజలు తమ సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నా ఒక ప్రజాస్వామ్య దేశంగా అమెరికా భవిష్యత్ పట్ల మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ప్రజాస్వామ్యం అంతరించి, నిరంకుశ వ్యవస్థగా మారే ప్రమాదం లేకపోలేదని 43 శాతం మంది భయాన్ని వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థ పట్ల ప్రజలలో గౌరవం క్రమంగా అంతరించి పోతున్నదని అనుమానం వ్యక్తం అవుతున్నది. అటు రిపబ్లికన్‌లలో, ఇటు డెమొక్రాట్‌లలో సహితం సగంమందికి పైగా 57 శాతం మంది ఒక ప్రజాస్వామ్య దేశంగా అమెరికా భవిష్యత్ పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. మగవారిలో కన్నా మహిళలలో ప్రజాస్వామ్య భవిష్యత్ పట్ల ఆందోళన అధికంగా వ్యక్తమయింది.
శే్వత జాతీయులలో అత్యధికంగా 64 శాతం మంది ప్రజాస్వామ్య వ్యవస్థలో జీవించడం అత్యవసరం అని భావిస్తుండగా, ఇతరులలో అటువంటి వారి సంఖ్య 52 శాతంగా మాత్రమే ఉంది. అట్లాగే 61 శాతం మంది శే్వత మహిళలు ప్రజాస్వామ్య జీవనాన్ని కోరుకొంటుండగా, మైనారిటీ మహిళలో అటువంటి వారి సంఖ్య 53 శాతం మాత్రమే. ఈ విధంగా ప్రజాస్వామ్యం వల్లన ఒనగూరే ప్రయోజనాల పట్ల భిన్నమైన ధోరణులు వెల్లడి కావడం విస్మయం కలిగిస్తుంది. అయితే యువతరంలో ప్రజా స్వామ్యం పట్ల పట్టుదల కనిపిస్తుండటం ఆశాజనకమైన పరిణామం. అత్యధికంగా 81 శాతం మంది యువకులు ప్రజాస్వామ్య ప్రాధాన్యత పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో పెచ్చుపెరుగుతున్న జాత్యహంకారం, వివక్ష, ధన రాజకీయాల పట్ల అమెరికా ప్రజలు విసుగు వ్యక్తం చేస్తున్నట్లు ఈ సర్వే వెల్లడి చేసింది. జాత్య హంకారం ధోరణులు ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్య పరుస్తున్నాయని ప్రత్యేకంగా స్వెతేతర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై రాజకీయ భేదా భిప్రాయాలు సహితం విస్తృతంగా ఉన్నాయి. సమాన హక్కులు, జాతిపర మైనారిటీలకు రక్షణ అమెరికాలో మెరుగు పడినట్లు రిపబ్లికన్‌లలో 68 శాతం భావిస్తుండగా, డెమొక్రాట్‌లలో ఆ విధంగా కేవలం 23 శాతం మంది మాత్రమే భావిస్తున్నారు.
అమెరికా ప్రజాస్వామ్య మనుగడకు ప్రధానంగా సవాల్ చేస్తున్న అంశాలు రాజకీయాలలో పెద్ద ఎత్తున పెరుగుతున్న ధన ప్రభావం అంటూ 28 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మధ్య కాలంలో జాతీయ ప్రభుత్వాలు చేసిన చట్టాలు ఎక్కువగా దేశంలో ప్రత్యేక ఆసక్తి గల బలమైన వర్గాలు కోరుకొంటున్నట్లే ఉంటున్నాయని 77 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. వ్యక్తులు, చిన్న చిన్న బృందాల హక్కులను కాపాడటం ప్రజాస్వామ్యంలో అత్యవసరమని, మెజారిటీ గలవారు వారి హక్కులను హరించే పరిస్థితి ఉండకూడదని 54 శాతం మంది పేర్కొన్నారు.
జాతి, లింగం, విశ్వాసాలతో సంబంధం లేకుండా ప్రజ లందరికీ సమాన హక్కులు కల్పించడం ప్రజా స్వామ్యానికి జీవనాడి వంటిదని సాధారణ అభిప్రాయం వ్యక్తమైంది. కేవలం స్వదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యం, మానవహక్కుల పరిరక్షణ కోసం తాను చేయదగిన పనులను అమెరికా చేయ వలసిందే అని 71 శాతం మంది ప్రజలు స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వాణిజ్యమే అమెరికా విదేశాంగ విధానంలో కీలక అంశంగా మారుతూ ఉండటం సహితం ప్రజల సాధారణ ఆమోదం పొందటం లేదు. విదేశాంగ విధానంలో ప్రజాస్వామ్యం, మాన వహక్కులు కీలకమైన ప్రాతిపదిక కావలసిందే అని స్పష్టం చేస్తున్నారు. ప్రపంచంలో ఏమి జరుగుతుందో మనం నియం త్రించలేము. అయితే ప్రజలు మారణకాండ, హిం స, తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘనలకు సమిధులు అవుతుంటే మన స్వరం వినిపించి, మనం చేయదగినది చేయవలసిన నైతిక బాధ్యత మనపై ఉంది అంటూ 91 శాతం మంది ప్రజలు పేర్కొన్నారు. మరే అంశంపై కూడా ఇంతటి విస్తృతమైన అభిప్రాయం ప్రజలలో వ్యక్తం కాకపోవడం గమనార్హం. ఇతర దేశాలు ప్రజాస్వామ్య దేశాలుగా మారితే మన సంక్షేమానికే దోహదపడుతుందని మనం గుర్తించాలని 84 శాతం మంది ప్రజలు భావిస్తున్నారు. ఇప్పుడు మనమంతా బాధ్య తాయుతమైన పౌరులంగా వ్యవహరించాలి. వోటు వేయడం, స్వచ్ఛంద సేవ అందించడం, జరుగుతున్న విషయాలు తెలుసు కోవడం, హక్కులకోసం నిలబడటం ద్వారా స్వేచ్ఛలు, హక్కులు హరించిపోకుండా కాపా డుకోగలం అనే సందేశం మొత్తం మీద ఈ అధ్యయనం అందిస్తున్నది.

-చలసాని నరేంద్ర