మెయిన్ ఫీచర్

ప్రేమోన్మాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేట్రేగిపోతున్న ప్రేమోన్మాదం..
హత్యలకు ఎగబడుతున్న యువకులు..
పాశ్చాత్య సంస్కృతికి బానిసలుగా మారుతున్న యువత..
ఇవన్నీ నేటి యువత మానసిక స్థితికి నిదర్శనం..
అది జూన్ 15, 2018. జనం రద్దీగా ఉండే కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ సమీపంలో ఓ యువకుడు తాను ప్రేమించిన యువతిని అతి కిరాతకంగా, నీచంగా గొంతుకోసి చంపేశాడు. ఇదేనా మన సంస్కృతి. యువత ఇలాంటి వికృత చేష్టలకు దిగజారడానికి వారిలోని మానసిక స్థితి సరిగా లేకపోవడం మరియు పాశ్చాత్య సంస్కృతికి బానిసలుగా మారడమే కారణం. దీనిని అదుపు చేయాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపైనా ఉంది. చట్టాలు ఎన్ని ఉన్నా సమాజంలో చైతన్యం రానంతవరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి.
సమాజంలో ప్రతి ఒక్కరి జీవన విధానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. దీనికి ఒత్తిడి, అర్థం లేని భయం, ఆర్థికంగా అందలాన్ని అందుకోవాలనే తపన, కాలంతో పాటు పరుగులు.. ఇవన్నీ మనిషి వ్యక్తిగత జీవితాన్ని పాడుచేస్తున్నాయి. నా అనే కుటుంబ సభ్యులపై కంటే వస్తువులపై మోజును పెంచుకుంటున్నారు. పిల్లల పెంపకం పట్ల శ్రద్ధ వహించడం లేదు. పిల్లలకు ఏది మంచి, ఏది చెడు అని చెప్పేవారు కరువయ్యారు. పిల్లల తల్లిదండ్రులు, తాతయ్య, నానమ్మల దగ్గర గడిపే సమయం చాలా తక్కువైంది. ఎక్కువ సమయాన్ని సెల్‌ఫోన్‌ల వినియోగానికి కేటాయిస్తూ ఉన్నారు. యుక్తవయస్సు రాగానే చదువుల పేరుతో పట్టణాలకు వసల వెళ్లి స్నేహితులతో కలిసి ఒకే గదిలో అద్దెకుంటున్న వీరిలో సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోయి చెడు దారుల్లో పయనిస్తున్నారు. లైంగిక చర్యలకు ఉసిగొప్పబడుతున్నారు. వారిలో మానసిక స్థితి తప్పడం మూలంగా ఏ విధంగానైనా తను కోరుకున్న వ్యక్తిని లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎదుటి వ్యక్తికి కూడా ఇష్టాయిష్టాలు ఉంటాయనే ఇంగిత జ్ఞానం కూడా మరిచిపోయి ఎలాగైనా సరే దక్కించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. అలా జరగని పక్షంలో నాకు దక్కనిది వేరే వారికి దక్కకూడదు అనే ఆలోచనలతో వారిని అంతమొందించడానికి సిద్ధపడుతున్నారు. తనకు నచ్చిన యువతి ప్రేమించడం లేదని యువకులు యాసిడ్‌లు, కిరాతకంగా కత్తులతో దారుణమైన దాడులకు ఎగబడుతున్నారు.
మానవత్వం మంట కలుస్తోంది. మానవ సంబంధాల పట్ల విలువలు తగ్గుతున్నాయి. నేటి యువత ప్రేమ అర్థాన్ని మార్చేస్తోంది. ప్రేమ అంటే ఎదుటివారిని సంతోషంగా ఉంచడం, వారి ఇష్టాయిష్టాలకు గౌరవం ఇవ్వడం. ప్రేమించకపోవడం నేరమా? అంటే అవుననే అంటున్నారు కొందరు మృగాళ్లు! ప్రేమించలేదనే అక్కసుతో ఓ యువతిని ప్రేమోన్మాది కత్తితో పొడిచి చంపాడు. ప్రేమ అనే మాయను సృష్టించుకుని ఉన్మాదిగా మారుతున్న యువతను సన్మార్గంలో నడిపించాలి.
ఉన్మాదం తగ్గాలంటే..
* యువత సన్మార్గంలో పెరిగే విధంగా విద్యా విధానంలో మార్పు రావాలి.
* పిల్లలను ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి.
* ప్రతిరోజూ పిల్లలతో గడిపే సమయాన్ని ఖచ్చితంగా కేటాయించుకోవాలి. వీలయినంతవరకు సెలవు రోజుల్లో కుటుంబ సమేతంగా కొత్త ప్రదేశాలు సందర్శించాలి.
* యుక్త వయసు పిల్లల స్నేహితులపై కూడా తల్లిదండ్రులు దృష్టి సారించాలి.
* పిల్లలు దారి తప్పుతున్నట్టుగా అనిపిస్తే వెంటనే కౌన్సిలర్ సైకాలజిస్ట్‌ల సహాయాన్ని తీసుకోవాలి.
* సమాజంలో ప్రస్తుతం యువకులు మంచి కంటే చెడును అతి తక్కువ సమయంలో గ్రహిస్తున్నారు.
* భయకంపితమైన దృశ్యాలు యువత కంట పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
* ఇంటర్నెట్ వల్ల ఎన్ని లాభాలున్నాయో అన్ని నష్టాలూ ఉన్నాయని గుర్తించాలి. అవసరమైన మేరకే పిల్లలకు నెట్‌ను ఇవ్వాలి.
* యువతకు స్నేహం, ప్రేమకు మధ్య వ్యత్యాసం తప్పనిసరిగా వివరించాలి.
ఒక్కనిమిషం ఆలోచించండి..
హత్య చేసిన కొడుకును అరెస్ట్ చేసి పోలీసులు జైలుకు తీసుకు వెళ్తుంటే ఇలాంటి కొడుకు ఎందుకు ఇచ్చాడు ఆ భగవంతుడని కుళ్లి కుళ్లి ఏడుస్తున్న ఆ తల్లిదండ్రుల శోకం చెప్పలేనిది. తెల్లవారి నుండి ఆ తల్లిదండ్రులు ఆలనా పాలనా చూసుకునేవారెవరు? అనేదే ప్రశ్న. జీవితమనేది మనొక్కరిదే కాదు.. మనల్ని కని, పెంచి, పోషిస్తున్న అమ్మానాన్నలది కూడా.. మనపై మనకెంత హక్కుందో తల్లిదండ్రులకూ అంతే హక్కుంది. యుక్తవయసు విపరీత ఆలోచనలకు లోనవడం సహజం. అయితే నిరంతరం మన కర్తవ్యాన్ని గుర్తుచేసుకుంటూ ముందుకు సాగాలి. ప్రేమైనా, విలాసాలైనా కాస్త ఆగి, ఆలోచించి, అందులోని మంచి చెడ్డలను సరిచేసుకుంటూ వెళ్ళాలే కానీ హత్యలు, ఉన్మాద చర్యలు చేసే స్థాయికి దిగజారిపోకూడదు.
హత్య చేయడం వల్ల నువ్వు సాధించేదేమిటి? పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఆ ఆడపిల్ల ప్రేమను పొందగలుగుతావా? ఇలా చేస్తే ఇతరులు ఎవరైనా నిన్ను గౌరవిస్తారా? ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని, మీ శ్రమని నమ్మండి సానుకూల ఫలితం వస్తుందనే భావంతో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగాల్సిన పనులు అవే జరుగుతాయి. మనల్ని అపహాస్యం చేసిన వారిని సవాలు చేస్తూ పైకి.. పైపైకి ఎదుగుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. నువ్వు ఏదైతే కోరుకున్నావో అదే నీ దరికి తప్పకుండా చేరుతుంది.

-డా. అట్ల శ్రీనివాస్‌రెడ్డి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, 97039 35321