మెయన్ ఫీచర్

దేశ విచ్ఛిన్నమే వారి ఎజెండా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరూ పట్టించుకోరు.. ఈ దేశం గతి ఇంతే’ అన్న ఆందోళన నేడు ప్రజల్లో పెరుగుతోంది. వీరికి రాజకీయ నాయకులు సహకరించటం లేదు. కొందరు ముఖ్యమంత్రులే దేశద్రోహులైతే ఇక దేశాన్ని ఎవరు కాపాడగలరు? ‘ఎర్ర గులాబీ’ ధరించిన నేత అలనాడు చేసిన తప్పుకు రక్తం ఏరులై పారింది. కుంకుమ పండే భూస్వర్గంలో కల్లోలాశ్రువులు.. షేక్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, గులాం నబీ ఆజాద్, ముఫ్తీ మహమ్మద్ సరుూద్, మెహబూబా ముఫ్తీ.. ఇలా ఇంతమంది నేతలు ఒక ప్రాంతాన్ని దశాబ్దాలుగా చెరపడితే ఏమవుతుంది? కశ్మీర్‌లోయ దశాబ్దాల తరబడి అశాంతితో భగ్గుమంటోంది. వేర్పాటువాదులకు, ఉగ్రవాదులకు, శత్రుదేశం సైనికులకు కొంతమంది నేతలు వత్తాసు పలుకుతున్నారు. కశ్మీర్‌లో పాకిస్తాన్ జెండాతో పాటు ఐసిస్ ఉగ్రవాదుల జెండాలతో యువకులు ఊరేగింపులు నిర్వహిస్తున్నారు.
ఐసిస్ అనేది సిరియాకు చెందిన నరహంతక సంస్థ. కశ్మీర్‌లోనే కాదు.. కేరళలో, హైదరాబాద్‌లో ఈ జెండాలు ఎగురుతాయి. లష్కరే తోయిబా అనే ఉగ్రవాద సంస్థ- ‘ఎన్నికలలో మన వాళ్లంతా కాంగ్రెస్ పార్టీకి బహిరంగంగా మద్దతునివ్వండి’ అని ప్రకటించింది. భారత్‌లో దాదాపు నలభై ఉగ్రవాద సంస్థలు యథేచ్ఛగా పనిచేస్తున్నాయి. మన సైనికుల కార్యకలాపాలపై పాకిస్తాన్‌కు కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా సమాచారం పంపేవారన్న ఆరోపణలున్నాయి.
ఐసిస్ కార్యకలాపాలు సాగుతున్న మరొక రాష్ట్రం కేరళ. 1947కు ముందు ఇక్కడ తిరువాన్కూరు సంస్థానాధీశుల పాలన ఉండేది. ఇక్కడికి వ్యాపారం కోసం విదేశీయులు ప్రవేశించగా, ఇస్లామీకరణ చాలా తొందరగా జరిగింది. ‘మతం ఓ మత్తుమందు’ అనే కమ్యూనిస్టులు రాజ్యాధికారం కోసం కేరళలో ముస్లిం లీగ్‌పై ఆధారపడ్డారు. ఇక్కడ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ) అనే మరొక ఉగ్రవాద సంస్థ అవతరించింది. ఈ సంస్థ సహాయం లేకుండా కోజికోడ్ బాలకృష్ణన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఎన్నికల రాజకీయాలు నడపలేక పోతున్నారు. అధికారిక అంచనాల ప్రకారం గత కొద్దికాలంలో కేరళలో పిఎఫ్‌ఐ 27 హత్యలు చేసింది. దీని శాఖ కర్నాటకకు కూడా విస్తరించింది.
ఇస్లామిక్ రాడికలైజేషన్ ధ్యేయంగా పనిచేసిన జకీర్ నాయక్‌పై ఇండోనేషియా వంటి దేశాలు నిషేధం విధించాయి. కాని భారత్‌లో జకీర్‌కు వెనుకటి ప్రభుత్వాలు మద్దతునిచ్చాయి. మంగళూరులో ఓ పూజారిని హత్యచేయటం లో పిఎఫ్‌ఐ కర్నాటకలో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఈ సంస్థకు నేరుగా పెట్రో డాలర్లను సౌదీ అరేబియా అందజేస్తున్నది. హషీద్ సయ్యద్ జిగ్నేశ్ మెమానీ (గుజరాత్) వంటి ఆయుధాల వ్యాపారులకు కాంగ్రెస్ పార్టీ నిధులను అందిస్తున్నది. మరికొందరు హిందూ కార్యకర్తల హత్యలో, కొన్ని పేలుళ్ల ఘటనల్లో పిఎఫ్‌ఐ హస్తం ఉంది.
మోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చాక పిఎఫ్‌ఐ, లష్కరే తోయిబా, ఐసిస్ సంస్థలపై నిషేధం విధించి ఉన్నట్లయితే కశ్మీరులో పత్రికా సంపాదకుడు షాజత్ బుఖారీ హత్య జరిగి ఉండేది కాదు. మొన్నటివరకు కశ్మీర్ సీఎంగా పనిచేసిన మెహబూబా బుఖారీ హత్య కేసులో విచారణను ముందుకు సాగనీయలేదు. సరికదా మన భద్రతాదళాలపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయించింది. ‘దేవుడా? రక్షించు నా దేశాన్ని-’అని 1950 ప్రాంతంలో ఓ తెలుగు కవి ఆవేదన చెందాడు. మనుషులకు బుద్ధి, జ్ఞానం ఇచ్చి మీ దేశాన్ని మీరు రక్షించుకోండి అని చెప్పి పంపాడు దేవుడు. దేశాన్ని రక్షించే బాధ్యతను దేవుడి మీదకు మనిషి నెట్టేశాడు. కర్మ సిద్ధాంతాన్ని నమ్మిన జాతి మనది.
దేశంలో నరమేధం సృష్టిస్తున్న పలు ఉగ్రవాద సంస్థల్లో ఎక్కువమంది యువకులు ఉన్నారు. వీరంతా నిరుద్యోగులు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశచూపి వీరిని ఉగ్రవాద సంస్థల్లో రిక్రూట్ చేస్తున్నారు. వీరిలో యువతులు సైతం ఉన్నారు. వీరికి ఇస్లాం తీవ్రవాద సిద్ధాంతాలను నూరిపోస్తున్నారు. లక్ష్యసాధన కోసం సాయుధ పోరాటం అనే మూలసూత్రాన్ని మావోయిస్టులు, తాలిబన్లు, పిఎఫ్‌ఐ, ఐసిస్, లష్కరే తోయిబా వంటి సంస్థలు గట్టిగా విశ్వసించాయి. కశ్మీర్, కేరళ వంటి రాష్ట్రాల్లో రాజకీయాధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఈ ఉగ్రవాద సంస్థల సహాయాన్ని బహిరంగంగా తీసుకోవడం అందరికీ తెలిసిందే. అహింసా సిద్ధాంతం మీద మహాత్మాగాంధీ నేతృత్వంలో నడచిన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ హయాం వచ్చేసరికి తీవ్రవాదమయమైంది.
బాధ్యత గల పార్లమెంటు సభ్యులు సైఫుద్దీన్ సోజ్ వంటివారు బహిరంగంగా ఉగ్రవాదులకు మద్దతునిస్తూ టీవీ చానళ్లలో ప్రసంగిస్తుంటే- ఈ దేశ భవిష్యత్తు ఏమిటి? అన్న ఆందోళన కలుగక మానదు. కశ్మీర్, కేరళ తర్వాత అత్యంత కల్లోలిత రాష్ట్రం బెంగాల్. బంకించంద్, రవీంద్రుడు, అరవిందుడు, స్వామి వివేకానంద పుట్టిన రాష్టమ్రేనా ఇది? అని ఆశ్చర్యం కలుగుతుంది. మొన్నటి వరకు మార్క్సిస్టు ఉగ్రవాదుల మారణహోమంలో నలిగిపోయిన పశ్చిమ బెంగాల్ ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ నేతల దుర్మర్గాలకు బలి అయిపోతున్నది. కనీసం దసరా ఉత్సవాల్లో దుర్గాపూజ చేసుకునే స్వేచ్ఛను కూడా పౌరులు కోల్పోయారు. బెంగాల్ సీఎం మమత తన విధానాలను మార్చుకోకుండా దేశంలో అశాంతికి మోదీ కారణమని ఆరోపణలు చేస్తున్నారు. ‘మాజోలికి వస్తే అడ్డంగా నరికేస్తాం’- అని ఆమె ఇటీవల బెంగళూరులో కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రకటించింది. ప్రస్తుతం ఆమె శారదా చిట్‌ఫండ్ స్కాంలో, నారదా టౌన్‌ల స్కాంలో పీకలలోతు ఆరోపణల్లో కూరుకుపోయి ఉంది. బెంగాల్ హిందూ సంస్థల కార్యకర్తలను బహిరంగంగా ఉరి తీస్తున్నారు. ‘వందేమాతరం సుజలాం సుఫలాం’ అనే బంకించంద్ గేయం పుట్టిన బెంగాల్‌కు పట్టిన దుర్గతి ఇది. ఇక్కడి మాల్దా జిల్లాలో బంగ్లాదేశ్ నుండి వచ్చిన చొరబాటుదారులు దేశ విచ్ఛిత్తి కోసం పనిచేస్తున్నారు.
భారత్‌లో నేడు బయటకు కనిపించే శత్రువులతోబాటు పౌర హక్కుల సంఘాలు, మానవ హక్కుల సంఘాలు, అంతర్జాతీయ ఎమ్మెస్టీ పేరుతో పనిచేస్తున్నవారు ద్రోహం చేస్తున్నారు. జిగ్నేశ్ మెమానీ, యాకూబ్ మెమన్, జకీర్ నాయక్, దావుద్ ఇబ్రహీం వంటి ఉగ్రవాదులకు మానవ హక్కులుంటాయి. కానీ, హిందూ సంస్థల కార్యకర్తలకు, జాతీయవాదులకు మాత్రం అలాంటి హక్కులు ఉండవు!
జమ్మూ కశ్మీర్‌కు కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా నిధులను కేటాయిస్తోంది. సరిహద్దుల్లో దేశాన్ని కాపాడుతున్న భద్రతాదళాలకు వేల కోట్లు కేటాయించింది. ఉగ్రవాదం పెచ్చుమీరడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థను ఇబ్బందుల్లో పెట్టడంలో పాక్,చైనా, అమెరికా, సౌదీ దేశాలు విజయం సాధించాయి. ప్రశాంత పరిస్థితుల్లోనే దేశాభివృద్ధి జరుగుతుంది. నిరంతరం కల్లోలాలను సృష్టించడంలో మన శత్రుదేశాలు విజయం సాధిస్తున్నాయి. సరిహద్దు శత్రువులపై ప్రభుత్వం దృష్టిపెట్టింది కాని అంతర్గత శత్రువులను ఉపేక్షిస్తోంది. ఒక ప్రశ్నకు కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వారు, క్రైస్తవ- ముస్లిం సంస్థలు, సూడో సెక్యులరిస్టులు సమాధానం చెప్పాలి. 1947లో మతం ప్రాతిపదికగా భారత్‌ను మూడుముక్కలు చేశారు. ఇది జరిగిన తర్వాత కూడా భారత్‌పై కక్ష ఎందుకు? నరమేధం ఎందుకు? అమాయకులను ఎందుకు హత్య చేస్తున్నారో ఈ పార్టీల, సంస్థల నాయకులు సమాధానం చెప్పాలి. పైకి ప్రజాస్వామాన్ని కాపాడాలంటూ, అంతర్గతంగా ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్న నేతలు దేశాన్ని ఎలా రక్షిస్తారు?

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్