మెయిన్ ఫీచర్

నిదుర చా..లా సుఖమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలామంది నిద్రపట్టక సతమతమవుతుంటారు. క్రమబద్ధమైన అలవాట్లను పాటిస్తే మంచి నిద్ర సొంతమవుతుంది. రోజూ నిద్రపోతూనే ఉంటాం. అందుకే నిద్ర గురించి ఎప్పుడూ పెద్దగా పట్టించుకోం. నిశ్చింతగా నిద్ర అన్నది ఏదో కొద్దిమందికి దక్కే అదృష్టంలా తయారైంది. నిద్ర లేక, నిద్ర రాక, నిద్ర చాలక ఇలా ఎంతోమంది రోజూ ఏదో నిద్ర చికాకు అనుభవిస్తూనే ఉన్నారు. అందుకే ఆధునిక వైద్య రంగం నిద్రమీద ఇపుడు లోతుగా పరిశోధనలు చేస్తూ నిద్రకు సంబంధించి ఎన్నో ఆసక్తికర అంశాలను, రకరకాల చికిత్సలను ఆవిష్కరిస్తోంది. తిండి తినకుండా 20 నుంచి 40 రోజుల వరకు ఉండొచ్చు కానీ నిద్ర పోకుండా మాత్రం ఎక్కువ రోజులు ఉండటం అసాధ్యం. ఒక్కరోజు సరిగా నిల్రేకుంటే పనిచేస్తున్నపుడు మధ్యలోనే కనుకుపాట్లు, తలనొప్పి ముంచుకొస్తుంటాయి. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్తవ్రేత్తల సర్వే ప్రకారం ఓ మనిషి నిద్రపోకుండా 264 గంటలు అంటే 11 రోజులపాటు ఉండగలడట. అంతకుమించితే చావును చూడాల్సి వస్తుందని సర్వే చేసినవారు తేల్చి చెప్పారు. వేగంగా దూసుకెళుతున్న నేటి తరంలో నిద్రపై శ్రద్ధ తగ్గుతోంది. రాత్రిపూట తక్కువ నిద్రపోవడంతో దాని ప్రభావం ఉద్యోగంపై, చదువులపై తీవ్రంగా ఉంటోంది.
చేపలు, బీన్స్, పెరుగు, ఆకుకూరలను తినడం ద్వారా మంచి నిద్ర వస్తుందని న్యూట్రిషన్లు చెబుతున్నారు. బీన్స్, బఠానీ, చిక్కుడు కాయల్లో బి6, బి12 విటమిన్లతోపాటు ఫోలిక్ ఆసిడ్స్ ఉంటాయి. ఈ బి విటమినే మనకు మంచిగా నిద్రొచ్చేలా పనిచేస్తుందట. ఆకుకూరల్లో ఇనుము శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా నిద్రలోకి జారడానికి మందులా పనిచేస్తుంది. అలాగే ఫాట్‌లెస్ పెరుగులో కూడా కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. పెరుగులోని కాల్షియం, మెగ్నీషియంల ప్రభావంతో అత్యంత వేగంగా నిద్రలోకి జారుకుంటారని వైద్యులు చెబుతున్నారు. నిద్రాభంగాలకు ముఖ్య కారణం అయినట్టి ఒత్తిడి మరి ఉద్రేకతలు నిద్రను భంగం కలిగిస్తాయి. కాబట్టి నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నవారు బి విటమిన్ వున్న పదార్థాలు, రెండు రోజులకోసారి ఆకుకూరలు తీసుకోవడంతోపాటూ పెరుగు తినడం ద్వారా నిద్రలేమిని దూరం చేసుకోవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు.
తక్కువ నిద్ర ఎక్కువ నిద్ర ఈ రెండూ ఆరోగ్యానికి మంచివి కావు. అపుడే పుట్టిన పిల్లలు 18 గంటలు నిద్రపోవాలని, చిన్నపిల్లలు 11 గంటలు నిద్రపోవాలని, టీనేజీలోవుండేవారు 10 గంటలు నిద్రపోవాలని నిపుణులు అంటున్నారు. నిద్రలేమికి కారణం అనారోగ్యమని చెప్పడం కష్టమని, కానీ నిద్రలేమి, అనారోగ్యం ఒకదానికొటి ముడిపడి ఉన్నాయని లండన్‌లో ట్రినిటీ కాలేజ్ ప్రొఫెసర్ షేన్ ఓమారా తెలిపారు.
పగటిపూట కనీసం ఓ గంట పాటు వ్యాయామం, శారీరక శ్రమ చెయ్యటం మంచిది. వీలైనంత వరకు సాయంత్రం 5 దాటిన తర్వాత టీ, కాఫీలు తాగరాదు. కాఫీ, టీ, కోక్‌లు ఉత్తేజం కలిగిస్తాయి కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిత్యం నిద్ర విషయంలో కచ్చితమైన సమయం పాటించాలి. ఆ నిద్రా సమయానికి కనీసం గంట ముందు వరకు ఎలాంటి ఉద్రేకలకు గురికాకుండా చూసుకోవాలి. అంటే ఉత్తేజాన్ని కలిగించే పదార్థాలు తీసుకోకపోవడం, ఉద్రేకం కలిగించే టీవీ కార్యక్రమాలు, సినిమాలు చూడకపోవడం మేలు. గదిలో తక్కువ కాంతి ఉండేలా, అవసరమైతే లైటు లేకుండా చూసుకోవాలి. పడుకున్నాక అరగంట దాటినా నిద్రపట్టకపోతే మంచంపైనే అటూ ఇటూ దొర్లటం కాకుండా, గదిలోంచి బయటకు వచ్చి పత్రికలో పుస్తకాలో చదవటం మొదలుపెట్టాలి. తిరిగి కళ్లు మూతలు పడుతున్న సమయంలో మంచంపైకి చేరుకోవాలి. నిద్రకు ఉపక్రమించటానికి ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేయటం, వేడి పాలు తాగటం మంచిది. నూనె, మసాలా పదార్థాలు తీసుకోరాదు. యోగా, బ్రీతింగ్ ఎక్స్‌ర్‌సైజ్, ‘జాకబ్‌సన్స్ మజిల్ రిలాక్సేషన్’ వంటి పద్ధతులు కూడా నిద్ర పట్టటానికి ఉపయోగపడతాయి. ఈ జాగ్రత్తలు పాటించినా నిద్రపట్టకపోతే మాత్రల గురించి ఆలోచించాల్సిన అవసరం వుంటుంది.
నిద్రలేమి అనేది కొందరిలో రెండు మూడు వారాల తర్వాత దానంతట అదే సద్దుకుంటుంది. కాబట్టి వెంటనే మందులు వాడకపోవటం మంచిది. మనసుని ఇతర కార్యక్రమాలపై మళ్లించటం, నడక, వ్యాయామం వంటి వాటివల్ల తిరిగి మామూలు స్థితికి వచ్చే అవకాశం వుంటుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన, జీవితంలో సమస్యలు ఇలా ఏదో కారణంతో నిద్రలేమి వస్తుంటుంది. అన్నీ బాగుండి నిద్ర తగ్గటం అరుదు.
మందులకి తొందర వద్దు
నిద్రపట్టేందుకు ఇచ్చే మందులు కేవలం చివరి మార్గంగానే వాడాలి. నిద్ర మాత్రలకు శరీరం త్వరగా అలవాటుపడుతుంది. ఈ మందులను ఏ మోతాదులోనైనా మూణ్నెల్లపాటు వరుసగా వాడుతుంటే శరీరం వాటిమీద ఆధారపడటానికి అలవాటుపడిపోతుంది. దీంతో మందుల మోతాదు పెంచాల్సి వస్తుంటుంది. వాటి మోతాదు పెంచితే ఇతర దుష్ప్రభావాలు చాలా ఎక్కువ. చాలామంది నిద్రమాత్రలకు అలవాటుపడ్డాక.. ఇక వాటిని వేసుకోకపోతే నిద్ర పట్టదేమో అన్న భయంతో కొనసాగిస్తుంటారు. నిద్ర మాత్రలకు దీర్ఘకాలం అలవాటుపడితే కండరాల బలహీనం, పటుత్వం తగ్గటం వంటివి కనబడతాయి. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి లోపిస్తాయి. విషయగ్రహణ శక్తి తగ్గుతుంది. మరీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే కాలేయంపైనా ప్రభావం పడుతుంది. వీటిని దీర్ఘకాలం వాడకూడదు. చక్కటి నిద్ర జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకున్న తర్వాత నిద్రపోతే అది బాగా గుర్తుంటుందని ప్రయోగాల్లో రుజువైంది.

-మైత్రేయ వైనతేయ