మెయిన్ ఫీచర్

విలువలతోనే... సంతోషాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేర్వేరు ప్రదేశాల్లో వేర్వేరు సంప్రదాయాల్లో ఇరవై యేళ్లు పెరిగిన వివాహం అనే ఒక ప్రక్రియతో ఒక్కటై ఒక కుటుంబంగా ఏర్పడుతారు. అప్పటిదాకా ఇద్దరు వ్యక్తులు వారి వారి సొంత ఆలోచన్లతో ఉంటారు. ఎవరి జీవిత ద్యేయాలు వారికుంటాయి. ఎవరి గోల్స్ వారికుంటాయి. కాని, పెళ్లి అనే తంతుతో వారిద్దరి అభిరుచులు, అభిప్రాయాలు ఒక్కటి పోతాయి. నిన్నటి దాకా నేను అనేవారు కాస్త మేము అంటారు. మేము మాది అనే భావన వస్తుంది. ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరికి ఒకరు తోడుగా నిల్చుని జీవన పోరాటాన్ని రెండు చేతుల్లా చేసి చివరకు విజయాన్ని సాధిస్తారు. ఇది చదవడానికి చాలా బాగుంటుంది. ఎవరైనా చెబితే వినడానికి బాగుంటుంది. కాని నిజంగా అనుభవించడం అంటూ వస్తే కాస్త కష్టమనే చెప్పాలి.

కేవలం ఒక్క మ్యారేజ్ అనగానే రెండు మనసులూ ఒకటై పోవు. కాస్త కాల విలంబన తరువాత ఒకరి అభిప్రాయలు మరొకరు తెలుసుకొంటూ, ఒకరి అభిరుచులు మరొకరు తెలుసుకొంటూ పోతే చివరకు మనకు అని అనుకొన్నప్పుడు వారిద్దరూ ఒక్కరుగా మిగులుతారు. దీనికి రెండు కుటుంబాలల్లోని వ్యక్తులంతా సహకారం అందించాలి. అత్త అనే అర్హత కలవారు ఇది నా ఇల్లు నేను చెప్పినట్టే వినాలి అని మంకు పట్టు పడితే నేనెందుకు వినాలి. నాదే ఇల్లు అనుకొని వచ్చాను అని కోడలు అంటే అక్కడ గొడవే.
కాని వారిద్దరూ ఇంట్లో అందరి గురించి ఆలోచించి కోడలు పెద్దరికానికి విలువనిచ్చి అత్త కొత్తనీటిని అప్యాయంగా ఆహ్వానిస్తే అక్కడ అంతా నవ్వుల పువ్వులేర్పడుతాయి. కోడల్ను కూతురుగా చూసే రోజులు ఇపుడిప్పుడే వస్తున్నాయి. కానీ విడిగా ఉండే పేరెంట్స్ కూడా ఈరోజుల్లో ఎక్కువ అవుతున్నారు. దీనికి కారణం ఎక్కువ ఇగో నే అని సర్వేలు చెబుతున్నాయి. నేను సంపాదిస్తున్నాను అని ఎవరికి వారు అనుకొంటే గోల మొదలవుతుంది. అట్లాకాక సంపాదనను ఎలా ఖర్చు పెట్టాలి. ఎంత కష్టపడితే ఈ సంపాదన మనకు వచ్చింది. దీనిని ఖర్చు పెట్టడంలో దేనికి ప్రాముఖ్యత నివ్వాలి అని ఇద్దరూ సానుకూలంగా ఆలోచిస్తే అంతా సజావుగా నడుస్తుంది. ఏదైనా ఇద్దరూ కలసి చేయాలి. ఒకసారి భర్త మాటలకు విలువనిస్తే ఇక ఎపుడూ నా మాటలే వినాలనే భర్త మంకు పడితే అది భార్యకు చిరాకు తెప్పించవచ్చు. ఎందుకంటే ఆర్థిక భారాన్ని మోసినా మోయకపోయినా కొన్ని బాధ్యతలు ఆమె కూడా నిర్వర్తించాల్సి ఉంటుంది. కనుక భార్య చెప్పేవి వినాలి. ఆమెకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలి. తను చేయదల్చుకున్న పనులకు తోడ్పాటును అందించాలి. అపుడే భార్య మరింత ఆనందంతో ఇష్టపడి కష్టమైన పనులు కూడా చేస్తుంది.
జీవిత భాగస్వామితో తమ వైవాహిక జీవితంలోని మరపురాని మధుర క్షణాల గురించి మాట్లాడుతుండాలి. అలాంటి ప్రస్తావనవల్ల ఇద్దరి మధ్యా ప్రేమ పూరిత వాతావరణం నెలకొని అనుబంధం మరింత బలపడుతుంది.
చిలిపి మాటలు, సరసాలు, జోక్స్‌లాంటివి, భార్యాభర్తలమధ్య ప్రేమానురాగాలను పటిష్టపరుస్తాయి .సమస్యలను మొగ్గలోనే తుంచివేస్తూ, సర్దుకుపోతూ, అవగాహనతో ఉంటే దాంపత్య జీవితం ఎలాంటి ఆటుపోట్లకూ గురికాదు. కలకాలం నిత్య నూతనంగా కొనసాగుతుంది.
మీ మీ జీవిత భాగస్వామి గురించిన చెడు అలవాట్లు తెలిస్తే ఒక్కసారిగా విరుచుకుపడటం, ఆంక్షలు విధించటం లాంటివి చేయకుండా ప్రేమతో నచ్చచెబుతూ తనకు తానుగా చెడు అలవాటుని వదులుకునేలా చేయగలగాలి. భార్యభర్తలిద్దరూ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఎవరి అలవాట్లు అయనా చెడ్డవే కావచ్చు గాక కాని ఆయా వ్యక్తులు చెడ్డవారు కాకపోవచ్చు.
కనుక ఇద్దరూ అభిప్రాయాలకు విలువ ఇస్తూ గౌరవించుకుంటే సమస్యలు అంతగా బాధించవు. ఇక అప్పుడు ఆ ఇల్లు నందన వనం అవుతుంది. ఇష్టపడితే కష్టమైనా బరువు అనిపించదు. అందుకే ముందు పనులైనా, మనుష్యులనైనా ఇష్టపడాలి. ఆతరువాత బరువు బాధ్యతలు మోయాలి. అవి సునాయాసంగా ఉంటాయి.

-వెంకట లక్ష్మి