మెయిన్ ఫీచర్

విశ్వగురు ‘దివ్యపర్యటన’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వశాంతికి ప్రపంచంలోని మహానుభావులు నిరంతరం కృషి చేస్తున్నారు. సమాజం శాంతియుతంగా ఉంటే ప్రజల జీవనం సాఫీగా కొనసాగుతుంది. ప్రపంచంలో అభివృద్ధి చెందిన అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, జర్మనీ తదితర దేశాల ప్రజలైనా, పేదరికంతో ఉన్న నేపాల్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనీస్తాన్ లాంటి దేశాల్లోని ప్రజలైనా ప్రశాంతంగా, స్వేచ్ఛగా జీవించేందుకే ఇష్టపడతారు.
సనాతన భారతీయ ధర్మమే ప్రపంచానికి శాంతిని, వెలుగును అందిస్తుంది. ఈ సూక్ష్మం తెలిసిన స్వామి ‘రామా’, స్వామి ‘వివేకానంద’ తదితరులు చాలా కాలం క్రితమే అమెరికాలో దివ్యపర్యటన చేశారు. ప్రస్తుతం భగవాన్ విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ 2001 నుండి ఏటా అమెరికాలో దివ్యపర్యటన చేస్తున్నారు. ఈ దివ్యపర్యటనలో భాగంగానే 2018 జూలై 15 న అమెరికా వెళుతున్నారు. అమెరికాలోని సీటెల్‌లో తొలిపాదం మోపే విశ్వంజీ కాలిఫోర్నియా, చికాగో, చార్లోట్, నార్త్ కరోలినా, రెలిగ్, వర్జీనియా, మేరీలాండ్, వాషింగ్టన్, యార్క్, హ్యారిస్‌బర్గ్, న్యూజెర్సీ, న్యూయార్క్, బోస్టన్‌లలో పర్యటిస్తారు. అలాగే సీటీ, మిన్నీపొలిస్, డల్లాస్, ఆస్టిన్, సనాన్‌టోనియా, జాక్సన్, మిసిసిపీ, మేంఫిస్, నాక్స్‌విల్లే, కోలంబస్, డేటన్, టొలేడో, పిట్స్‌బర్గ్, అట్లాంటా, ఫ్లోరిడా, డేన్వర్ తదితర ప్రాంతాల్లో పర్యటిస్తారు. వైట్‌హౌజ్‌లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీస్ ఏర్పాటు చేసే ప్రపంచ శాంతి సమావేశంలో పాల్గొంటారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఏర్పాటు చేసే సమావేశంలో పాల్గొంటారు. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసే యూత్ అసెంబ్లీలో పాల్గొంటారు. మేంఫిస్‌లో ‘చేంజ్’ అనే సంస్థ ఏర్పాటు చేసే సమావేశంలో పాల్గొంటారు. కాలిఫోర్నియాలో జరిగే యూఎస్‌ఏ జాతీయ సమ్మేళనంలో పాల్గొంటారు. వివిధ ప్రాంతాల్లో మతపరమైన సంస్థలు, ధార్మిక సంస్థలు ఏర్పాటు సమావేశాల్లో పాల్గొంటారు.
దేదీప్యమానంగా భారత్
అమెరికా పర్యటనకు వెళ్లే సమయంలో ఆంధ్రభూమి (ధర్మభూమి) ప్రతినిధితో విశ్వయోగి మాట్లాడారు. 2020 వరకు భారతదేశం ప్రపంచంలో దేదీప్యమానంగా వెలిగిపోతుందన్నారు. నేడు ప్రపంచం శాంతికోసం తపిస్తోంది అన్నారు. ప్రపంచ దేశాలన్నీ భారత్‌వైపు చూస్తున్నాయన్నారు. సనాతన ధర్మమే భారతదేశ కీర్తిప్రతిష్టలను అంతర్జాతీయంగా ఇనుమడింప చేస్తుందన్నారు. ప్రపంచంలో తీవ్రవాదం సమసిపోతుందన్నారు. అణ్వాయుధాలు కలిగిన దేశాలు కూడా శాంతి ప్రక్రియ చేపడుతాయని తాను అనేక సార్లు చెప్పానని అన్నారు. అమెరికా-ఉత్తర కొరియా దేశాధినేతలు ఇటీవల జరిపిన శాంతిచర్చలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. భారతదేశానికి పొరుగుదేశాలతో స్నేహపూర్వక సంబంధాలు నెలకొంటాయని వెల్లడించారు.
కనీస అవసరాలు
ప్రతి మనిషికి తిండి, బట్ట, ఇల్లు, వైద్యం, విద్య అందుబాటులో ఉండాలి. ఈ ఐదు అవసరాలను ప్రపంచలోని అన్ని దేశాల నేతలు తమ తమ దేశాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు అన్ని దేశాల అధినేతలు, పాలకులు విధాన నిర్ణయాలను తీసుకోవాలని విశ్వయోగి సూచించారు. ఏ దేశంలో అయితే ఈ కనీస అవసరాలు ప్రజలందరికీ అందుబాటులో ఉంటాయో, ఆ దేశాలు అభివృద్ధిచెందినట్టే. ప్రతి మనిషి భౌతికంగా, మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలని స్వామి సూచించారు.
పృథ్వీమాతను కాపాడాలి
పృథ్వీమాతను కాపాడుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని విశ్వయోగి విశ్వంజీ పేర్కొన్నారు. పంచభూతాలూ కలుషితం అవుతున్నాయని, వీటిని కాలుష్యరహితంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ప్రకృతి కాలుష్యరహితంగా ఉంచేందుకు ప్రపంచంలోని దేశాధినేతలంతా విధాన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ప్రకృతి కలుషితం అయితే పంచభూతాల మధ్య సమతుల్యత లోపిస్తే వైపరీత్యాలు వస్తాయని, గత కొంత కాలంగా ఈ పరిస్థితి నెలకొని ఉందని గుర్తు చేశారు. అమెరికా అధ్యక్షుడు, భారత ప్రధాన మంత్రితో సహా దేశాధినేతలందరినీ తాను ఇదే విషయంపై విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. పంచభూతాల పరిరక్షణ, తన అమెరికా పర్యటనలో అతిముఖ్యమైన భాగమన్నారు. అమెరికాలోని ప్రజలకు, మేధావులకు, శాస్తవ్రేత్తలకు, డాక్టర్లకు, ఇంజనీర్లకు తన సందేశం అందితే ప్రపంచానికి అందినట్టేనని వివవరించారు. అమెరికా మినీ ప్రపంచం లాంటిదని, అన్ని దేశాలకు చెందిన వారు అమెరికాలో ఉంటున్నారని అన్నారు. సనాతన భారత సందేశం ప్రపంచానికి చేర్చేందుతు తన వంతు ప్రయత్నిస్తున్నానని వివరించారు. భారతదేశం-అమెరికా కలిసి పనిచేస్తే ప్రపంచం అంతా బాగవుతుందన్నారు. అమెరికా మెదడులాంటిదైతే, భారత్ హృదయం లాంటిదని, హృదయం స్వచ్ఛమైన రక్తాన్ని మెదడుకు అందిస్తే, మెదడు శరీర భాగాల్లా ఉన్న దేశాలకు మంచి రక్తాన్ని అందిస్తుందని, తద్వారా ప్రపంచ శాంతి ఏర్పడుతుందని వివరించారు.

- పి.వి. రమణారావు 9849998093