మెయన్ ఫీచర్

‘జాతీయవాదం’ అంతమే వారి ధ్యేయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొఫెసర్ సౌందర్యరాజన్ చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన నిర్వాహకుడు. ఆయన కుమారుడైన రంగరాజన్ ఈ ఏడాది ఏప్రిల్ 12న మునివాహనాళ్వార్ తిరుమహోత్సవం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఆళ్వారులలో మునివాహనుడొకడు. ఇతడు అంత్యజుడు. ఐనా విష్ణ్భుక్తి వల్ల సత్‌బ్రాహ్మణుల చేత పల్లకీ మోయించుకున్నాడు. ఆళ్వారులలో బ్రాహ్మణేతరులు కూడా ఉన్నారు. భగవద్రామానుజులు కులవివక్ష లేకుండా అందరినీ విశిష్టాద్వైత వేదాంత పరిధిలోనికి తీసుకొని వచ్చాడు. ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్ ‘మునివాహనుడు’ పేరిట ఓ నాటకం రచించి, విజయవాడలో ప్రదర్శింపజేశాడు. ఇనాక్ దళితుడు. నాటకంలో డాక్టర్ అక్కిరాజు సుందరరామకృష్ణ వంటివారు పాల్గొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ నాయకుడు సోమయాజులు ఉపన్యాసం ఇచ్చారు. ఆదిశంకరాచార్యులు వెళ్తుండగా ఒక అంత్యజుడు ఎదురుపడ్డాడు. పక్కకు తప్పుకో అని శంకరుడు అన్నాడు. ‘ఎవరిని తప్పుకోమంటున్నారు? ఈ శరీరాన్నా? ఆత్మనా?’ అని ఆ దళితుడు ఎదురు ప్రశ్న వేశాడు. దాంతో ఆదిశంకరులకు జ్ఞానోదయమైంది.
కర్ణాటకలో బసవన్న అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన 12వ శతాబ్దానికి చెందిన సంఘ సంస్కర్త. ఒక బ్రాహ్మణ స్ర్తిని అంత్యజునికి ఇచ్చి వివాహం చేయించాడు. దాంతో రాజధాని అయిన కళ్యాణ నగరంలో సాంఘిక విప్లవం వచ్చింది. ఫలితంగా బసవన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ఎం.ఎస్.సూర్యనారాయణ ‘హరికథా భిక్షువు’అనే గ్రంథం రచించాడు. అందులో శ్రీపతి పండితుడు (11వ శతాబ్దికి చెందిన శైవ ప్రవక్త) దళిత పక్షపాతి. ఆయన నిప్పును పంచెలో మూటకట్టి జమ్మిచెట్టుకు కట్టాడు. ఈ ఉదంతాలన్నింటిలోనూ బ్రాహ్మణుడు దళితుడి గొప్పతనాన్ని గుర్తించటం కన్పడుతున్నది.
ప్రస్తుతం మన దేశంలో దళితోద్యమం సాగుతోంది. రాజకీయంగా దళిత సంతుష్టీకరణ జరగకపోతే ఏ పార్టీ కూడా మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ముఖ్యంగా మహాత్మా గాంధీ, కేశవరావు బలీరాం హెడ్గేవార్ (ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు) వంటివారు సామాజిక సమరసతను సాధించే నిమిత్తం అస్పృశ్యతను నివారించారు. ‘అంటరానితనం పాపం కాకపోతే మరేదీ పాపం కాదు’ అని ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు, బ్రాహ్మణుడైన బాలాసాహెబ్ దేవరస్ ప్రకటించాడు. జాతీయోద్యమంలో కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, మారేమండ రామచంద్ర శాస్ర్తీ, ఉన్న వ లక్ష్మీనారాయణ పంతులు వంటివారు హరిజన ఉద్ధరణ, దేవాలయ ప్రవేశం వంటి ఉద్యమాలు నిర్వహించారు. ‘అంటరాని వారెవరో కాదు.. మా వెంటరానివారె’- అని పాటలు పాడారు. ‘కులగోత్రాలు మలమూత్రాలు’ అని ప్రచారం చేశారు. ఇదంతా చేసింది బ్రాహ్మణులే. బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్, జ్యోతిరావుపూలే, సావిత్రీబాయి పూలే వంటి దళిత నాయకుల జయంతులు, వర్ధంతులను నేడు ఏటా వాడవాడలా జరుపుతున్నారు. ఈ కార్యక్రమాలను పోటీపడి అన్ని రాజకీయ పార్టీలు అత్యుత్సాహంతో నిర్వహిస్తున్నాయి. నేటి ఆధునిక సమాజంలో జరుగుతున్న కులాంతర వివాహాల్లో బ్రాహ్మణ కన్యను దళితుడు వివాహమాడుతున్నాడు. మారుతున్న సామాజిక పరిస్థితులకు ఇవే సాక్ష్యాలు.
ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ యాక్ట్‌ప్రకారం ఒక దళితుడు- తనను వేరే కులస్థుడు కులం పేరుతో దూషించాడని పోలీసుస్టేషన్‌లో రిపోర్టు చేస్తే వెంటనే కేసు నమోదుచేస్తారు. ఇలాంటి ఉదంతాల్లో ప్రాథమిక విచారణ జరిపి కేసు నమోదు చేయండని ఇటీవల సుప్రీం కోర్టు సూచించగా, దళిత సంఘాల వారు ఆగ్రహించి భారత్ బంద్ నిర్వహించారు. ఆస్తుల దహనాలు, పోలీసు కాల్పులు జరిగాయి. కొందరు చనిపోయారు. ఈ విధ్వంసం వెనుక రాజ్యాధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ప్రమేయం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏమంటే- 1947కు ముందు జరిగిన హరిజనోద్యమం వేరు. ఇప్పుడు జరుగుతున్న దళితోద్యమం వేరు.
‘దళితులకు రాజ్యాధికారం’ అనేది నేటి నినాదం. ‘అగ్ర కుల పౌరోహిత వర్గాల ఆధిపత్యం నశించాలి’ అనేది మరో డిమాండ్. ‘ముస్లిం, క్రైస్తవ, దళిత, కమ్యూనిస్టుల ఐక్యత వర్ధిల్లాలి’ అనేది ప్రధాన రాజకీయ ఎజెండా. దీనికే ‘లాల్ నీల్ ఐక్యత’ అని పేరు. లాల్ అంటే ఎర్రజెండా, నీల్ అంటే దళిత జెండా. తమిళనాడులో ద్రవిడోద్యమం విజృంభించినప్పుడు బ్రాహ్మణులంతా ఆర్యులు. వీరు ఉత్తర భారతానికి చెందినవారు. రాముడు ఆర్యుడు, రావణుడు ద్రవిడుడు, సత్పురుషుడు అని ప్రచారం చేశారు. శ్రీరాముని విగ్రహానికి చెప్పుల దండలు వేసి ఊరేగించారు.
ఈ ఉద్యమాలన్నింటి వెనుక దళిత ఆధిపత్యాన్ని కొందరు బ్రాహ్మణులే ప్రోత్సహించటం గమనార్హం. ‘మహాత్మా గాంధీ దళితుల ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళాడు’ అంటే- ‘మా కుండలో అన్నం తింటే మాకే నష్టం’ అని కొందరు అప్పట్లో అన్నారు. ఆఫ్రో-క్రిస్టియన్ ఉద్యమ ప్రభావం మన దేశంపై 20వ శతాబ్దంలో పడింది. ఆఫ్రికాలో ‘నలుపు-తెలుపు’ భేదాన్ని భారత్‌లో కొందరు ‘దళిత, దళితేతర’ భేదంగా భావించారు. దీనినే దక్షిణ భారతంలో ఆర్య, ద్రావిడ విభేదం అన్నారు. కొందరు వ్యక్తులు ప్రభుత్వ నుంచి ఉపకారాలు, రాజకీయ లబ్ధిపొందుతూ క్రైస్తవులుగా విదేశీ నిధులు సంపాదించుకొని మతాంతరీకరణను ప్రోత్సహిస్తున్నారు. రామాలయం లేని కుగ్రామాల్లో సైతం చర్చిలు వెలిశాయి. ఇది 1947-2017 మధ్య దేశంలో ఒక మహోద్యమంగా సాగింది. ఈ క్రైస్తవీకరణాన్ని ఏ శక్తీ అడ్డుకోలేకపోయింది. తిరుపతిని హిందువుల పుణ్యక్షేత్రం అంటారు. కాని అక్కడ నలభై చర్చిలు ఉన్నాయి. తిరుమలలో పనిచేసే ఉద్యోగుల ఇళ్ళల్లో అన్యమత దేవుళ్ల చిత్రపటాలు ఉండటం తెలిసిందే. ఈ క్రైస్తవీకరణాన్ని అడ్డుకునే నిమిత్తం ‘దళిత గోవిందం’ అనే కార్యక్రమాన్ని టీటీడీ చేపట్టింది. దళిత వాడలకు వెంకన్న విగ్రహాలను తీసుకుపోవటం, అక్కడ వెంకటేశ్వరుని గుడులు కట్టించడం వంటి కార్యక్రమాలు మొదలుపెట్టారు.
రాజీవ్ మల్హోత్రా, అరవింద నీలకందన్ అనే ఇరువురు విద్వాంసులు ‘బ్రేకింగ్ ఇండియా’ పేరిట ఓ పరిశోధనాత్మక గ్రంథం వెలువరించారు. అంతర్జాతీయ సమాజం భారతదేశాన్ని ఎలా జయించాలని వ్యూహరచన చేసిందో ఈ పుస్తకంలో గణాంకాలు, ఇతర సాక్ష్యాలతో వివరించారు. దళితోద్యమం, ద్రవిడోద్యమం పేరుతో దేశాన్ని ఎలా ముక్కలు చేయాలని కొందరు వ్యూహరచన చేశారో ఇందులో పేర్కొన్నారు. అగ్రవర్ణాలపై విమర్శలు చేస్తూ క్రైస్తవ మత ప్రచారకుడు ప్రొఫెసర్ కంచె ఐలయ్య ‘హిందూ మతానంతర భారతం’ అనే పుస్తకం రాశాడు. భారత్‌లో హిందూ మతం అంతరించిపోయిందని ఈయన తీర్మానించాడు. ఇలాంటి గ్రంథ రచనలకు, మతాంతరీకరణలకు అమెరికాలోని కొలరాడోనుండి భారీగా నిధులు అందుతున్నాయి. గత ఏడాది గుజరాత్‌లో ఎన్నికలు జరిగినప్పుడు అహమ్మదాబాద్ ఆర్చి బిషప్- ‘హిందూ నేషనల్ ఫోర్స్‌ను ఓడించండి’ అని హుకుం జారీచేశాడు. ఇక్కడ ‘హిందూ జాతీయశక్తి’ అంటే భారతీయ జనతాపార్టీ అని ఆయన తాత్పర్యం.
కర్నాటకలో లింగాయతులు హిందువులు కారు. వారు మైనారిటీ మతస్థులు అంటూ గత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒక తీర్మానం ఆమోదించాడు. నటుడు కమలహాసన్ ‘నేను కమ్యూనిస్టును-బిజెపిని ఓడిస్తాను’ అని ప్రకటించాడు. అగ్రవర్ణానికి చెందిన సీతారాం ఏచూరి దళితులు, కమ్యూనిస్టులు ఏకం కావాలని పిలుపునిచ్చాడు.
ఈ ఉదాహరణలన్నింటినీ పరిశీలిస్తే బ్రాహ్మణ సంస్కృతిని నిర్మూలించే ఉద్యమాల వెనుక బ్రాహ్మణుల నాయకత్వమే ఉండడం చాలా సందర్భాల్లో కన్పడుతున్నది. ఇఎంఎస్ నంబూద్రిపాద్, సోమనాథ్ ఛటర్జీ, వరవరరావు, హిరేన్ ముఖర్జీ, మమతా బెనర్జీ, గోపరాజు రామచంద్రరావు(గోరా), గుడిపాటి వెంకటచలం, రాచకొండ విశ్వనాథశాస్ర్తీ వీరంతా బ్రాహ్మణ కులస్థులే అయినా సమాజంలో మార్పు కోరారు.
కాగా, దేశంలో హిందూ ధర్మాన్ని నిర్మూలించి వివిధ రాష్ట్రాలను స్వతంత్ర దేశాలుగా మార్చాలని వేర్పాటువాదులు ప్రయత్నిస్తున్నారు. పంజాబ్‌లో ‘ఖలిస్థాన్’ పేరిట స్వతంత్ర దేశ నిర్మాణాన్ని వీరు సమర్ధించారు. బింద్రన్‌వాలా అనే ఉగ్రవాదికి కొందరు రాజకీయ నేతలు మద్దతునిచ్చారు. ఛత్తీస్‌గఢ్, అరుణాచల్ ప్రదేశ్‌లలో వందలాది మావోయిస్టులు మాటువేసి మన సైనికులను చంపుతున్నారు. వీరికి చైనానుండి ధనం, ఆయుధాలు లభిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి, కాన్షీరామ్‌లు గతంలోనే అగ్రవర్ణాలపై విష ప్రచారం చేశారు. కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు ఇచ్చివేయండి అంటూ కొందరు కమ్యూనిస్టులు ఉద్యమం మొదలుపెట్టారు. ద్రవిడ స్వతంత్ర దేశం నిర్మించడానికి సైతం మద్దతునిచ్చారు. లింగాయతులు హిందువులు కారంటూ కర్నాటకలో చిచ్చు రగిలించారు. ఇలా ఎక్కడ వేర్పాటువాద ఉద్యమాలు వచ్చినా వాటికి ధన సహాయం అందించారు. భారతదేశంలో ఉన్నది ‘బహుళ జాతి సమ్మేళనం’ అని ప్రచారం చేశారు. ద్రవిడోద్యమం, సూడో అంబేద్కరిజం వంటి ధోరణులు ఎందుకు వ్యాపించాయో, దేశంలో హిందూ సంస్కృతిని నిర్మూలించడానికి కొందరు ఎలా ప్రయత్నిస్తున్నారో, వీరికి విదేశాల నుంచి ఎలా నిధులు అందుతున్నాయో అన్న వాస్తవాలు ప్రజలకు తెలియాల్సి ఉంది.

--ప్రొ. ముదిగొండ శివప్రసాద్