మెయిన్ ఫీచర్

ఆలోచనుంటే అవకాశమిదిగో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతకాలం నాడు అయితే ఉద్యోగం చేయాలనుకొన్నవారు ముందుగా ఏదొక డిగ్రీ పాస్ కావాలి. ఆ తరువాత ఉద్యోగానే్వషణలో పడేవారు. కాని నేడు అలా కాదు. అంతర్జాల మహిమతో ప్రపంచం అంతా అరచేతిలోకి వచ్చేసింది. ఎక్కడ చూసినా ఎనె్నన్నో కొత్తకొత్త విషయాలు ప్రతి నిముషమూ తెలుస్తునే ఉంటున్నాయి.
అందుకే నేటి యువతరం ఒక ప్రక్క చదువుకుంటూనే ఉన్నారు. మరో ప్రక్క ఉద్యోగానే్వషణలో ఉంటున్నారు. ఇది కేవలం ఉద్యోగం కోసమే అనుకొంటే పొరపాటే. యువత తమకు ఉన్న అభిరుచుల మేరకు అనుభవాల మేరకు టెక్నాలజీలో వారేం చేయగలరో చూస్తున్నారు. ఒక్కోక్కరిది ఒక్కో ఆలోచన. కొందరు సాయం చేసే మనసున్నవారు ఉంటున్నారు. వారంతా ఎన్జివో అవుతున్నారు. సాయం కావలసిన వారికి అందిస్తున్నారు. ఒకచోట పుట్ పాత్ ల పైన అడుక్కునే వారిని చూసి ఆర్ద్రత పొందినవారు వెంటనే వారికోసం ఏదైనా చేయాలనుకొంటున్నారు. కొందరు వారికి ప్రతిరోజు తిండి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. మరికొందరు వారికి ఉపాధి రంగాన్ని చూపుతున్నారు. కాళ్లు చేతులు లేనివారికి అశక్తులను, ఏ పని చేయడానికి శక్తి లేనివారికోసం అనాథ ఆశ్రమాలను చూపుతున్నారు. దాంట్లో కూడా కొందరు కలసి తిరిగి విరాళాలు సేకరించి డాక్టర్ల సాయం తీసుకొని అటు వారికి తిండి, ఇటు ఆరోగ్యమూ అందేలా చేస్తున్నారు. అవగాహన లేక ఏం చేయడానికి తోచక అయిన వాళ్లని దూరం చేసుకొని నరక యాతన పడేవారిని దగ్గరకు తీసుకొని వారికి ఆసరా కల్పించి జీవితంపై ఆశ కల్గించి వారికి ఉపాధి మార్గాలను చూపిస్తున్నారు. ఇప్పటికాలంలో ఇంజనీరింగ్ చదివి ఉద్యోగాలు లేవు అని బాధపడేవారు బాధ కు స్వస్తి చెప్తున్నారు. వారు వారికి ఉన్న జ్ఞానంతో కొన్ని వెబ్ సైట్స్‌ను, లేక యాప్‌లను తయారు చేస్తున్నారు. వారంతా వారు కావలసిన ఉద్యోగాన్ని వారే కల్పించుకుంటున్నారు.
ఇట్లాంటి వాళ్లు కేవలం వారికోసమే కాదు మరికొందరికి కూడా ఉద్యోగాలను చూపిస్తున్నారు. కలసి ఉంటే దేనినైనా సాధించవచ్చు అని కూడా వీరు నిరూపిస్తున్నారు.
అంతర్జాలం ఇటువంటి యువతకు ఉన్నచోటే ఎన్నో అవకాశాలను కల్పిస్తోంది.అంతే కాదు గూగుల్ మామయ్య అనే ముద్దు పేరుపెట్టుక్నున గూగుల్ సంస్థ కూడా యువతకు ఎన్నో అవకాశాలను కల్పిస్తోంది. గూగుల్ ఐ /ఓ కాన్ఫరెన్స్ అనే సంస్థ యువత కోసం ఎన్నో ఆన్‌లైన్ లో వివిధ కోర్సులను అందిస్తోంది. ఇటువంటి సంస్థలు అనేకం నేడు ఉన్నాయి. విద్యార్థులంతా చదువుకుంటూనే ఖాళీ సమయాల్లో ఈ సంస్థలు అందించే ఆన్‌లైన్ విద్యావకాశాలను అందిపుచ్చుకుని తామేంటో నిరూపిస్తున్నారు.
ఈ మధ్య అపూర్వ తివారీ గూగుల్ యానువల్ డెవలపర్ కాన్ఫరెన్స్ కు హాజరైంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగు చదువుకుంటూ ఈ గూగుల్ యానువల్ డెవలపర్ కాన్ఫరెన్స్‌కు ఈ అపూర్వ ఎన్ని కైంది. తానేమిటో నిరూపించుకుంది. ఇలాంటి సంస్థలు యువ అండ్రాయిడ్ డెవలపర్లకు గూగుల్, ఉపాసిటీ సంస్థలు ప్రత్యేకంగా ఈ ప్రోత్సాహాలను అందిస్తున్నారు. ఈ పోటీల్లో పాల్గొనడానికైనాలేక ఈ సంస్థలు అందించే అవకాశాన్ని వినియోగించుకోవాలనుకొన్న వారు కంప్యూటర్ పోగ్రామింగ్, యాప్‌లను తయారు చేయడం లాంటి వాటి పట్ల ఆసక్తిని కనబర్చాల్సి ఉంటుంది.
నేడు మిలియనీర్ గా బిలియనీర్‌గా ఉంటున్న అమెజాన్ సంస్థ అధినేత కూడా కొత్త ఆలోచనతోనే అన్ని వస్తువులను ఇంటి ముంగిటకు తెచ్చే ఏర్పాట్లు చేసి ఎందరికో ఉపాధిని అందిస్తూ మరెందరో స్ఫూర్తిదాతగా మారారు. కేవలం ఇలాంటి వారి లాగే మనజీవితంలో కూడా పండాలంటే కేవలం ఆసక్తి సరికొత్త ఆలోచన్లు ఉంటే చాలు. కొత్త ఆలోచన జీవన మార్గానే్న మార్చివేస్తుంది. అప్పటి దాకా ఎన్నో కష్టాలు పడి ఉండవచ్చు గాక. కాని, ఓ ఆలోచన వస్తే దాన్ని సరియైన మార్గంలో ఆచరణలోకి తీసుకొని వస్తే చాలు వెంటనే జీవితంగమ్యం మారిపోతుంది. అనుకొన్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. మొదటి మెట్టు ఎక్కడం కష్టం అనిపించవచ్చు. కాని రెండో, మూడో మెట్టు ఎక్కేటప్పటికే యువత మరొకరికి స్ఫూర్తిగా మారుతారు. మరొకరికి మంచి మార్గం చూపిస్తారు. కనుక నేటి యువత ఆలోచన్లకు పదును పెడితే చాలు. అవకాశాలు అంది పుచ్చుకుంటే చాలు.కోరుకున్న గమ్యాన్ని చేరుకుంటారు.

-జి.కల్యాణి