మెయిన్ ఫీచర్

సంస్కృతీ దర్పణాలు - బోనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆషాఢమాసం వచ్చిందంటే చాలు ఎల్లెడలా అమ్మఆరాధనలు కనులపండుగగా కనిపిస్తాయ. అందులోను తెలంగాణ లో అమ్మ ఆరాధనలు జాతర్లుగాను, ఉత్తససాలుగా మరింత వేడుకగా జరుగుతుంటాయ. ఆషాఢమాసం ఆదివారం నాడు ఏ తల్లి దేవాలయం చూసినా బోనాలెత్తుకు వచ్చే ఆడపడచ లు వారి వెంట పోతురాజులు, వారి వెంట ఫలహారపు పండ్లు తండోపతండాలుగా వస్తుంటాయ. అంతేకాదు అమ్మవారి దేవాలయాల్లో జనం ఇసుక వేస్తే రాలనంత మంది గుమిగూడి సాకలు సమర్పించి తమను తమ వారిని చల్లగా చూడమని అమ్మకు మొక్కులు తీర్చుకుంటుంటా రు. గ్రామదేవతలైన ఎల్లమ్మ, మల్లమ్మ, పోలేరమ్మ, అంకాళమ్మ, రేణుకమ్మ, మహాశక్తి అనేక రూపాల్లో గ్రామ దేవతలుగా వెలసి అందరినీ కాపాడడానికి తానే స్వయంగా పురవీధుల్లో తిరుగుతుంది. అనారోగ్యాన్ని కలిగించే వర్షకాలం ఆరంభం అవుతుందని అపుడు తలెత్తే అంటువ్యాధుల బారిన పడకుండా తన పిల్లలను కంటికి రెప్పలాగా కాపాడడానికి అహర్నిశమూ తల్లి ప్రతి ఇంటా కొలువై ఉంటుంది అన్న నమ్మకం తెలంగాణ వాసులకే కాదు సర్వ మానవాళికి ఉంది.
ఈ బోనాల పండుగ తెలంగాణ సంస్కృతికిమచ్చుతునక. ఆషాఢ మాసం తొలి ఆదివారంనాడు మొదలై ఆ మాసమంతా పట్టణాల్లో పల్లెల్లో అట్టహాసంగా లక్షలాది జన సందోహంతో, ఉత్సాహంగా జరుపుకునే జాతర. ఈ జాతరను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. ‘బోనం’ అంటే భోజనం అనే అర్ధం. జగదంబకు భక్తి, శ్రద్ధలతో నివేదించే అన్న కైంకర్యం. అమ్మవారికోసం వండిన అన్నంలో పసుపు లేదా పాలు, బెల్లం వంటి పదార్ధాలను కలిపిన నైవేద్యానే్న బోనంగా పిలుస్తారు. ఈ వండిన బోనాన్ని మట్టి కుండల్లో మహిళలు తలపై పెట్టుకుని బాజా భజంత్రీలతో వెళ్లి అమ్మవారికి నివేదిస్తారు. దీనే్న బోనాల సమర్పణ అంటారు.
అమ్మవారు ప్రకృతి శక్తికి ప్రతీక. ముగ్గురమ్మల మూలపుటమ్మ జగదంబ. సృష్టి స్థితి లయలకు కారణమైన శక్తి. ఈ శక్తినే ప్రకృతిగా పిలుస్తున్నాం. కృతి అంటే సృష్టి. ఈ సృష్టికి ప్రధానమైనది ప్రకృతి. ప్రకృతి శక్తి ఒక్కటే అయినా, విభిన్న రూపాలతో కనపడుతుంది. అవన్నీ దేవతాకృతులే. జగదంబయొక్క అనేకానేక అంశా రూపాలు.
అమ్మను కొలవడానికి కొందరు శాస్త్రాలను, పురాణాలను చదువుతారు. మరికొందరు మంత్రాలతో పూజిస్తారు. అందరూ మాత్రం అమ్మా తల్లీ నన్ను నావారిని చల్లగా కాపాడు తల్లీ నాకు నీవు తప్ప మరెవరూ తెలియదు తల్లీ నీవే నన్ను అన్ని వేళలా కాపాడు అని అర్థిస్తారు. అనేక రూపాలు దాల్చి అందరి చేత కొలువబడే అమ్మ ఆరాధన బోనం. అమ్మను కేవలం మానవులే కాదు దేవతలు సైతం కొనియాడారు. స్తుతించారు. అమ్మలకే అమ్మ జగదంబ. ఆ తల్లి నే వివిధ రూపాల్లో ప్రతివీధిలోను కొలువైంది. ప్రతి ఇంటిలోనూ సుప్రతిష్టమైంది.
జగన్మాత తన పెక్కు కళాంశాలతో గ్రామ దేవతలుగా వెలిసి ప్రజల్ని పాలిస్తున్నదని పురాణాలు కూడా చెబుతున్నాయ. ఏ తల్లి మూడు శక్తుల మూలపు శక్తి స్వరూపిణియో ఆ తల్లే వివిధ పట్టణాల్లో, పల్లెల్లో పలు నామాలతో వెలిసింది. అష్టాశ శక్తి పీఠాలు ఆ తల్లికి ప్రతిరూపాలే.
‘యాయాశ్చ గ్రామ దేవ్యః స్యుస్తాః సర్వాఃప్రకృతే కళాః’ అంటే ఆ శక్తి యొక్క అంశలే గ్రామ దేవతలుగా పిలువబడుతున్నాయని దేవీ భాగవతం చెబుతుంది. ఈ గ్రామ దేవతల ఆరాధనతో వారి అనుగ్రహం పొంది వారి వారి ప్రాంతాల్లో ఎటువంటి అరిష్టాలు కలుగకుండా గ్రామస్తులంతా సుఖ సంతోషాలను పొందుతారని విశ్వాసం.
మన రాష్ట్రంలో ఎల్లమ్మ, పోలేరమ్మ, అంకమ్మ, నూకాలమ్మ, బంగారమ్మ, మైసమ్మ, పోలాలమ్మ వంటి పేర్లన్నీ ఈ కోవలోనివే.
ఆడిమాసం అనే పేరుతో మన పొరుగు రాష్ట్రం తమిళనాడులో శక్తి ఆరాధన పేరుతో ప్రజలంతా ఆరాధించి యజ్ఞ ద్రవ్యమైన అన్న సమర్పణ చేస్తారు. ప్రకృతి శక్తి వల్లనే మనకు సస్యాదులు, ఆరోగ్యం, స కాల వర్షాలు కురుస్తాయని నమ్మకం. ఈ ఆరాధనలు ఏనాడు వమ్ము కాలేదు. అలా ప్రారంభమైనదే బోనాలమ్మ పండుగ.
చారిత్రిక విశేషాలు :
చారిత్రకంగా బోనాలమ్మ వేడుకలు కాకతీయుల కాలంనుంచి ఉన్నాయ.ఆ తరువాత గోల్కొండ నవాబులు ఈ ఉత్సవాలను నిర్వహించినట్టు మనకు సాక్షాధారాలులభ్యమవుతున్నాయ. గోల్కొండ కోటలో వెలిసిన జగదంబ మహంకాళి ఆలయంలో ఆషాఢ మాసం మొదటి ఆదివారంనాడు ప్రారంభమయ్యే జాతరలు మాసమంతా తెలంగాణ ప్రాంతమంతా ప్రతి గురు, ఆదివారాలలో ఆయా ప్రాంత ఆలయాల్లో బోనాలు నిర్వహిస్తారు. ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వెడుతుందని ప్రజల నమ్మకం. అందుకే భక్తులు ఆ సమయంలో అమ్మవారిని దర్శించుకుని తమ స్వంత కూతురు వలె భావన చేసి భక్తి శ్రద్ధలతో బోనంను నివేదించి బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు.
సౌహార్థ్రతను, సౌభాతృత్వాన్ని సమైకయతను, సమిష్ఠిశక్తి ఐక్యతాభావాన్ని మారురూపైన ఈ బోనాల పండుగ జాతరలో ప్రతివారు పాల్గొని అమ్మ ఆశీర్వాదం పొందాలి .

ఘటోత్సవం
అమ్మవారికి ఎదురెళ్ళి పుట్టింటి నుంచి తీసుకుని వచ్చే ఎదురుకోళ్ళతో ప్రారంభమవుతుంది. దీనే్న ఘటోత్సవం అంటారు. ఘటం అంటే కలశమని అర్థం. అంటే పూర్ణకుంభ స్వాగతమన్న మాట. ప్రత్యేకమైన కలశంలో అమ్మవారిని ఆవాహన చేసి పురవీధులలో ఊరేగిస్తారు. బోనాల ఉత్సవం ముందురోజు వరకు ఉదయం, సాయంత్రం అమ్మవారు ఈ ఘటంపై అమ్మ ఆశీనురాలై పురవీధులగుండా సంచారం చేస్తుంది.

రంగం
జరగబోయే రోజుల భవిష్యత్తును చెప్పే వేడుకనే ‘రంగం’. అమ్మఎదురుగా అమ్మకు బదులుగా మాతంగిఅనే కన్యారత్నం వచ్చి పచ్చికుండపై నిలబడి రాబోయే భవిష్యత్తును పలుకుతుంది. ఈ తల్లినే మాతంగేశ్వరి అని పిలుస్తారు. తన బిడ్డలకు వచ్చే కష్టాలను చెప్పి వాటిని తాను తొలగిస్తానని వాటిగురించి బెంగపడవద్దని హెచ్చరిస్తుంది. ధర్మాన్ని ఆచరించమని ప్రబోధిస్తుంది. అమ్మ వాణి వినడానికి భక్తులు పోటీలు పడతారు.

బోనాలు
కారణాకారుణురాలైన మహామాయ మహాశక్తి స్వరూపిణికి సమర్పించే నైవేద్యమే బోనం. మేళతాళాలతో బంధుమిత్ర సహోదర సమేతంగా బయలు దేరి తల్లికి నివేదించే నివేదననే బోనం. చల్లని తల్లి తమను చల్లగా చూడాలని కోరుకుంటూ తలారా స్నానం ముఖానికి పసుపును అలదుకొని సౌభాగ్యాలనిచ్చే కుంకుమను నుదుటిన ధరించి మడిబట్టలు కట్టుకుని పవిత్రమైన కుండలో బోనం పెట్టి పైన తల్లిని ఆవాహన చేసి దీపాన్ని వెలిగించి ఆ కుండను తలపై పెట్టుకుని తప్పెట్ల మోతలతో, మంగళవాద్యాలతో పోతుఠాజులు వెంటరాగా అమ్మవారి చెంతకు వెళ్లి సమర్పించే నివేదనయే బోనం

పోతరాజులు
శరీరమంతా పసుపురాసుకుని కాళ్ళకు గజ్జెలు, కళ్ళకు కాటుక, నుదుట పెద్ద కుంకుమ బొట్టు, నోటిలో పచ్చటి నిమ్మకాయ, నడుము చుట్టూ వేపమండలు, కొరడాగా చేసుకున్న పసుపుతాడును ఝుళిపిస్తూ తప్పెట వాద్యాలకు అనుగుణంగా చిందులేస్తూ ఆనందోత్సాహాల మధ్య పోతరాజులు కదిలివెళ్లి అమ్మను స్వాగతించే ఘట్టం పోతురాజుల వీరంగం. పోతురాజులు అమ్మకు సహోదరులుగా భావిస్తారు. ఈపోతురాజులను అమ్మలందరూ ఆహ్వానిస్తారు .

-జంగం శ్రీనివాసులు