మెయిన్ ఫీచర్

ఆత్మవిశ్వాసం పెంపొందిచేలా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలు పుట్టిన క్షణం నుంచి ఇతరులను అనుకరిస్తుంటారు. వారికి మొదటి గురువు తల్లే. తల్లిని అనుకరించడం తల్లి మాట వినగానే నవ్వడం, కాళ్లు చేతులు ఆడించడం లాంటివి మాటలు రాని సమయంలోనే చేస్తుంటారు. అటువంటి పిల్లలు వయస్సు పెరుగుతున్న కొలది తల్లిదండ్రల నుంచి ఇరుగు పొరుగు, స్నేహితుల వల్ల వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకుంటూ ఉంటారు. ఈ వ్యక్తిత్వ నిర్మాణంలో ఉపాధ్యాయులు కూడా ప్రధాన భాగం అవుతారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చెప్పే విషయాల పట్ల వారు దేన్ని చేయాలో దేన్ని చేయకూడదు అన్నవిషయాలమీద ఒక నిర్ణయానికి వస్తుంటారు.
స్నేహితుల ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉంటుంది. అందుకే సాధారణంగా తల్లిదండ్రులతో మీకు ఏమీ తెలియదు అని అంటుంటారు.
మంచి స్నేహితులుండాలనేది పిల్లలు మంచి బాటలో నడవడానికి వీలుగా ఉంటుందని చెప్తారు. పిల్లల ప్రపంచంలో కేవలం కుటుంబ సభ్యులు, స్నేహితులు,అధ్యాపకులే ఎక్కువగా ఉంటారు. ఒక్కోసారి వారు ఏదైనా వేధింపులకు లేక భయాందోళనలకు గురి అయితే ఆ ప్రభావం వల్ల వారిలో వ్యక్తిత్వ లోపాలు కూడా ఏర్పడే అవకాశాలుంటాయి.
వారు చేస్తున్న పనులను ఎద్దేవా చేయడం, ఎగతాళి పట్టించడం లాంటివి కూడా చేయకూడదు. ఎందుకంటే దీనివల్ల పిల్లలు ఆత్మనూన్యతకు గురవుతారు. ఆత్మవిశ్వాసం వారిలో కొరవడుతుంది. దానివల్ల వారి ఎదుగుదల్లో మార్పులు వస్తాయి. మానిసక వికలాంగులుగా మారే అవకాశాలున్నాయి. అందుకే తల్లిదండ్రులు ఎక్కువ శ్రద్ధ తీసుకొని వారిని మంచి దారిలో పెట్టాలి. వారు ఒక్కోసారి తోటి మనుషులకో లేక కొన్ని ప్రదేశాల్లోనో భయపడుతుంటారు. ఆ భయాన్ని వారు పైకి చెప్పలేకపోతారు. కాని పెద్దలే వారు ఎందుకు అలా ఉన్నారో తెలుసుకొని ఫలానందుకు నీవు భయపడుతున్నావు అని చెప్పకుండానే వారిని భయాందోళన నుంచి బయటకు తీసుకుని రావాలి. వారిముందే పెద్దలు వీరు ఏమైపోతారో అని ఆందోళన చెందకూడదు.
పిల్లలకు ఆటల్లో కూడా ప్రవేశం ఉండేలా చేయగలగాలి. ఆటల గురించి ఆటల వల్ల లాభాలగురించి వారికి విడమర్చి చెప్పాలి.. అంతేకాక సాంస్కృతిక కళల గురించి కూడా వారికి చెప్పాలి. వ్యక్తిత్వ వికాసం చెందాలంటే పాటనో, ఆటనో, నృత్యమో, ఏదైనా వాయద్యం వాయంచగలగడమో లాంటివి వారికి తప్పక నేర్పించాలి. వీటి గురించి న ఆలోచన్లు వారిలో రేకేత్తించేలా తల్లిదండ్రులే చేయాలి.
నేను లేకపోతే మా అమ్మాయి ఒక్క క్షణం అన్న ఉండలేదు అనే గొప్పలు వినడానికి బాగుంటాయి కాని పిల్లల మనస్తత్వ లోపాలుగా తయారు అవుతాయి. వారు ఒంటరిగాను ఉండగలగాలి. ప్రతి కూల పరిస్థితులను ఎదుర్కొనే స్థితిని వారిలో కల్పించాలి. బయటకు వెళ్లినపుడు అపరిచితులత ఎలా మెలగాలో కూడా నేర్పించాలి.
బస్సుల్లోకాని, ఆటోల్లోకాని బడికి పంపిస్తున్నపుడు కూడా వారికి జాగ్రత్తలు తప్పనిసరిగా చెప్పాలి. వారికి ఇబ్బంది కలిగించే తోటి విద్యార్థులైనా, లేక ఆటో, బస్సు డ్రైవర్లు లేక మరే ఇతరులైనా కలిగిస్తే వెంటనే ఉపాధ్యాయులకో లేక తల్లిదండ్రులకో చెప్పే వీలును వారికి ఇవ్వాలి. మాట్లాడడానికి భయపడకుండా చేయాలి. నోట్స్ రాయడంలోనో, వినడంలోనో వారు వెనుకబడితే దానికి కారణం కనుక్కుని నివారణను తెలియచేయాలి.
పిల్లలు ఆకతాయిగానో, దురుసుగానో ఇతరుల పట్ల వ్యవహరిస్తున్నపుడు, అబద్దాలు చెబుతున్నపుడు వారిని వెనుకేసుకొని రాకూడదు. అట్లా చేయడం ఏవిధంగా మంచిది కాదో వారికి వివరించాల్సిన బాధ్యత ఎక్కువగా తల్లిదండ్రుల పైనే ఉంటుంది. చెడు పనులు చేసేటపుడు చిన్నపిల్లలను చూడక వారిపట్ల కఠినంగా వ్యవహరించాలి. లేకుంటే మొక్క వంగనిది మానైతే వంగునా అన్నట్టు తయారు అవుతారు.
ఎప్పుడైనా పిల్లలపైన స్కూలు యజమాన్యం కాని, టీచర్లు కాని అభియోగాలు చేస్తే వాటిని విని అవి ఎంత వరకు నిజమైనో తేల్చుకోవాలి. తోటి పిల్లలు చెప్పినా వాటిని కూడా విని అవి ఎంత వరకు సమంజమైనవో తేల్చుకుని వాటిపై స్పందించాలి కాని మా పిల్లవాడు మంచి వాడు అనే బిరుదుతో ఇతరులను నొప్పించడం చేస్తే ఆ ఇతరులు కొద్దిసేపు బాధపడి మర్చిపోతారు. కాని పిల్లలే ఎక్కువగా చెడుదారిన పడతారు.
ఇతరులతో మనం ఒక ర్యాపోను పెట్టుకుంటాం. అలానే పిల్లలతో కూడా పెట్టుకోవాలి. పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి. పైగా వారికి లేని పోని అబద్ధాలు చెప్పకూడదు. కుటుంబ సభ్యుల గురించి వారికి అపోహలను కల్పించకూడదు. రేపొద్దున ఆ కుటుంబ సభ్యుల గురించి నిజాలు తెలుసుకుంటే వారు తల్లిదండ్రులకు వ్యతిరేకులుగా కూడా మారిపోయే అవకాశాలున్నాయి.
పిల్లలను భయపెట్టడమో లేక అతిగా గారాబం చేయడమో చేయక సరైన దారిలో పెంచడమే మంచిదని పిల్లల మానసిక శాస్తవ్రేత్తలు చెబుతారు.

- విజయలక్ష్మి