మెయిన్ ఫీచర్

కనిపించే (పెంచే) వెలుగు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుపుత్రోజాయేత క్వచిదపి కుమాతా న భవతి .. అంటే ఏమిటి అనుకొంటున్నారా... ఏమీ లేదండీ.. ఎక్కడైనా మంచి కొడుకు ఉండక పోవచ్చు.. కాని చెడ్డ తల్లి మాత్రం ఉండదు అని అర్థం అండీ...
నిజమే కదా. ఈకాలంలో వీధికో వృద్ధాశ్రమాలున్నాయి అంటే చెడు అమ్మలు ఉన్నట్టా లేక చెడ్డ పిల్లలున్నట్టా చెప్పండి... సరే.. అసలు విషయానికి వద్దాం..
అమ్మ చల్లనిది. .. అ మ్మ మాట కమ్మని పూదోట.. అమ్మ ఎవరికైనా అమ్మే.. అమ్మంటే మెరిసే మేఘం. అమ్మని మించిన దైవం లేదు.అమ్మ అనురాగానికి, ప్రేమకు మారురూపం.. అమ్మ కదిలే దేవత. ఆదిపరాశక్తి తాను అన్ని చోట్లా ఉండలేక తన బదులుగా అమ్మను ప్రతి ఇంటా ఉంచిదన్నా అది అతిశయోక్తి కానేరదు. అందుకే అమ్మ లేనిదే లోకమే లేదు..
ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్నా కమ్మని కావ్యం.. పట్టు పరుపువలే .. పండు వెనె్నలవలె అమ్మ ఒడి చాలును నిన్ను చల్లంగ జోకొట్టునే ...
అమ్మ ఒకవైపు.. దేవతలంతా ఒకవైపు.. సరితూచమంటే నేను ఒరిగేను అమ్మవైపు.. అన్నాడు సి. నారాయణ రెడ్డి... ఇలా అమ్మ గురించి చెప్పుకుంటూ పోతే పుంఖాను పుంఖాలుగా అమ్మ చరిత్ర రాస్తూ పోవాల్సిందే...
సాహిత్యంలోనే అమ్మకు ఒక ప్రాధాన్యం ఉంది. అమ్మకు సంబంధించిన సాహిత్యం ప్రపంచ సాహిత్యంలోను కనిపిస్తుంది. అమ్మతనం, అమ్మధనం వీటిపై కవితలు, వ్యాసాలు , కథలు, పాటలు, చిత్రాలు ఇలా ఎన్ని వచ్చినా ఆ మాధుర్యం తగ్గిపోదు. మళ్లీ మళ్లీ వినాలనే అనిపించే ఔన్నత్యం అమ్మది. అలాగే ఎన్ని రకాలుగా కాన్వాసు మీద లిఖించినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే గొప్ప చిత్రం అమ్మ. అమ్మ అంటే దైవ స్వరూపం.. ప్రాణాలు అడ్డుపెట్టి బిడ్డలను కాపాడుకునేందుకు ఏమాత్రం వెనుకాడనిది అమ్మ. పిల్లల కోసం ప్రాణం లెక్క చేయని వారు ఎవరైనా భూమీద ఉన్నారంటే గది తల్లే అని చెప్పాలి. మనుషుల్లోనే కాదు ప్రతి జంతు జీవ జాతుల్లో అమ్మతనం ఉట్టి పడుతుంది. కన్నబిడ్డలను కంటి పాపలతో సమానంగా చూసుకొంటుంది. అమ్మతనం వర్ణించాలంటే మాటలు చాలవు. అమ్మపై అభిమానాన్ని, అనురాగాన్ని ఎంతో మంది చిత్రకారులు తమ కుంచెతో కాన్వాసుపై వర్ణాలతో అద్దారు. తమ సృజనని జోడించి అమ్మ కమ్మదనానికి మరింత మధురిమలను మలిచారు. మాటల్లో చెప్పలేనిది పాటల్లో పలుకలేనిది నలుపు తెలుపు ఇంకా రంగుల బొమ్మలతో మనకి అందించారు.. ఆస్ట్రేలియా లో పిల్లల ఆసుపత్రి దగ్గర ఉన్న భవంతి పైన చిహ్నం . తల్లి బిడ్డను హృదయానికి హత్తుకున్నట్లుగా చూపిన భావన. మనం తెలుగులో నేర్చుకునే మొదట మాట అమ్మ లో ‘అ’ కి ఎంత అద్భుతంగా ఇమిడిపోయిందో కదా.

-తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి