మెయిన్ ఫీచర్

మనసుంటే మార్గమిదిగో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్నదమ్ములు పెళ్లిళ్లు చేసుకొని ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ముగ్గరక్కలూ ఏదో గంతకు తగ్గ బొంత అని పెళ్లిళ్లు చేసుకొని తిప్పలు పడుతున్నారు. శైలజ అమ్మనాన్నలను చూడాల్సిన బాధ్యత మీద పడింది. ఇంటర్ చదివేకాలంలోనే కష్టాలు చవి చూడడం ఆరంభించింది. అందుకే శైలజ ఇంటర్‌తో చదువుకు పుల్‌స్టాప్ పెట్టేసి బట్టల కొట్టులో సేల్స్ గర్ల్‌గా చేరింది. ఇల్లు తండ్రి ప్రైవేటు ఉద్యోగం చేయడం వల్ల పె న్షన్ సదుపాయం వారికి కలుగలేదు. దాంతో శైలజ డబ్బులు తండ్రి కూడబెట్టిన డబ్బు పై వచ్చే చిరువడ్డీ కలసి సంసారం లాక్కొచ్చేది. అమ్మ అంతగా చదువుకోలేదు.

కష్టాలే సుఖాలను తెస్తాయి. సుఖాల వెంట దుఃఖాలు, ఆ దుఃఖాల వెంట సుఖాలు ఇదంతా చక్రం మాదిరి ఉంటాయి. అందరికీ జీవితం వడ్డించిన విస్తరి కాదు. కాకపోయినా జీవితాన్ని ఉన్నంతలో సుఖంగా మల్చుకోవడానికి శతవిధాలు కష్టపడుతారు మహిళలు. నేటి కాలంలో స్ర్తిలు పురుషులు అన్నభేదం లేకుండా ఏదో ఒక ఉపాధిరంగంలో ఉంటున్నారు. కాని జీవితం మాత్రం అందరికీ సాఫీగా సాగడం లేదు. అందరూ చదువుకుంటున్నా చదువుకున్న ప్రతివారికీ అనుకొన్న ఉద్యోగం రావడం అదృష్టం మీదే ఆధార పడి ఉంటుంది.
అదృష్టాన్ని కూడా చక్కదిద్దుకునే వారే నేడు సాధికారత సాధించిన వారౌతారు. ఇలా ఎందుకంటున్నా అనుకొంటున్నారా.. చూడండి.
శైలజ వాళ్లది మధ్యతరగతి కుటుంబం. శైలజకు ముగ్గురు అన్నలు, ముగ్గురు అక్కలున్నారు. తండ్రికి ఉన్న చదువుపట్ల ఆసక్తితో పిల్లలను బాగానే చదివించారు. కాని శైలజ దగ్గరకు వచ్చేసరికి తండ్రి అవసాన దశకు చేరుకున్నాడు. అందుకే గవర్నమెంటు స్కూలు, కాలేజీలో ఇంటర్ పాస్ అయింది. అప్పుడే కుటుంబ భారం శైలజ పైన పడింది.
అన్నదమ్ములు పెళ్లిళ్లు చేసుకొని ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ముగ్గరక్కలూ ఏదో గంతకు తగ్గ బొంత అని పెళ్లిళ్లు చేసుకొని తిప్పలు పడుతున్నారు. శైలజ అమ్మనాన్నలను చూడాల్సిన బాధ్యత మీద పడింది.
ఇంటర్ చదివేకాలంలోనే కష్టాలు చవి చూడడం ఆరంభించింది.
అందుకే శైలజ ఇంటర్‌తో చదువుకు పుల్‌స్టాప్ పెట్టేసి బట్టల కొట్టులో సేల్స్ గర్ల్‌గా చేరింది. ఇల్లు తండ్రి ప్రైవేటు ఉద్యోగం చేయడం వల్ల పె న్షన్ సదుపాయం వారికి కలుగలేదు. దాంతో శైలజ డబ్బులు తండ్రి కూడబెట్టిన డబ్బు పై వచ్చే చిరువడ్డీ కలసి సంసారం లాక్కొచ్చేది. అమ్మ అంతగా చదువుకోలేదు.
సంసార బండి నడవడం చాలా కష్టం అనిపించేది. అందుకే మరో ఆలోచన చేసింది. ఇంట్లో అమ్మచేత పచ్చళ్లు, పొడులు చేయించి చుట్టుపక్కల వారికి ఇవ్వడం ప్రారంభించిది. ఆ తరువాత తను పనిచేసే చోట తన తోటి వారికి ఇవ్వడం మొదలుపెట్టింది. మెల్లమెల్లగా అక్కడికి వచ్చే కష్టమర్లతో స్నేహం పెంచుకుని వారికి పచ్చళ్ల పొడుల రుచులు చూపించింది. ఇదంతా చేయడం బట్టల కొట్టు యజమాని తెలుసుకొని మా బిజనెస్ చేయకుండా సొంత పనులు చేస్తున్నావంటూ ఉద్యోగం నుంచి తీసేశారు.
శైలజ మొదట బాధపడినా ఫర్వాలేదనుకొని తానే స్వయంగా ఇల్లిల్లు తిరిగి పచ్చళ్లు అమ్మడం మొదలుపెట్టింది. మెల్లమెల్లగా అమ్మ చేతి రుచికి జనాలు అలవాటు పడ్డారు. పైగా ఇంటికి తెచ్చి ఇవ్వడంతో శైలజ వారికి చేరువ అయింది. వారు కర్రీస్ కూడా ఇలా ఇంటికి తెచ్చి ఇస్తే తీసుకొంటాం కదా అనడం మొదలుపెట్టారు.
అంతే ఆలోచన రావడం పని మొదలు పెట్టడం రెండూ ఒకేసారి మొదలు పెట్టింది. వెంటనే ముందే ఆర్డర్ తీసుకొని కర్రీస్ ఇవ్వడంతో కష్టానికి తగ్గ ఫలితం వచ్చేది. నష్టమూ అంతగా వచ్చేది కాదు. దాంతో బండి లాభాల బాట పట్టింది.
అపుడు శైలజ కష్టపడే తత్వం తెలుసుకొన్న ఓ ఆదర్శయువకుడు వచ్చి పెళ్లి చేసుకొంటానని అన్నాడు. తాను కష్టాలే పడుతున్నాడని నేను చిరుద్యోగం చేస్తున్నానని తనకు అమ్మనాన్న ఉన్నారని వారిని చూడాలని చెప్పాడు. ఇద్దరూ కూడబల్కుకున్నారు.
వారిద్దరూ పెద్దల ఆశీర్వాదంతో పెళ్లిచేసుకొన్నారు. వారిద్దరి అమ్మనాన్నలు ఒక్కదగ్గరే కలసి ఉంటారు. నలుగురు అమ్మనాన్నలు కలసి వంటలు చేయడం పిల్లలకు ప్యాకింగ్‌ల్లో సాయం చేయడం చేస్తుండడంతో శైలజ శ్రీనివాసు ఇద్దరూ ఇపుడు షాపు పెట్టారు. అక్కడే స్వీట్లు, పచ్చళ్లు అమ్మడం, కర్రీపాయింట్ పెట్టారు. ఎవరైనా కోరుకుంటే క్యారేజీలు కూడా పంపిస్తుంటారు. కాకపోతే ఈ సదుపాయం తక్కువగా చేస్తారు.
పిండి వంటలు చేయంచడానికి ఇద్దరు వంటవాళ్లను కూడా పెట్టుకున్నారు. దాంతో వేరొకరికి ఉపాధిని చూపిస్తున్నాం అన్న తృప్తి మాకు కలుగుతోందని శైలజ దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏముంది వ్యాపారం మూడు పువ్వులూ ఆరుకాయలుగా సాగిపోతుంది. ఇప్పుడు శైలజ కష్ట్ఫేలి అన్న పెద్దల మాట అక్షర సత్యం అంటోంది.
చూశారా.. ఇదిగో ఇలా మీరు స్వయం ఉపాధిమార్గాన్ని ఎంచుకుంటే మంచిరోజులు మీకోసం వేచి ఉన్నాయి.

-శ్రావ్య