ఎడిట్ పేజీ

ఎన్నికలలో ‘గెలుపు గుర్రాలు’ ఎవరివి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికలు 2018 డిసెంబరులో జరుగుతాయని ఊహాగానాలు వెలువడ్డాయి. అందుకు ఒక కారణం ఉంది. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరాంలల్లో అసెంబ్లీలకు ఇప్పుడు ఎన్నికలు జరుపవలసింది. ఇక్కడ బిజెపికి ప్రతికూల తీర్పు వస్తే దాని ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై పడవచ్చు. అందుకని 2019 ఏప్రిల్‌లో జరుగవలసిన లోక్‌సభ ఎన్నికలను ముందుకు జరపాలనేది ఒక వ్యూహం. ఇదొక జూదం. 2004లో ఇలాంటి ప్రయోగమే చేసి ఎ.బి.వాజపేయి అధికారం కోల్పోయారు.
ఇక రెండవ ప్రత్యామ్నాయం అసెంబ్లీ ఎన్నికలను 2019 ఏప్రిల్ వరకు ఆపటం. అందుకు అవసరమైన సవరణలు చేయటం లేదా ఆయా రాష్ట్రాల్లో రాష్టప్రతి పాలన తాత్కాలికంగా విధించటం.
మిజోరాం క్రైస్తవ రాష్ట్రం. నిన్నటివరకు తాము ఇండియన్ యూనియన్‌లో అంతర్భాగం అని అనుకోవటం లేదు. సోనియాగాంధీ రోమన్ కేథలిక్ మిషనరీ ప్రచారకురాలు. కాబట్టి మిజోల మీద ఆమె ఆశపెట్టుకున్నది. ఇక్కడ బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయటం కష్టసాధ్యం. ఇక రాజస్థాన్‌లో వసుంధరారాజే వ్యవహారశైలి పట్ల ప్రజలు పెదవి విరుస్తున్నప్పటికీ అక్కడ బిజెపికి ప్రత్యామ్నాయం లేదు. ఆమెను కాదని అశోక్‌గెల్హెట్‌ను ఎన్నుకుంటే పెనం మీదినుండి పొయ్యిలో పడినట్లవుతుందని స్థానిక ప్రజలకు తెలుసు. వారు ఛామరీదేవి భయంకర ఉదంతాన్ని ఇంకా మరచిపోలేదు. ఇదొక కాంగ్రెసు మంత్రిగారికి సంబంధించిన సెక్సు స్కాండల్. ఛామరీదేవిని సజీవ దహనం చేశారు. సరిహద్దు రాష్టమ్రైన రాజస్థాన్‌లో దేశ సార్వభౌమత్వాధికారానికి సవాలుగా పరిణమిస్తుంది. ఇక చత్తీస్‌గఢ్‌లో రమణిసంగ్ పాలన అంతంత మాత్రంగానే ఉంది. ఆయనకు కూడా ‘సన్’స్ట్రోక్ తగిలింది. రమణసింగ్ కుమారుని పేరుతో కొన్ని విదేశీ ఖాతాల పేర్లు వెలుగులోకి వచ్చాయి. మోడీ ప్రభుత్వం రమణసింగ్‌పై ఎట్టకేలకు చర్యలు తీసుకోలేదు అందుకు ప్రధాన కారణం చత్తీస్‌గఢ్, మావోయిస్టులకు రహస్య స్థావరంగా ఉంది. వారు సరిహద్దులోని మహారాష్ట్ర తెలంగాణాల నుండి తమ కార్యకలాపాలు విస్తరిస్తున్నారు. వారికి నేరుగా చైనానుండి మాత్రమే కాక కాంగ్రెసు పార్టీనుండి ఆయుధాలు మందుగుండు సామాగ్రి నగదు అందుతున్నాయి. మరో విశేషం ఏమంటే మొన్న చత్తీస్‌గఢ్‌లో దొరికిన 300 బుల్లెట్లపై పాకిస్తాన్ ఐ.ఎస్.ఐ ముద్రలు ఉన్నాయి. అంటే ఇవి పాకిస్తాన్‌లో నిర్మించారన్నమాట. ఇవి చత్తీస్‌గఢ్‌లోకి ఎలా చేరాయి??
ఈ భద్రతా కారణాల దృష్ట్యా రమణ్‌సింగ్ ప్రభుత్వం యొక్క సమర్ధతను కేంద్ర ప్రభుత్వం అంతగా పట్టించుకోవటం లేదు. గుడ్డిలో మెల్ల అన్నట్లు అక్కడ బిజెపి ప్రభుత్వం ఉంటే చాలు అనుకుంటున్నది. ఇటీవలి అక్కడ అభివృద్ధి కార్యకలాపాలను రమణసింగ్ ముమ్మరం చేశాడు. ఐతే రోడ్లు వేస్తూ అభివృద్ధి పనులలో పాల్గొంటున్న ఇంజనీర్లను వర్కర్లను మావోయిస్టులు కాల్చి చంపారు. అందుకు వారు చెప్పిన కారణాలు ఇక్కడ రోడ్లు విస్తరిస్తే రవాణా సౌకర్యాలు పెరిగితే మానవ స్వస్థావరాలు బయటపడుతాయి అని. చత్తీస్‌గఢ్‌లో రహస్యంగా గంజాయి సాగు జరుగుతున్నది. అక్రమ మైనింగ్ కూడా ఉంది. ఇది వెలుగులోకి రాకుండా చేయాలంటే ఇక్కడ రోడ్ల విస్తరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగకూడదు. వనవాసీ కల్యాణ ఆశ్రమం అనే స్వచ్ఛంద సామాజిక సంస్థ ఇక్కడ వనచరులకు సేవలు అందిస్తున్నది. ఈ సంస్థకు విశ్వహిందూ పరిషత్ నుండి ప్రేరణ లభిస్తున్నది. ఇక తెలంగాణా విషయానికి వస్తే ఇక్కడ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు డిసెంబర్ 2018లోనే ఎన్నికలను కోరుకుంటున్నారు. ఇందుకు కొన్ని కారణాలున్నాయి. ప్రస్తుతం తాము ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం వంటివి సత్ఫలితాలిస్తాయని ఆయన ఊహ. మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ, కాళేశ్వరం వంటివి మంచి పథకాలు. ఇవి కల్వకుంట్ల వారికి కలిసి వచ్చే పథకాలే. ఇటీవల విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకొని దేవికి వజ్రాల ముక్కెర సమర్పించి దేవి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ యాత్రలో తెలుగుదేశం పార్టీకి చెందిన దేవినేని ఉమామహేశ్వరరావు కల్వకుంట్లవారి వెంట ఉండి ఏవేవో సలహాలు సూచనలు చేశారు. అంటే రాబోయే తెలంగాణ ఎన్నికలలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో టి.ఆర్.ఎస్, మజ్లీస్, తెలుగుదేశం కలిసి పోటీచేస్తాయని అర్థం.
మరి కల్వకుంట్ల వారు ఎవరిని చూచి భయపడుతున్నారు? ఐదు సీట్లున్న బిజెపి అధికారంలోకి రావటం అసంభవం. ‘‘రెండు సీట్లున్న అసెంబ్లీలో మేము అద్భుతాలు సాధించాము’’ అంటూ బిజెపి జనరల్ సెక్రటరీ రాంమాధవ్ 5-7-2018నాడు హైదరాబాద్‌లో చెప్పటం వారి ఆశలను ప్రతిబింబిస్తున్నదే కాని వాస్తవానికి అరవై సీట్లు గెలుచుకునే స్తోమత ప్రస్తుతానికి బిజెపికి లేదు. కాకుంటే కల్వకుంట్లవారికి ప్రొఫెసర్ కోదండరాం నుండి ముప్పు పొంచి ఉంది. పైకి కనపడకుండా కోదండరాం తెలంగాణాలోని వివిధ ఉగ్రవాద పార్టీలను ఏకం చేసి ‘దొరగారి గడి’ బద్దలుకొడతాను- అని ప్రతిజ్ఞ చేశాడు. బహుశా ఎన్నికల నాటికి కాంగ్రెసు పార్టీ కోదండరాం పార్టీ కలిసి ఒక అవగాహనకు వచ్చే అవకశాలు మెండుగా ఉన్నాయి. ఇది కెసిఆర్‌కు ఇబ్బంది కలిగించే అంశమే. మొన్న లష్కరీ తోయిబా ‘‘మూకుమ్మడిగా ముస్లింలంతా కాంగ్రెసుకు ఓటువేయండి’’ అని పిలుపునిచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంత వరకు బిజెపి ఎన్నికల విజయావకాశాలు ప్రస్తుతానికి కష్టమే. జూలైలో సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చింది. ఇది ఇద్దరి చంద్రులకు అపజయ సూచకం. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావటం కష్టం- అని ఆ పార్టీ వారే చాటుగా చెప్పుకుంటున్నారు. చంద్రబాబు సమర్ధుడైన ప్రజానాయకుడు. కష్టించి పనిచేసే మనస్తత్వం కూడా ఉంది. కాని ప్రత్యేక హోదా- కడప ఉక్కు ఆంధ్రుల హక్కు వంటి నినాదాలతో కేంద్రంతో బహిరంగ యుద్ధానికి దిగాడు. తిరుమలలో అలిపిరివద్ద బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా మీద, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణమీద దేశం కార్యకర్తలు భౌతిక దాడులు చేయటం తెలుగుదేశం యొక్క అసహనానికి, నిస్పృహకు అద్దం పడుతున్నది.
కర్నాటకలో కుమారస్వామి ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు. రాష్ట్ర బడ్జెట్‌లో పెట్రోలు, డీజిల్ ధరలు పెంచారు. మరి జాతీయ స్థాయిలో కాంగ్రెసు పార్టీ కేంద్ర ప్రభుత్వం చమురు ధరలు పెంచిందని ఆడిపోసుకోవటం ఎందుకు? అంతర్జాతీయంగా డాలరు విలువ మీద ముడిసరుకు ధరలు ఆధారపడి ఉంటాయి. ఇరాన్ నుండి చమురు కొనకూడదు అంటూ అమెరికా ఇటీవల భారత్‌ను హెచ్చరించింది. సౌదీ అరేబియా భారత్‌కు శత్రు దేశంగా వ్యవహరిస్తున్నది. ఇలాంటి ఆంక్షల మధ్య చమురు ధర తగ్గాలనే కాంక్షలు సాధ్యంకానివి.
కేరళలో అరాచకాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. మొన్న కొచ్చిన్‌లోని మహారాజా కాలేజిలో బిఎస్‌సి ద్వితీయ సంవత్సరం చదువుతున్న అభిమన్యు అనే సిపియం విద్యార్థి సంఘ నాయకుణ్ణి పి.ఎఫ్.ఐ అనే జీహాదీ ఉగ్రవాద సంస్థకు చెందిన కార్యకర్తలు హత్యచేశారు. అంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పరిపాలనా పగ్గాలు పినరాయ్ విజయన్ చేజారిపోయాయి. కేరళను ఇవ్వాళ నర హంతక ముఠాలు పరిపాలిస్తున్నాయి. కలకత్తాలో ఢిల్లీలో కేజ్రీవాలా, విజయవాడలో చంద్రబాబునాయుడు, మమతా బెనర్జీ, పరిపాలనను గాలికి వదిలి రాత్రింబవళ్లు ఉద్యమాలు నడుపుతూ రోడ్డున పడటం ఎంతవరకు సమంజసం? 2019 ఏప్రిల్ వరకు నరేంద్రమోదీ తన పరిపాలనను కొనసాగించి ఆ తర్వాత వివిధ అసెంబ్లీలను రద్దుచేసి, లోక్‌సభకు అసెంబ్లీలకు ఒకేసారి సార్వత్రిక ఎన్నికలు పెట్టడం శ్రేయస్కరం. ఈ లోపల మాయావతి, అఖిలేశ్‌యాదవ్, పి.చిదంబరం, మమతాబెనర్జీ వంటి వారికి వస్తున్న విదేశీ సహాయాలను పూర్తిగా నిలిపి వేయాలి. అంటే ప్రత్యర్థుల ఆర్థిక బలాన్ని బలగాన్ని దెబ్బకొట్టకుండా బిజెపి వెంటనే ఎన్నికలలోకి వెళ్లటం ఆత్మహత్య సదృశం అవుతుంది. కాశ్మీరులో మళ్లీ ఎన్నికలు అనివార్యం. అంతకుముందే ఆక్రమిత కాశ్మీరును భారత్‌లో కలుపగలరా? మరిన్ని సర్జికల్ స్ట్రయిక్స్ ద్వారా పాకిస్తాన్‌ను నిర్వీర్యం చేయవలసి ఉంది. అప్పుడు కేంద్రంలో నరేంద్రమోదీ విజయం ఖాయం.
అయోధ్యలో డిసెంబరు 2018లో రామాలయ నిర్మాణం ప్రారంభం కాబోతున్నది. యుపిలో బిజెపి విజయావకాశాలు చెందగలదు. సారాంశం ఏమంటే 2019 ఏప్రిల్‌లో జరిగే ఎన్నికల తర్వాత కేంద్రంలో మళ్లీ నరేంద్రమోదీ అధికారంలోకి రావటం దాదాపు ఖాయమేనని చెప్పవచ్చు. చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో తిరిగి బిజెపి అధికారం దక్కించుకోగలదు. మధ్యప్రదేశ్‌లో అధికార పీఠం కోసం కమలనాథ్- జ్యోతిరాదిత్య సింధియా పోటీపడుతున్నారు. ఐతే సింధియా బలపడటం రాహుల్‌గాంధీకి, దిగ్విజయ్‌సింగ్‌కు ఇష్టంలేదు. ఈ అంతర్గత పోరువల్ల కాంగ్రెసు విజయావకాశాలు మధ్యప్రదేశ్‌లో ఎక్కువగా ఉన్నాయి.
తెలంగాణాలో మెజారిటీ తగ్గినప్పటికీ కెసిఆర్ మళ్లీ అధికారంలోకి రావచ్చు. సంస్థాగతంగా గ్రామీణ క్షేత్ర స్థాయిలో టిఆర్‌ఎస్ బలహీనంగా ఉంది. తమిళనాడులో రజనీకాంత్ ముఖ్యమంత్రి అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కమల్‌హాసన్ ఫ్లాప్‌షో నిర్వహిస్తాడు. అంటే తెలుగునాట చిరంజీవికి పట్టిన గతి కమల్‌హాసన్‌కు పట్టబోతున్నది. ఆంధ్రప్రదేశ్‌లో ఇవాల్టి (జూలై 2018) అంచనాల ప్రకారం వైకాపా నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఐనా ఎన్నికలకు ఇంకా 10 నెలలు సమయం ఉంది. అందుకే భవిష్యత్‌లో ఏం జరుగబోతున్నదో ఎవరూ చెప్పలేరు. కల్ కిస్‌నే దేఖా? అని హిందీలో ఓ నానుడి ఉంది. రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? నేషనల్ హెరాల్డ్ కేసు తీర్పు వెలువడితే రాహుల్‌గాంధీ జైలుపాలు కావచ్చు.
‘‘నా మీద కుల ముద్రవేస్తే అధికార పార్టీ నాయకుల కాళ్లు విరగ్గొడతాను’’ అన్నాడు జనసేనాని! ఔను. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాధికారం కమ్మ-రెడ్డి కులాల మధ్యనే ఉంది. చిరంజీవి కాపు నాయకునిగా వచ్చి ముఖ్యమంత్రి పదవి ఆశించి విఫలుడైనాడు. పవన్‌కళ్యాణ్ భవిష్యత్తు పది నెలలలో తేలిపోతుంది.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెసు పార్టీని బ్రతికించుకోవాలని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ ఉమన్ చాందీ (కేరళ మాజీ ముఖ్యమంత్రి) చేసే ప్రయత్నాలు ఫలించలేదు. రాయపాటి సాంబశివరావు, కావూరి సాంబశివరావు, ఆనం సోదరులు వంటి వారెవరూ కనీసం ఉమన్ చాందీతో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అంగీకరించారు. లోగడ 2014లో వీరికి డిపాజిట్ దక్కలేదు. ఇప్పుడు కిరణ్ రాకవల్ల సీమాంధ్ర కాంగ్రెసులో పెద్ద పరిణామాలేవీ జరుగవు. 2014లో తెలుగుదేశం, వైకాపాల మధ్య పోలైన ఓట్ల శాతంలో తేడా 2 శాతం మాత్రమే. మరి ఇప్పుడు జగన్ గాలి వీస్తున్నది. ఇది చంద్రబాబుకు ఇబ్బంది కల్గించే విషయం. బిజెపి తెలంగాణాలో పుంజుకున్నది. కాని ఎపిలోని పరిస్థితి ప్రస్తుతానికి ఆశాజనకంగా లేదు. కాకుంటే ఎన్నికల అనంతరం మళ్లీ (పోస్ట్‌పోల్ ఎలయెన్స్) పొత్తులు ఎత్తులు ఉండనే ఉంటాయి. బిజెపి ఈసారి యుపిలో కొన్ని సీట్లను కోల్పోతున్నది. ఆ లోటు దక్షిణాది రాష్ట్రాల ద్వారా పూరించుకోవాలని ప్రయత్నిస్తున్నది. అది ఎలా జరుగుతుందో స్పష్టంగా చెప్పడానికి మరి కొంత సమయం పడుతుంది. తెలంగాణాలో మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి ఆర్మూరు నుండి కాక బాల్కొండ నుండి అసెంబ్లీకి లేదా పార్లమెంటుకు పోటీచేయ బోతున్నారు. కాని హస్తం గుర్తుమీదనా కారు గుర్తుతోనా అనే విషయం కొద్దిరోజులలో తేలిపోతుంది. శ్రీమతి కవితమ్మ అసెంబ్లీకి పోటీ చేస్తున్నది. గెలిస్తే కాలం కలిసివస్తే మంత్రి (ముఖ్యమంత్రిణి) అయినా ఆశ్చర్యపడనక్కరలేదు.

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్ ఫోన్: 040- 2742 5668