మెయిన్ ఫీచర్

కాఫీ రంగుల్లో మోనాలీసా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ దృశ్యరూపమిచ్చిన చిత్రం మోనాలిసా. శతాబ్దాలు గడుస్తున్నప్పటికీ ఈ చిత్రం వెనుక రహస్యం ఏమిటన్నది బయట పడలేదు. అయితే ఒక్కో కోణంలో చూస్తే ఒక్కో తరహాలో కనిపించే ఆ పెయింటింగ్ వెనుకున్న మిస్టరీని ఛేదించేందుకు పురాతత్వ శాస్తవ్రేత్తలు, ఇతర విభాగాల నిపుణులు ఇప్పటికీ యత్నాలు సాగిస్తూనే ఉన్నారు. దాదాపు ఐదు శతాబ్దాలు గడుస్తున్నా మోనాలిసా చిరునవ్వు వెనుక దాగున్న రహస్యం, ఈ చిత్రంలో ఆమె భిన్న కోణాల్లో ఎందుకు దర్శనమిస్తోంది? అసలు ఆమె ఎవరన్నది తెలియకపోయినా ఆదరిస్తూనే వస్తున్నారు. అలాగే కొంతమంది ఔత్సాహికులు మోనాలీసాని తమదైన శైలిలో చిత్రించేందుకు ముందుకొస్తూనే ఉన్నారు.

మనలోని సృజనాత్మకత, స్వేచ్ఛ ప్రపంచాన్ని అందంగా మారుస్తాయి. మనలోని క్రియేటివిటీ ఆలోచనల్ని ఉత్తేజపరిస్తే ఆ ఆలోచనలు అద్భుతమైన మార్పుని తీసుకొస్తాయి.
చాలామందికి కాఫీ సృజనకి ఉత్ప్రేరకంగా ఉంటుంది. ఉదయానే్న కాఫీ తాగితే తమలోని ఉత్సాహానికి ఇంధనంలా ఉపయోగపడుతుందనేది అనుభవైకవేద్యం. అయితే ఈ కాఫీతో తమలోని కళని చక్కగా ప్రదర్శిస్తే ఎలా ఉంటుందీ, కాఫీకి క్రియేటివిటీకి లింకేంటీ అనుకోకండి..
ఇపుడు అసలు విషయానికొద్దాం!
ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ దృశ్యరూపమిచ్చిన చిత్రం మోనాలిసా. శతాబ్దాలు గడుస్తున్నప్పటికీ ఈ చిత్రం వెనుక రహస్యం ఏమిటన్నది బయట పడలేదు. అయితే ఒక్కో కోణంలో చూస్తే ఒక్కో తరహాలో కనిపించే ఆ పెయింటింగ్ వెనుకున్న మిస్టరీని ఛేదించేందుకు పురాతత్వ శాస్తవ్రేత్తలు, ఇతర విభాగాల నిపుణులు ఇప్పటికీ యత్నాలు సాగిస్తూనే ఉన్నారు. దాదాపు ఐదు శతాబ్దాలు గడుస్తున్నా మోనాలిసా చిరునవ్వు వెనుక దాగున్న రహస్యం, ఈ చిత్రంలో ఆమె భిన్న కోణాల్లో ఎందుకు దర్శనమిస్తోంది? అసలు ఆమె ఎవరన్నది తెలియకపోయినా ఆదరిస్తూనే వస్తున్నారు. అలాగే కొంతమంది ఔత్సాహికులు మోనాలీసాని తమదైన శైలిలో చిత్రించేందుకు ముందుకొస్తూనే ఉన్నారు.
సిడ్నీలోని ఓ ఆరుగురు కళాకారులు అప్పట్లో జరిగిన ఓ రాక్స్ ఆరోమా ఫెస్టివల్ సందర్భంగా కాఫీ కప్పులతో ఈ చిత్రాన్ని రూపొందించారు. కేవలం కప్పులతోనే కాకుండా కాఫీ డికాక్షన్, పాలు, లైట్ కాఫీ, స్ట్రాంగ్ కాఫీ, కాఫీలతో వందలకొద్దీ కాఫీ కప్పులను పక్కపక్కనే పేర్చి మోనాలీసా పెయింటింగ్‌ని సిద్ధం చేశారు. ఈ అపురూపాన్ని ఒక్కరోజే లక్షలాదిమంది వీక్షించడం గమనార్హం.
అన్నట్లు 3604 కాఫీ కప్పులు ఉపయోగించి 20 బై 13 సైజులో మోనాలీసాని ఆవిష్కరించారు.

-తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి