మెయిన్ ఫీచర్

రంగరంగ వైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతునికి రూపం లేదు. ఆకారమూ లేదు. కాని భక్తుడు కోరుకున్న విధంగా ఆ భగవంతుడు వ్యక్తమవుతాడు. భగవంతుని పూజించే అసలైన భక్తులు కులమతాలకు అంత విలువ ఇవ్వకపోవడానికి కారణం అదే.
ఒకసారి ముస్లిములు భారతదేశాన్ని ఏలే సమయంలో ఢిల్లీ నవాబు కుమార్తె శ్రీరంగంలోని భగవంతుడిని చూసి ఆయనపై భక్తిని పెంచుకుందట. మెల్లమెల్లగా ఆ భగవంతుడే అన్నింటికీ పెన్నిధి అనుకొన్నదా చిన్నది.
తన సర్వస్వాన్ని ఆ శ్రీరంగేశ్వరునికి అర్పించింది. ఢిల్లీ నవాబు కనుక శ్రీరంగం నుంచి స్వామి విగ్రహాన్ని కొన్నాళ్లు ఢిల్లీకి కూడా తీసుకొని వచ్చారట.
ఆ అమ్మాయి ఆ శ్రీరంగనాథుని ప్రతిరోజు దర్శించుకుని పూజించేదట. ఆ తరువాత శ్రీరామానుజుల వారు ఢిల్లీనుంచి శ్రీరంగానికి స్వామిని తిరిగి తీసుకొని వెళ్లినట్లు ఇక్కడి భక్తులు చెబుతారు. అందుకోసమే శ్రీరంగనాథునికి ప్రతి సోమవారం రోటీ నివేదన చేస్తారట. అంతేకాదు పౌర్ణమినాడు, ఏకాదశినాడు స్వామివారికి లుంగీధారణ కూడా చేస్తారట.
ఈ స్వామిని కొలవడానికి అన్ని రాష్ట్రాల నుంచి కాక విదేశాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. శ్రీరంగాన్ని పెద్ద దేవాలయం అని అంటారు. సుమారు ఈ దేవాలయం 157 ఏకరాల స్థలంలో నిర్మించి ఉంది. 108 దివ్యదేశాల్లో శ్రీరంగం అత్యంత మహిమాన్విత క్షేత్రంగా ప్రసిద్ధి కెక్కింది.
శ్రీస్వామి పాలకడలిలోంచి ఉద్భవించినట్టు స్థలపురాణం చెబుతోంది. ఈ స్వామి శయనమూర్తిగానే భక్తులకు దర్శనం ఇస్తాడు.
ఈ శ్రీరంగ స్వామిని ప్రతివారు దర్శించుకోవాలి. ఈ దేవాలయం ఏడు ప్రాకారాల్లోను, 21 గోపురాలతోను విస్తరించి ఉంది. ప్రతి ప్రాకారంలోపలు దేవాలయాలు భక్తులను ఆకర్షిస్తుంటాయి. గరుడాళ్వారుకు కూడా ఇక్కడ ప్రత్యేకమైన దేవాలయం ఉంది.
స్వామి కన్నతల్లిగా ఉన్న రంగనాయికి తాయార్, స్వామి దేవేరులైన శ్రీదేవి, భూదేవి, ధన్వంతరి స్వామి కూడా ఇక్కడ ఆలయాలున్నాయి.
ఈ శ్రీరంగంలోని స్వామికి సంవత్సరంలో మూడు సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి.
చిత్తిరై అనే బ్రహ్మోత్సవం ఏప్రిల్ -మే నెలల్లోను, తాయ్ అనే ఉత్సవం జనవరి, ఫిబ్రవరిలోను పంగుణి అనే బ్రహ్మోత్సవం మార్చి ఏప్రిల్ లోను జరుగుతుంది.
అసలీ స్వామి గురించిన విశేషమైన స్థలపురాణం ఒకటి చాలా ప్రఖ్యాతి గాంచింది.
అసుర రాజైన రావణుడు సీతమ్మవారిని తీసుకొని వచ్చి అశోకవనంలో పెట్టిన సందర్భంలో రావణుని తమ్ముడైన విభీషణుడు అధర్మమార్గంలో తన అన్న వెళ్తున్నాడని ఎంతో నొచ్చుకున్నాడట. అందుకే పలుమార్లు రావణుని బుద్ధిమాటలు చెప్పాడు. కాని రావణుడు వినలేదు. ఆయనతో విసిగిపోయి రాముని దగ్గరకు విభీషణుడు వచ్చేసాడు. ఆశ్రయం కోరి అభయం ఇమ్మని ప్రార్థించాడు. కరుణ స్వభావుడైన రాముడు విభీషణుడిని దగ్గరకు తీసుకొని అభయాశ్రమాలను ఇచ్చాడు.
విభీషణుడు రామునితో తన శేషజీవితం గడపాలని నిశ్చయించుకున్నాడు.
రాముడు కర్తవ్యాన్ని మరవకూడదని లంకను పాలించమని విభీషణుడికి చెప్పి పంపుతుంటే విభీషణుడు రాముని మాట కాదనలేక చాలా విచారంతో రాముని విడిచి వెళ్లడానికి బయలుదేరాడట. తనపై భక్తిని పెంచుకున్న విభీషణుడి పట్ల రాముడు ప్రేమను పెంచుకున్నాడు. విభీషణుడిని పిలిచి ‘విభీషణా నీకునేను ఒక విగ్రహరూపంలో భగవంతుడిని ఇస్తున్నాను. ఈ స్వామి నీవు ప్రతిరోజు పూజించుకో నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది నీకోరికలు నెరవేరుతాయి’అని చెప్పాడట. కాకపోతే ఈ స్వామిని లంకకు తీసుకొని వెళ్లేటపుడు కింద ఎక్కడా పెట్టకు అని కూడా చెప్పాడట.
విభీషణుడు ఎంతో సంతోషంతో ఆ స్వామిని తీసుకొని బయలుదేరాడట. కాని, మార్గమధ్యంలో ఎంతో అలసటకు గురైయ్యాడు. సరిగ్గా ఈ శ్రీరంగ ప్రదేశానికి వచ్చేటప్పటికి ఇక ఆయన ముందుకు సాగలేకపోయాడట.కావేరి నదికి, ఉపనదికి మధ్యలో ఉన్న ద్వీపంలోని ఆ వాతావరణానికి అక్కడి రమ్యమైన ప్రకృతికి అచ్చెరువు వొంది కొద్దిసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకొని ముందుకు వెళ్దామని అనుకొని అక్కడ విభీషణుడు ఆగాడు. రాముడు చెప్పిన నిబంధనను మరిచి చేతిలో ఉన్న స్వామిని నేలమీద పెట్టాడు. కొద్దిసేపు విశ్రమించిన తరువాత తిరిగి తన స్వస్థానానికి వెళ్లడానికి బయలుదేరి స్వామిని తీసుకోబోతుంటే స్వామి అక్కడే పడుకుండి పోయాడట. స్వామి విగ్రహాన్ని ఎంత తీస్తున్నా చేతికి రాలేదట.
అపుడు ఆ రాజ్యాన్ని పాలించే ధర్మచోళుడనే రాజు వచ్చి విభీషణుడికి ఓదార్పు మాటలు చెప్పి ‘లంకేశ్వరా! నీవు ఇక్కడికే వచ్చి స్వామిని పూజించుకో. ఇక్కడ ఉండడం ఈ స్వామికి ఇష్టంగా ఉన్నట్టుంది ’అన్నాడట.
విభీషణుడు రాముడు చెప్పిన మాటలు తలుచుకుని తప్పు తెలుసుకొని సరే విధి నిర్ణయం అనుకుని ‘స్వామి నీవు ఇక్కడే కొలువుతీరు. కాని నీ వెప్పుడూ నా లంకవైపు చూస్తుండు దక్షిణాభిముఖుడవై నన్ను అనుగ్రహించు’అని కోరుకున్నాడట. అంతే స్వామి దక్షిణాముఖుడైనాడు. ఇక్కడ ఈ శ్రీరంగనాథుని దర్శించిన వారికి వైకుంఠంలోని శేషసాయిని దర్శించిన అనుభూతి కలుగుతుంది.
ఈస్వామిదర్శించడానికి అన్ని ప్రాంతాల నుంచి రహదారి సౌకర్యంతో పాటుగా తిరుచినాపల్లి దాకా రైలులో వచ్చి అక్కడ నుంచి 9 కి. మీ దూరంలో శ్రీరంగానికి వివిధ వాహనాల్లో చేరుకోవచ్చు. తిరుచినాపల్లిలో విమానాశ్రయం కూడా ఉంది. ఇక్కడ నుంచి కూడా శ్రీరంగానికి వాహన సౌకర్యం ఉంది. ప్రతివారు ఈ శ్రీరంగ పరంథాముని దర్శించుకుని ముక్తిని పొందవచ్చు.

- జంగం శ్రీనివాసులు