మెయిన్ ఫీచర్

జీవమరణములు నాలుక వశము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామెతలు -18:21 - ఎవడైనను మాటయందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తిగల వాడగును. గుఱ్ఱములు మనకు లోబడుటకై నోటికి కళ్లెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా. ఓడలను కూడ చూడుడి అవి ఎంత గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. ఆలాగుననే నాలుక కూడ చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంతగా అదిరిపాటంటే, ‘నీవడిగితే చుక్కలు కోసుకొస్తా.. నీకు ఏం కావాలంటే అది ఇస్తా.. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా.. ప్రాణమైన ఇస్తా’ అంటారు. చివరకు ‘నా ప్రాణానికొచ్చిందంటారు’. ఇంకా ఎంత అదిరిపాటంటే - ‘నాకేంటీ?! ఎదురులేని మనిషిని. అక్కడ వాళ్లు తెలుసు. ఇక్కడ వీళ్లు తెలుసు. నేనెంత చెబితే అంతే. మా ఆఫీస్ నన్ను బట్టే నడుస్తోంది. నాకు అంతా తెలుసు. అందరూ తెలుసు. వినేవాడు ఉంటే చెప్పేవాడిని ఆపలేం. ఒక సంగతి - విస్తారమైన మాటలలో దోషముండక మానదు. తన పెదవులను మూసుకొనువాడు బుద్ధిమంతుడు -సామెతలు 10:19. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును -ప్రసంగి 5:3. అధికమైన మాటలు నిష్ప్రయోజనములు. అవిధేయులును వదరుబోతులును మోసపుచ్చువారై యున్నారు. వారి నోళ్లు మూయింపవలెను. అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లభము కొరకు ఉపదేశించుచు కుటుంబములకు కుటుంబములనె పాడుచేయుచున్నాడు. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై యుండుము -2 తిమోతి 2:16.
సామెతలు 3:5 - నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. చిన్నచిన్న మాటలు కుటుంబాలను తగులబెట్టుచున్నవి. ఒక చిన్న అనుమానపు మాట ఆధారంగా సంసారాలు తగులబడి పోతున్నాయి. చిన్నచిన్న తగవులు మొదలుకొని పెద్దపెద్ద యుద్ధాలకు కారణం అనవసరమైన మాటలే. ‘అసలు యుద్ధాలు ఎలా మొదలౌతాయి డాడీ?’ అన్న కొడుకు ప్రశ్నకు తండ్రి జవాబిస్తుంటే, ‘వాస్తవం మొదటి నుండీ చెప్పండి’ అని భార్య వంటింట్లో నుండి పెద్దగా అంది. భర్త - ‘అసలు నీవేంటీ మధ్యలో. నేను చెప్తున్నాను గదా’ అని అరిచేసరికి భార్య వంటింటి తలుపు భళ్లున వేసింది. అప్పటికే అర్థమైంది పిల్లవాడికి - తగవులు లేక యుద్ధాలు ఎలా మొదలౌతాయో?
సామెతలు 17:14 - కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట. వివాదము అధికము కాక మునుపే దాని విడిచిపెట్టుము. కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత. కలహానికి మధ్యలో వెళ్లి అనవసరమైన చిక్కులు తెచ్చుకున్న వారు లేకపోలేదు. మాటకు మాట ఉంచి శ్రమలపాలైన వారు ఎందరో.
యాకోబు 1:26 - ఎవడైనను నోటికి కళ్లెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తిగలవాడనని అనుకొనిన యెడల వాని భక్తి వ్యర్థమే. 1 పేతురు 8:10 - జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలకకుండ తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను. అప్పుడు మేలునొందుచు అనేక దినములు బ్రతుకుదువు. నోటిని కాపాడుకొను వాడు తన్ను కాపాడుకొనును. నోరు మంచిదైతే ఊరు మంచిదేనట. అందుకేనేమో దావీదు మహారాజు నా నోటికి కావలి యుంచుము. నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము అని ప్రభువును ప్రార్థించాడు (కీర్తన 141:3) మనతో అందరూ మంచిగా గౌరవంగా మాట్లాడాలని ఆశిస్తాం. అటువంటప్పుడు అవతలి వారు కూడా మన నుంచి మంచి మాటలు కోరుకుంటారు గదా. చల్లని మెత్తని చూపులలో నుండి వచ్చే మృదువైన మాటలు వినాలని అందరికీ కోరిక ఉంటుంది. అవి హృదయములను తెప్పరిల్లజేస్తాయి. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట క్రోధము లేపును - సామెతలు 15:1
నొప్పించు మాటలు, చాడీలు, అనవసరమైన మాటలు, ఇతరులను అవమానపరచే మాటలు, తప్పులు ఎత్తిచూపుట ఈ రోజుల్లో ఎక్కువైంది. అంచేత మంచి మాటలు వినాలని ఆశపడుతున్నారు. యేసు ప్రభువు మాట్లాడిన రీతిగా ప్రేమతో కరుణగా దయగల మాటలు మాట్లాడితే - మనకు దేవుని ఆశీర్వాదముంటుంది. విను వారికి జీవము సంతోషము ధైర్యము బలము ఉత్తేజము శాంతి సమాధానము కలుగుతుంది. మన మాటలు మంచి ఔషధములా పనిచేసి తోటివారిని బలపరుస్తాయి. ఆరోగ్యాన్ని ధైర్యాన్ని ఉత్తేజాన్ని ఆనందాన్ని సంతోషాన్ని సమాధానాన్ని ఇచ్చే ప్రేమ కలిగిన మాటలు మాట్లాడటానికి మాత్రమే మన నాలుకను వాడుదాము. సామెతలు 14:25 - నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును.
15:4 - సాత్వికమైన నాలుక జీవవృక్షము. 16:24 - ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి. అవి ప్రాణమునకు మధురమైనవి. ఎముకలకు ఆరోగ్యకరమైనవి., కీర్తన 34:30 - నీతిమంతుల నాలుక న్యాయము ప్రకటించును. మన నాలుకకు అద్భుతమైన శక్తి ఉంది. మంచికి చెడుకు కట్టుటకు పడగొట్టుటకు నిలువబెట్టుటకు నాశనము చేయుటకు దేనికైనా వాడవచ్చు. ఒక్క నోటి నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్లును. ఉప్పు నీళ్లలో నుండి తియ్యని నీళ్లును ఊరవు. కాబట్టి నాలుకను వశపరచుకొని ఆశీర్వచనమె పలుకుచు అందరు నిత్యజీవము పొందుకోటానికి యేసు ప్రభువు పునరుత్థాన శక్తిని మనకు అనుగ్రహించునుగాక.

-మద్దు పీటర్ 9490651256