మెయిన్ ఫీచర్

సినిమా జూదమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా హాలులోకి ప్రవేశించిన ప్రేక్షకుడు తననుతాను మరచిపోయి స్వప్నలోకంలో విహరించాలని కోరుకుంటాడు. సినిమా కథలో నటిస్తున్న పాత్రలలో లీనమైపోతాడు. తనను ఆ పాత్రల ప్రవర్తనతో ఐడెంటిఫై అవుతాడు. కుటుంబాలకు దూరంగా ఉద్యోగాలు చేసుకుంటూ బ్యాచ్‌లర్స్‌గా వుండే యువకులు కుటుంబ కథాచిత్రాలు చూస్తున్నప్పుడు ఆ పాత్రలలో తాత, తండ్రి, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, అమ్మ, వదిన వంటివారిని గుర్తుకు తెచ్చుకుంటూ, వారు తనవారే అనుకుంటూ తృప్తిపడతాడు. ఆయా సంఘటనలతో మమేకమైపోయి తనే సినిమాలో పాత్రయిపోతాడు. అక్కడి కష్టాలకు కన్నీరు కారుస్తాడు. వాళ్లు నవ్వితే తానూ నవ్వుతాడు, విరహం అనుభవిస్తాడు, ఆనందిస్తాడు. ప్రేక్షకుడు అట్లా అనుభూతి చెందేట్లు సినిమాను చిత్రీకరించడమే దర్శకుడి ప్రతిభ.
*
అరిస్టాటిల్ చూపించిన మార్గం కథ ఎత్తుగడ, నడక, చివరకు క్లయమాక్స్‌తో చాలా సినిమాలు వస్తున్నా అంతస్సూత్రం ఒకటే. దుష్టశిక్షణ, శిష్టరక్షణ. మన సినిమాలు పౌరాణికాలతో మొదలయ్యాయి. అప్పటి ధర్మాన్ని అతిక్రమించి దుర్మార్గాలను చేస్తున్నవారిని విలన్‌గా, ఆ విలన్‌ని శిక్షించేవాడు హీరోగా చిత్రించిన కథలే అవన్నీ. ఆయా కాలాలలో సమాజాన్ని పాత్రలను ప్రతిబింబించినవే అవన్నీ. సామాన్య ప్రేక్షకుడు ధర్మం, న్యాయం వైపు వుంటూ విలన్ ఓడిపోవాలనీ, హీరో గెలవాలనీ మనసులో కోరుకుంటూ సినిమా చూస్తుంటాడు. విలన్ ఓడిపోతాడనీ, హీరో గెలుస్తాడనీ తనకు తెలుసు. అలాగే జరగడంతో ప్రేక్షకుడి ఇగో తృప్తిపడుతుంది. ఇదంతా తనకు తెలియకుండానే జరిగిపోతుంది.
సీతను అపహరించి తీసుకుపోయిన రావణుడిని రాముడు చంపడం, పాండవుల భార్య ద్రౌపదిని నిండు సభలో అవమానించి మాయాజూదంలో వారి రాజ్యాన్ని లాక్కున్న కౌరవుల్ని యుద్ధంలో చంపడం, ఇవే కథలు పౌరాణిక, చారిత్రక, సాంఘిక చిత్రాలుగా వందేళ్ల నుంచి ప్రేక్షకులు చూస్తున్నారు. పాత్రలు అవే అయినా సన్నివేశాలు మారాలి. పౌరాణికాలలో అయితే ధర్మం, న్యాయం, నీతి నియమాలు పాటించాలి ఆయా పాత్రలు. ఇప్పుడైతే ప్రజాస్వామ్యం గనుక మనిషి రాజ్యాంగానికి లోబడి ప్రవర్తించాలి. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోగూడదు. అవినీతి అక్రమాలతో కూడబెట్టరాదు. ప్రజలకు చేరవలసిన సంపద దోచుకోకూడదు. అవి అతిక్రమించిన నాయకులు, అధికారులు విలన్లు. ఆ విలన్లను ఎదుర్కొని ప్రజల పక్షం వహించేవారే హీరోలు. ఏ నాగరికతలో అయినా మనుషులు కొన్ని కట్టుబాట్లు, నియమాలు ఏర్పరచుకుని ఆ విధంగా ప్రవర్తిస్తారు. అతిక్రమించేవారే విలన్లు. రాజకుమారిని అపహరించిన పాతాళభైరవి మాంత్రికుడిని జయించిన తోట రాముడు హీరోగా స్థిరపడ్డాడు. ప్రేయసికి పెళ్లయి దూరమైందనే వ్యధతో తాగుబోతై జీవితాన్ని త్యాగం చేసిన దేవదాసు కూడా హీరోనే అయ్యాడు. ప్రేయసిని భర్తనుంచి విడదీసి లేపుకెళ్తే అప్పుడు హీరో కాదు. విలనే అయ్యేవాడు. ప్రేక్షకులకు నచ్చేవాడు కాదు.
సినిమాకు కథే ఇంధనం. ఇండియాలోనే వివిధ భాషలలో నిర్మించే చిత్రాలకు రోజుకి మూడు కథలు కావాలి. ఎక్కడ్నుంచి వస్తాయి? మన దేశం 130 కోట్లకి చేరుకుంది. ఎన్నో కులాలు, ఆచారాలు, ఘర్షణలు నిత్యం జరుగుతున్నాయి. మీడియాలో కథనాలు వెలువడుతుంటాయి. అందులో నుంచే కథలు వెదుక్కోవాలి. జరిగే సంఘటనలకు కొంత కల్పన, తమ అనుభవం జోడించి రచయితలు కథలు, నవలలు రాస్తుంటారు. ఆ సమకాలీన సాహిత్యం నుంచి నిర్మాతలు, దర్శకులు కథలు వెతుక్కోవాలి. అప్పుడే ప్రేక్షకులను రంజింపజేసే సినిమాలు తయారవుతాయి.
సమకాలీన సాహిత్యానికి దూరంగా జరిగింది తెలుగు చిత్రసీమ. అందుకే సక్సెస్ రేటు పడిపోయింది. నూటికి పది శాతం సినిమాలు మాత్రమే విజయవంతం అవుతున్నాయి. లాభాలు తెచ్చిపెడుతున్నాయి.
ఒకప్పుడు ప్రభుత్వం సిమెంట్, స్టీల్, రాళ్ళు, ఇసుక సమకూర్చేవి. కంట్రాక్టర్ కూలీలను తెచ్చుకుని ప్రభుత్వ ఇంజనీర్ల పర్యవేక్షణలో నిర్మాణాలు జరిపేవాడు. ఇప్పుడు అంతా గంపగుత్తగా కాంట్రాక్టరే సమకూర్చుకుని నిర్మాణాలు చేయాలి. అవే కనస్ట్రక్షన్ కంపెనీలు. మొదట అనుకున్న ఎస్టిమేట్‌తో పని జరగదు. కాలం గడిచేకొద్దీ అంచనాలు, వందలు వేల కోట్లు పెరిగిపోతూ వుండడం మనం చూస్తున్నాం.
ఇప్పుడు సినిమా నిర్మాణం అదే పరిస్థితిలో వుంది. సక్సెస్‌వున్న డైరెక్టర్ ఒక కంపెనీ. ప్రొడ్యూసర్ కేవలం డబ్బు సమకూర్చే పెట్టుబడిదారుడు. కథ దగ్గర్నుంచి, నటీనటుల్ని ఎన్నుకోవడం, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వరకు పూర్తిచేసి, గుమ్మడికాయ కొట్టడం వరకు డైరెక్టర్‌దే బాధ్యత. ఇక్కడ కూడా అంచనాలు పెరిగిపోతుంటాయి. ఒక హీరో సినిమా పది కోట్ల బడ్జెట్‌తో నిర్మితమై ముప్ఫైకోట్లు వసూలుచేస్తే, తదుపరి చిత్రానికి ఆ హీరో సినిమా బడ్జెట్ పెరిగిపోతుంది. ముప్ఫై కోట్ల బడ్జెట్‌తో సినిమా తియ్యడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు వందల కోట్లు బడ్జెట్ అంటూ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పుడు వరుస విజయాలు ఏ హీరోకీ లేవు. రజనీకాంత్ కబాలి, కాలానే ఉదాహరణలు. టెక్నాలజీ పేరుతో రోబో-2 నాలుగువందల కోట్ల బడ్జెట్‌తో తీస్తున్నారు. బాహుబలి కలెక్షన్లకన్నా ఎక్కువ వసూలు చేయాలట. ఎందుకు అనారోగ్యకరమైన పోటీ? సినిమా నిర్మాణం జూదంగా తయారు చేయడం అవసరమా?
నటరత్న ఎన్.టి.రామారావు మాటలు ఇప్పటి నిర్మాతలకు శిరోధార్యం.
‘‘బ్రదర్! నా ప్లాఫ్ సినిమా ఎంత వసూలు చేసిందో, అంత బడ్జెట్‌లో సినిమా నిర్మించండి’’
విజయాలు వరిస్తున్నంతనే పారితోషికం పెంచకుండా బడ్జెట్ అదుపులో వుంచిన మహానుభావుడు ఆ మహానటుడు. అందుకే అప్పటి నిర్మాణ సంస్థలు పదికాలాలపాటు నిలబడ్డాయి. ఇప్పుడు నిర్మాత ఏక్ సినిమాకా సుల్తాన్. నెక్స్ట్ ఏంటో తెలీదు.

- వాణిశ్రీ