మెయిన్ ఫీచర్

అవగాహనతోనే విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉద్యోగాలు చేయడం ఆర్థికావసరాలు తీర్చుకోవడానికే. కాని, నేడు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల వస్తున్న యాంత్రికత వల్ల చేస్తున్న ఉద్యోగానికి మించిన ఉద్యోగం చేస్తే బాగుంటుందన్న ఆలోచన వస్తోంది. మార్కెట్లో ఎటు పోతోందో తెలుసుకొని దానికి తగ్గట్టు మనలను మనం మార్చుకోవడానికి ఆర్థిక వనరులను మెరుగు పర్చుకోవడానికి ఒక్కోసారి చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి మరో ఉద్యోగం వెతుక్కోవలసి వస్తోంది. లేదా సొంత వ్యాపారం చేయాల్సి వస్తోంది.
ఇంకొన్ని సార్లు చేస్తున్న ఉద్యోగస్థాయిని పెంచుకోవాల్సి కూడా ఉంటుంది. ఇక్కడే కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయ.
ఇట్లాంటపుడే ఏ సంస్థలో పనిచేస్తున్నామో ఆయాసంస్థల్లో ఉన్న సాంకేతిక జ్ఞానానికి తగ్గట్టుగా మనం ట్యూన్ అవుతున్నామా లేదా ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి. లేదా కొత్త సంస్థలకు వెళ్లేటపుడు అన్నివిధాల సరియైన ఉద్యోగమేనా అని మొట్టమొదట చూడాలి. ఒక్కోసారి పెనంలోంచి పొయ్యిలో పడ్డట్టు కూడా అవుతుంటుంది. అందుకే ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. ఏది మంచిది ఏవిధంగా సరియైనది ఎవరికి వారు పోల్చుకుని చూసుకోవాలి. కేవలం జీతాన్ని ఒకటే చూసుకోగూడదు. అక్కడ పనిచేసే సమయం, చుట్టు పక్కల పని చేసేవారు, వారి హోదాలు , చేయవలసిన పని, పనికి వెళ్లడానికి పట్టేసమయం కూడా లెక్కలోకి తీసుకోవాలి. అపుడే కొత్త పని గురించి ఆలోచించాలి. లేకపోతే ‘అయ్యో మంచి ఉద్యోగం వదిలేశానే’అని బాధపడాల్సి ఉంటుంది.
కంప్యూటర్‌లో వచ్చేమార్పులు, ఆధునిక టెక్నాలజీ నెట్‌ను వాడకంలోకి తీసుకోవడం లాంటి వాటి మీద ఎప్పటికప్పుడు మంచి పట్టును సాధించాలి. ఉన్నచోటే మెరుగైన అవకాశాలు వస్తాయేమో ముందు చూసుకోవాలి. తక్కువ సమయంలో ఎక్కువ పని చేసి ఔట్‌పుట్ ఎక్కువ తేగలమా అని చూసుకొంటే అపుడు ఏ సంస్థలోనైనా మీరు ముందుకు పోగలరు.
ఒకవేళ సొంతంగా ఏదైనా చిరువ్యాపారం చేద్దామని ఉన్న ఉద్యోగాన్ని వదిలేస్తున్నా .. ఏ వ్యాపారం చేయాలి, దానికి ఎంత పెట్టుబడి కావాలి, ఎంతమందితో వ్యాపారాన్ని కొనసాగించవచ్చు, ఉత్పత్తి చేసిన వస్తువులకు తగిన మార్కెట్ ఉందా లేదా ఈవిషయాలన్నీ కూడా ముందు ఒక అవగాహనకు తెచ్చుకోవాలి.
ఇంతకుముందు ఈవ్యాపారాన్ని ఎవరు చేశారో, ఒకవేళ వారు ఆ వ్యాపారాన్ని మానివేసి ఉంటే ఎందుకు మానేశారో లేక వారు మంచి లాభాలను ఆర్జిస్తుంటే దానికి వారు చేసిన కృషి ఏమిటో కూడా ముందే తెలుసుకోవాలి. వ్యాపారాన్ని గురించి తెలుసుకొనేటపుడు ఏవిధమైన మొహమాటలకు పోగూడదు. నిక్కచ్చిగా విషయం తెలుసుకొంటే అపుడు అనుకొన్న వ్యాపారాన్ని సజావుగా సాగించవచ్చు.
ఉద్యోగమైనా, వ్యాపారమైనా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికే అనుకొన్నపుడు పూర్తి అంచనాలతో పూర్తి అవగాహనతో మొదలు పెట్టాలి. అపుడే అనుకొన్న లాభాలు వస్తాయి. వ్యాపారం మొదలుపెట్టేటపుడు కూడా కీడెంచి మేలెంచాలి అన్న సామెతను దృష్టిలో పెట్టుకొని ఒకవేళ అనుకొన్నట్టు సాగకపోతే పెట్టుబడి పెట్టిన సొమ్ము , ఉత్పత్తి చేద్దామనుకొని తీసుకొనిన వస్తువులను ఏం చేయాలి అన్నది కూడా ముందే చూసుకోవాలి. లేకపోతే అనవసరమైన నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది.
పుట్టగొడుగుల పెంపకం, కొవ్వొత్తుల తయారీ , పచ్చళ్లు పొడుల వ్యాపారం, కర్రీ పాయంట్స్, లేదా పండ్ల, కూరగాయల వ్యాపారం, పూల ఉత్పత్తి , డిటిపి సెంటర్స్, కుట్టుపని, జిరాక్స్‌మెషిన్స్, ఫ్యాన్సీ వస్తువుల అమ్మకం ఇలా ఏవైనా కావచ్చు. అదీ కాదంటే రెడీమేడ్ దుస్తుల దుకాణం కాని అడిగిన వారికి అందుబాటులోకి తెచ్చే వీలుగాని లేదంటే గారెంట్మ్స్ షాపుల వారికి అందచేయడానికి పనికివచ్చే బట్టలు కుట్టడానికి గాని ఎలా దైనికైనా ముందు అనుభవజ్ఞుల దగ్గర ట్రైనింగ్ తీసుకొని కొత్తవ్యాపారం మొదలు పెడితే విజయం సాధించడానికి అంతగా ఆలోచించనక్కర్లేదు.
కాని ప్రతిదాన్ని బాగా ఆలోచించి ఇంతకుముందు చేసినవారి దగ్గరకు వెళ్లి వారి అనుభవాలను కనుక్కొని ఆ తరువాతనే ప్రారంభించాలి. ఒక్కసారి ప్రారంభించి వెనకడుగు వేయకుండా ముందుకు పోగలిగితే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల నుంచి బడా పారిశ్రామిక వేత్తలు అవుతారు.
ముందు ట్రైనింగ్ అవసనరం అనుకొంటే చేస్తుంటే వస్తుందిలే అనుకోకుండా తప్పనిసరిగా ట్రైనింగ్‌కు వెళ్లాలి. మహిళలే ప్రారంభంచేసి, వారే అన్ని పనులు చేస్తున్నా సరే కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరిగా తీసుకోండి అపుడు అనుకొన్న దానికంటే ఎక్కువ మంచి ఫలితాలను రాబట్టుకోవచ్చు.. దేనికైనా సరే ఒక పక్కా ప్రణాళికతో పనిని ప్రారంభిస్తే విజేతలు మీరే అవుతారు.

- రాధిక