మెయిన్ ఫీచర్

సంతాన ప్రదాత ఉపమాక వెంకన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉపమాక అనగా ఉపమానం లేనిది (సాటిలేనిది) అని అర్థం.అటువంటి దివ్యక్షేత్రంలో కలియుగం దైవంగా భాసిల్లే తిరుమలవేంకటేశ్వరుడు తనకు తాను గా వచ్చి అక్కడ దేవేరీతో సహా కొలువై తన భక్తుల చేత నిత్య పూజలందుకుంటున్నాడు. ఆ స్వామి భక్తుల కోరిక మేరకు తానే తన్ను సృజియంచుకుంటూ ఎన్నో దివ్యక్షేత్రాల్లో అనేక దివ్యరూపాల్లో వెలసి భక్తుల కోరికను తీరుస్తున్నాడు. ఆ దివ్య క్షేత్రాల్లో ఒకటి ఈ ఉపమాక. ఈ ఉపమాక అనే గ్రామం విశాఖపట్నం జిల్లా, అనకాపల్లికి సమీపంలోనిఉంది.
‘కలౌ వేంకటనాయక’ అన్నట్టుగా కలియుగాన శ్రీమన్నారాయణుడే ఉపమాక వేంకటేశ్వర స్వామివారు. దశావతారాల్లో పదో అవతారమైన కల్కి అవతారంగా ఇక్కడ వేంచేశారు. శ్రీమన్నారాయణుడు గరుత్మంతునకు, ఋషీశ్వరులకు ఇచ్చిన వర ప్రకారంగా వేంకటేశ్వరునిగా కలియుగాన షడ్భుజాలతో, లక్ష్మీ సమేతుడై, అశ్వారూఢుడై ఇక్కడ కొలువైనారు. ఈ స్వామివారు ఆరు భుజాలు కలిగివున్నారు. అయిదు హస్తాలలో దుష్ట శిక్షణా, శిష్ట రక్షణా చేయు పంచాయుధాలను ధరించారు. మరో హస్తంతో అభయముద్రను కలిగి భక్తులకు భవబంధాలను దూరం చేసి తన అక్కున చేర్చుకుంటున్నారు. గుర్రం మీద కూర్చుని కింది వామ భాగాన లక్ష్మీదేవితో కలిసి భక్తులకు దర్శనమిస్తారు.
క్షేత్ర విశేషాలు
ద్వాపర యుగాంతంలో గరుత్మంతుడు కృష్ణ భగవానుని ఎల్లవేళల తన మూపురం(వీపుపై) ఉండేలా వరం కోరుకున్నాడట. అపుడు ఆ కృష్ణుడు దక్షిణ సముద్ర తీరంలో గరుడుడు పర్వతంగా మారుతావు. అపుడు నేను వేటకు వచ్చి ఆ కొండపై స్థిరపడుతాను. అపుడే నీ కోరిక నెరవేరుతుంది అని అభయం ఇచ్చాడట శ్రీకృష్ణుడు. దానివల్లనేఇక్కడ ఉన్న పర్వతాన్ని గరుత్మంతుని అంశగా చెబుతారు. ఈ విషయం బ్రహ్మవైవర్తన పురాణం చెబుతుంది. క్రీ.శ. ఆరో శతాబ్దంలో తూర్పు గోదావరి జిల్లా కాండ్రేగుల సంస్థానానికి అధిపతుడు శ్రీ కృష్ణ భూపాలుడు శ్రీ స్వామివారికి ఆలయం ఈ పర్వతం పైన నిర్మించినట్టు చారిత్రిక ఆధారాలు తెల్పుతున్నాయ.
17వ, 18వ శతాబ్దాల్లో పీఠాపురం సంస్థానానికి చెందిన ప్రభువు ముచ్చటపడి ఎంతో విలువైన పచ్చలు, వజ్రాల కిరీటం చేయించుకుని ఒక శుభముహూర్తాన ధరించుదామని అనుకుని ఏర్పాట్లు చేసుకున్నారట. శుభముహూర్తానికి ముందురోజున ఆ రాజునకు స్వప్నంలో స్వామి దర్శనమిచ్చి ఉపమాక క్షేత్రాన నేను వేంచేసి ఉండగా, ‘నాకు సమర్పించక నీవు ధరించెదవా’ అని అడుగగా, రాజు దిగ్బ్రమకు గురైయ్యాడు. అంతకంటే భాగ్యమేమున్నది. ఈ నీవు ఇచ్చిన సంపదను నీకు సమర్పించడానికి నేను ఎంతో ఆనందపడుతున్నాను అంటూ మరునాడు గొప్ప సైన్యంతోను, గజ, అశ్వాలతో గొప్ప ఊరేగింపుగా వచ్చి శ్రీ స్వామివారికి కిరీటం సమర్పించారు.
బ్రౌన్ గూర్చిన హిందు దేవాలయాల చరిత్రలో కూడా ఈ ఉపమాక దేవాలయం ప్రసక్తి ఉంది. ప్రస్తుతం ఈ గ్రంథం మద్రాసు (చెన్నై) కాన్‌మేరా గ్రంథాలయంలో ఉంది. జగద్గురు శ్రీ త్రిదండి రామానుజాచార్యుల వారు భారతదేశంలోని 108 క్షేత్రాలు దర్శించినారనే క్షేత్రాల్లో ఉపమాక కూడా ఉంది.
ఈ దేవాలయంలో పూజాదికాలు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి శ్రీ స్వామివారికి వార్షిక కల్యాణోత్సవాలు, తిరు నక్షత్రాలు శ్రీ రాముని అధ్యయన ఉత్సవాలు, వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ వేణుగోపాల స్వామి వారి వార్షిక కల్యాణం, ధనుస్సంక్రమణం మున్నగు విశేష కార్యక్రమాలతోపాటు ఆయా సమయాల్లో పుణ్యకోటి వాహనం, పొన్న వాహనం, గరుడ వాహనం, గరుడ వాహనం, రాజాధి రాజ వాహనం, పెద్దపల్లికి, చిన్న పల్లకి వాహనాలపై శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ఉభయ నాంచారులతో కూడా గ్రామ తిరువీధి సేవలు వైభోపేతంగా నిర్వహిస్తున్నారు.
ఈ ఉపమాకలోని స్వామికి ఏదైనా కోరికను విన్నవించి, అది నెరవేరిన తర్వాత కాలి నడకను కొండపైకి వస్తాను అని అనుకుంటే ఆ కోరిక తప్పక నెరవేరుతుంది. స్వామివారు సంతాన ఫలప్రదాతగా కూడా ప్రసిద్ధి పొందారు.
ఈ ఉపమాకకు తూర్పువైపున శ్రీ భువనేశ్వరి సహిత లక్ష్మణేశ్వర స్వామి, ఈ ఆలయానికి కుడివైపున శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయం, ఉపమాక క్షేత్రానికి 14 కి.మీ. దూరంలో ఉన్న ఒడ్డిమెట్ట అను గ్రామంలో శ్రీ గణపతి ఆలయం ఉంది. తుని పట్టణానికి వెళ్ళే మార్గంలో ఈ ఆలయం కనిపిస్తుంది. ఉపమాక క్షేత్రానికి 19 కి.మీ. దూరంలో ఉన్న పాయకరావుపేటలో శ్రీ రాధా రుక్మిణి సహిత పాండురంగ స్వామి ఆలయం కూడా ఉంది.

- జి. కల్యాణి