మెయిన్ ఫీచర్

అమ్మ ... అమృతం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తల్లిపాల వారోత్సవాల సందర్భంగా..
*
అమ్మ.. ఈ ప్రపంచంలో ఎక్కడ ఎవరు ఎప్పుడు విన్నా పూర్తిగా తన్మయత్నం చెందే పదం ఇది. నిజానికి ఈ సృష్టిలో ఏ భాషలో అయినా ఇంతకంటే అద్భుత పదం మరొకటి ఉండదు. ఎందుకంటే అమ్మలో మనందరి జన్మ ఉంటుంది. అందుకే కాబోయే అమ్మని ఎంతో ప్రత్యేకంగా చూసే సంస్కృతి ఈ ప్రపంచమంతటా ఉంది. అమ్మకు, అమ్మతనానికి ఇచ్చే గౌరవం మన దేశ సంస్కృతిలో మరింత ఎక్కువ. తరతరాల మనిషి మనుగడకు నిండైన చిహ్నం అమ్మ.
అమ్మపాల కమ్మదనం, తల్లిపాల గొప్పదనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అవి అమ్మ పంచే అమృతం. జీవితాంతం బిడ్డకు అండగా నిలుస్తుంది. వారిని అనారోగ్యాల దుష్టశక్తులు పిల్లలకు సోకకుండా రక్షణ కవచంలా కాపాడుతుంది. తల్లిపాలు చేసే మేలు తెలిసీ నిర్లక్ష్యం చేయడం, తల్లిపాల గొప్పదనాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం పెద్ద లోపం. బిడ్డ భూమీదకు వచ్చాక ఎన్నో రకాల ఇన్‌ఫెక్షన్లూ, వ్యాధులూ దాడికి సిద్ధమవుతుంటాయి. వాటి నుంచి కాపాడుకునేందుకు అమ్మ చేతిలో ఉన్న అస్త్రం చనుబాలే!
బిడ్డ ఆరోగ్యంగా పెరగాలంటే మాత్రం తల్లిపాలు తప్పనిసరి. తల్లిపాలు ప్రకృతి ప్రసాదం, దివ్యౌషధం. పురుడు వచ్చే సమయానికి తల్లికి పాలు ఉత్పత్తికావడం, అపుడే పుట్టిన బిడ్డకు ఏమీ తెలియదు కానీ, పాలు తాగే విద్య మాత్రమే తెలియడం, అమ్మ కౌగిలిలో వెచ్చదనం, అమ్మపాలలో కమ్మదనం, భద్రతాభావం నిత్యం అనుభవించాలని పుట్టిన బిడ్డ భావించడం తెలియకుండానే జరిగిపోతాయి. ఇది సృష్టి ధర్మం.
శిశువుకు తల్లిపాలే సరైన ఆహారమని ప్రపంచంలోని దేశాలన్నీ గుర్తించాయి. శిశువు చనుపాలను త్రాగడంవల్ల తల్లీ బిడ్డల అనుబంధం బలపడుతుంది. శిశువు ఎదుగుదలకు తల్లిపాలు ఎంతగానో తోడ్పడతాయి. తల్లి బిడ్డకు ఆహారంగా త్రాగించే చనుపాలల్లో బిడ్డకు కావలసిన పోషక పదార్థాలన్నీ ఉంటాయి. తల్లి పాలలో ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, కొవ్వు, నీరు పుష్కలంగా లభిస్తాయి. తల్లి పాలలో వుండే ఇమ్యూనోగ్లోబిన్స్, లాక్టోఫెర్రీస్, లాక్సోఫెర్సాడేస్ బిడ్డ ఆరోగ్యానికి రక్షణగా పనిచేసి అంటువ్యాధులు సోకకుండా కాపాడతాయి. తల్లిపాలు త్వరగా జీర్ణమవుతాయి. శిశువుకు అజీర్ణవ్యాధులు, వాంతులు, విరేచనాలు లాంటి అనారోగ్యాలు ఏర్పడవు. బిడ్డకు చురుకుదనాన్ని, బుద్ధికుశలతనూ పెంచి, వయస్సుకు తగినట్లుగా ఎదుగుదల, ఆటపాటలు, ఆరోగ్యం పెంపొందేలా చేస్తాయి తల్లిపాలు. గర్భిణీ పోషక విలువలు సమృద్ధిగా లభించే ఆహారాన్ని తీసుకోవాలి. గర్భధారణ సమయంలో స్ర్తి శరీరంలో ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. చనుపాల ఉత్పత్తికి తోడ్పడే మరో హార్మోన్ ఆక్సిటోసిన్. ఈ రెండు హార్మోన్లు శిశువుకు ఆహారంగా చనుపాలు పెరిగేందుకు తోడ్పడతాయి. తల్లి పాలు కడుపునిండా తాగిన శిశువు రెండు మూడు గంటలసేపు ఆదమరచి నిద్రపోతుంది. వయస్సుకు తగిన బరువు కూడా పెరుగుతుంది. కనీసం మూడు నాలుగు నెలల వయస్సువరకైనా శిశువుకు తల్లిపాలు త్రాగించటం తల్లీ బిడ్డల ఆరోగ్యానికి మంచిది.
తల్లి బిడ్టకు స్తన్యమివ్వడంవల్ల పాపాయి ఎదుగుల, ఆరోగ్యంతోపాటు తల్లి ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అలాగే పాలు ఇవ్వడంవల్ల తాను పెరిగిన బరువును తగ్గించుకోగలుగుతుంది. గర్భసంచి తిరిగి యధాస్థితికి చేరుకుంటుంది. బ్రెస్ట్ కాన్సర్ రాకుండా నివారించవచ్చు. నెలసరి ఋతుక్రమం బిడ్డకు పాలివ్వడం ద్వారా కొంతకాలం రాకుండా ఉంటుంది. స్తన్యమివ్వడం ద్వారా తిరిగి గర్భం ధరించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాన్సర్, కంటిచూపు సమస్యలు వంటి వ్యాధులను కూడా దరిచేరనివ్వదని శాస్తవ్రేత్తలు అంటున్నారు. పోతపాలు తాగినవారికంటే తల్లిపాలు తాగే పిల్లల్లో ఎదుగుదల ఆశాజనకంగా ఉందని, ఆరోగ్యపరంగా వీరు ముందంజలో ఉన్నారని వారు గుర్తించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు ప్రకారం శిశువుల గరిష్ఠ పెరుగుదలను, ఆరోగ్యాన్ని సాధించాలంటే వారికి మొదటి ఆరు నెలలపాటు కేవలం తల్లిపాలు మాత్రమే తాగించాలి. పాలిచ్చే తల్లుల ఆహారం కూడా శిశువు పెరుగుదలకు మరియు తమ ఆరోగ్యానికి కావలసిన పోషక పదార్థాలను అన్నింటిని అందించేలా ఉండాలి. సీజన్‌లో దొరికే కూరగాయలు, ముఖ్యంగా ఆకుకూరలు, పాలు, తాజా పళ్ల ద్వారా ఖనిజాలు, విటమిన్లు అవసరాలకు తగినంత పొందవచ్చు. మొలకెత్తిన పప్పులు, విటమిన్ సి అధికంగా ఉండే ఆహార పదార్థాలు, పుల్లటి పళ్లద్వారా ఎక్కువ చేసుకోవచ్చు. శరీరానికి కాల్షియం బాగా అందటానికి పాలు మంచి ఆహారంగా పనిచేస్తాయి. సమతుల ఆహారం ద్వారా పోషకాలలో చాలావాటిని సంపాదించుకోగలిగినప్పటికీ, గర్భిణీలు పాలిచ్చే తల్లులు అదనపు పోషకాలను- ఇనుము, పోలిక్ యాసిడ్, విటమిన్ బి12, కాల్షియం విడిగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
ప్రసవానికి ముందుగానీ, ప్రసవం తర్వాతగానీ తల్లి ఎటువంటి మానసిక ఆందోళనలకు గురికాకూడదు. పూర్తిగా విశ్రాంతిగా, ఉల్లాసంగా ఉండాలి. గర్భిణీగా ఉన్నపుడు జంక్‌ఫుడ్స్ జోలికి వెళ్లకుండా పోషక పదార్థాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. వెల్లుల్లి ధనియాలను పొడి చేసి తగినంత ఉప్పు, కారం కలిపి అన్నంలో కలుపుకొని తినాలి. జీలకర్రను దోరగా వేయించి మెత్తటి పొడి చేసి ఆవు నెయ్యి కలుపుకుని తినాలి. వామును పెనంపై నల్లగా మాడ్చి మెత్తగా పొడిచేసి చిటికెడు పొడిని అన్నం తినేటపుడు మొదటి ముద్దలో కలుపుకుని తినాలి. నెయ్యి వేసుకోవడం కూడా ముఖ్యమే. బార్లీ గింజలను పాలలో మెత్తగా మరిగించి దానికి చక్కెర కలిపి ఆ పాలను తాగాలి.

- తరిగొప్పుల విల్లెన్ మూర్తి