మెయిన్ ఫీచర్

కూరల సాగుతో.. ఆనందం, ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు ఇలా ఏవైనా సరే అన్నింటికీ క్రిమి సంహార మందులు వేసి పెంచేస్తున్నారు. దిగుబడి ఎక్కువ కావాలని ఏవేవో ఎరువులు వేసేస్తున్నారు. తక్కువ కాలంలో ఎక్కువ రాబడి కోసం రైతులు ఎన్నో పురుగు మందులను పంటలపై చల్లుతారు.
ఈ పురుగుల మందులు ఒక్కోసారి పంటబాగా పండేట్లు చేసినా కూడా సేంద్రియ ఎరువులు కాకుండా రసాయినిక ఎరువులు వేయడం వల్ల పండిన పంట తిన్నవారికి హాని చేస్తున్నాయి. రైతులు పంట కాపుకు రాగానే మార్కెట్ చేసేస్తుంటారు. మార్కెట్‌కు వచ్చే సరుకు పూర్తిగా పండి ఉండదు. పక్వదశకు రాగానే పంపిచేస్తారు. పండ్లు అయితే పూర్తిగా పండడానికి వ్యాపారులు వాటిమీద కొన్ని రకాల రసాయనాలు చల్లుతారు. వాటివల్ల మంచి రంగు కనిపిస్తుంది. కొనుగోలు దారు చాలా బాగున్నాయని కొనేస్తుంటారు. కాని అవి దేనివల్ల బాగున్నాయో చాలామంది చూడరు. వీటి వల్ల కూడా ఆ పండ్లు తిన్నవారిని హాని కలుగుతుంది.
పెద్ద పెద్ద పండ్లను పండించలేకపోయినా కూరగాయలన్నీ పండించుకోలేక పోయినా అవసరమైనవి, చిన్న మోతాదులో సరిపోయేవి మాత్రం అపార్ట్‌మెంట్స్ లో నివసించే వారైనా కూడా కుండీల్లో పెంచుకుంటే ఈ హానికారక వస్తువులకు దూరంగా ఉండవచ్చు.
ముఖ్యంగా ప్రతిరోజు వంటల్లో పచ్చి మిర్చి వేయడం చాలావరకు అవసరమే. అట్లానే కరివేపాకు, కొత్తిమీర, టమాట ఇట్లాంటి చాలావరకు కుండీల్లో పెంచుకుంటే మంచిదంటున్నారు.
పచ్చి మిరపను ఒకటి రెండు చెట్లే కుటుంబానికి సరిపోయేపంటను అందించగలవు. అలాగే టమాటాలు, దొండ, కాకర, పొట్ల ఇవన్నీ కూడా కుండీల్లో పెంచుకుంటే ఆ కుటుంబానికే కాదు చుట్టుపక్కల వారికి కూడా ఒకరోజు రుచి చూపించవచ్చు.
అట్లానే మిరప లో ఉండే రకాల వారిగా మూడు, నాలుగు కుండీల్లో మిరపను నాటుకుంటే ఇంటి అందంతో బాటు మిరప సాగును చేసిన అనుభూతి మిగులుతుంది. బజ్జీలుగా వేసుకొనే మిరప, చల్లమిరపకాయలు వేసుకొనే మిరప, కూర చేసుకొనే మిరప, సలాడ్స్‌లో వేసుకొనే రకరకాల మిరప ఇలా ఇన్ని రకాల మిరపలను కుండీల్లో వేసుకోవచ్చు. మిరపకు ఎక్కువ నీరు పెట్టనవసరం లేదు. మూడు అడుగుల లోతుగా మట్టిపోసుకునే ట్రేల్లో కూడా మిరప ను పండించవచ్చు. వర్మికంపోస్టు వేసుకొంటే మంచి పంటను మనం కళ్లారా చూడవచ్చు. ఒక్కనెలరోజుల్లోనే పంట వచ్చేస్తుంది. పైగా ఇవి ఎప్పటికప్పుడు కోసేసుకోవాలి అన్న బాధ కూడా ఉండదు పచ్చివి తీసుకోవచ్చు. పండుగా మారినా పచ్చళ్లకోసం నిలువ చేసుకోవచ్చు. అదీకాదు అంటే పండుమిరపను ఎండబెట్టుకుంటే ఎండుమిరప కూడా మనింట్లోనే తయారు అవుతుంది.
టమాటలో పూసారూబీ,స్వీకార్, మనీషా, సదాబహార్ అన్న రకాలుంటాయి. వీటిల్లో దేనినైనా చక్కగా కుండీల్లో పెంచుకోవచ్చు. సాధారణంగా గుబురుగా పెరిగే చెట్లు, సాగే మొక్కలు టమాటాలో మనం కనిపిస్తుంటాయి. ఏది నాటుకున్నా కాస్త వెదురుబద్దలను ఆసరా గా టమాట మొక్కలకు నిలిపి తే చాలు మంచి పంట వస్తుంది. ఈ టమాట ఆకులనుంచి రసాన్ని తీసి గులాబీ మొక్కల మీద చల్లితే గులాబీ మొక్కలకు పురుగు పట్టకుండా వుంటుంది. ఈ టమాట మొక్కలకు కూడా కుండీల్లో నీరు నిలువ లేకుండా తేమగా ఉంచుకుంటే చాలు. గాలి తగిలేట్టుగా కుండీలను అమర్చుకుంటే మంచి పంట వస్తుంది. రోజు కూరల్లో పెరటినుంచి తీసుకొని వచ్చి వేసుకొని వంట చేసుకుంటే ఆ రుచే అద్భుతంగా ఉంటుంది. ఇంకా కావాలంటే క్యారెట్లు, టమాట మొక్కలు కలిపి నాటుకుంటే కూడా క్యారెట్లల్లో రుచి పెరుగుతుంది అంటారు. పచ్చి మిరిప, టమాట లేకుండా వంట చేయడం కష్టమే కనుక ఈ రెండింటినీ కుండీల్లో పెంచుకోవచ్చు. ఇక కరివేపాకును, కొత్తిమీరను కూడా నాటుకుంటే ఏ ఎరువులు వేయకపోయినా ఇంట్లో వచ్చే ఉల్లిపొట్టును, టీ,కాఫీ డికాషన్ పిప్పిని ఆకుకూరలు కాయగూరలు తరిగినప్పుడు వచ్చే పొట్టును వేసినా కూడా కొత్తిమీర, కరివేపాకు చక్కగా పెరుగుతాయి. ఇవి ఇల్లంతా మంచి సువాసనను కూడా ఇస్తాయి. వంటల్లో రుచిని కూడా పెంచుతాయి. కనుక ఈ చిన్న చిన్న కూరలను ఇంట్లో పెంచుకుని ఆనందాన్ని ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి.

- వాణి ప్రభాకరి