మెయిన్ ఫీచర్

ధర్మాచరణమే మన విధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవలోకంలో మానవులకు, జంతువులకు, వస్తువులకు భగవానుడు కొన్ని ధర్మాలను నిర్దేశించాడు.
వినయము, సహనము, ఆచారము, పరాక్రమము మానవునికి సంస్కారం అందించే సాధనాలు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను నిర్జించి, పరమాత్మ పట్ల భక్తిని కల్గించటానికి ఉపకరణాలు. తనకు నచ్చని అంశాలను పరులమీద రుద్దకుండా చేయటం ధర్మం. తనదారిలో ఎవరి మాట వినకుండా ముందుకు నడవడం అధర్మం.
అగ్ని వేడిని, నీరు చల్లదనాన్ని అందిస్తాయి. సింహం గర్జిస్తుంది. అటు ఇటూ పరుగెత్తుతూ చపలత్వాన్ని ప్రదర్శించడం లేడి లక్షణం. ఈ రకంగా ప్రతిదీ తన ధర్మాన్ని పాటింపజేయడం కేవలం పరమాత్మ సృజన. ఆయన సంకల్పం లేనిదే మానవ ధర్మం మృగ్యమే.
ప్రేమించుట ప్రేమ ధర్మం. విగ్రహంలో నిగ్రహ స్వరూపుడై సాక్షాత్కరించే ప్రేమమయ రూపమే పరమాత్మ. ఆయనచే సృష్టింపబడిన ధర్మము ఆచరించాల్సిన వ్యక్తి మానవుడే. మానవ దేహమునకు ధర్మక్షేత్రమనే పేరుగలదు. ఇందులో సాక్షి మనస్సు. ప్రతి పనిలో మనిషి అభివృద్ధిని ఆశిస్తాడు. అది సాధించాలంటే కఠోర సాధన అవసరం. ఆ సాధనే ధర్మం. అది మనిషిని పతనం కానివ్వకుండా కాపాడుతుంది.
ధర్మాచరణ మానసికమైనందున వ్యక్తి మనఃస్థితిని బట్టి ఆధారపడి వుంటుంది. తన వ్యక్తిగత ధర్మాన్ని విడిస్తే అది అభివృద్ధిని నిరోధిస్తుంది. అటువంటి వ్యక్తికి సుఖ సంతోషాలు, శాంతి లభించవు. వేదాలు చాతుర్వర్ణములకు కొన్ని ధర్మాలను ప్రసాదించినవి. ఆయా వర్ణాలు వారికి విధించిన ధర్మాలను అనుసరించవలసి ఉన్నది.
ప్రతి వ్యక్తి ధర్మాన్ని రక్షించాలి. ప్రతి పనినీ ధర్మబద్ధంగా చేయాలి. ధర్మాచరణను కొనసాగించాలి. ‘్ధర్మో రక్షతి రక్షితః’. ధర్మాన్ని ఎవరు రక్షిస్తాడో, అట్టి వ్యక్తిని ధర్మమే కాపాడుతుంది. ‘్ధర్మ ఏవ హతో హన్తి’ ధర్మానికి హాని చేసేవాడిని ధర్మమే హతమారుస్తుంది.
మానవ మనుగడ, జీవనము ధర్మాచరణపైనే ఆధారపడి ఉన్నవి. అందరూ ధర్మాచరణ కొనసాగించాలి. అధర్మానికి, ఆ భావానికి దూరంగా ఉండాలి. పురాణాల ప్రకారం ధర్మాన్ని ఆచరించటంవల్ల కోల్పోయిన రాజ్యాలను పొందిన మహారాజులెందరో వున్నారు. వారి చరిత్రలు ఎంతో అమోఘమైనవి.
ఈ లోకాన్ని సృష్టించినది త్రిమూర్తులు. వారు చతుఃషష్ఠి కళలను, అనేక విద్యలను సృజించారు. లోకంలో ప్రతి ప్రాణి ఏదో కళ కలిగివుంటుంది. వాస్తవికతను కళాత్మకంగా ప్రతిబింబించేదే కళ. ఆ కళలతోపాటు పురుషార్థాలు కూడా ఏర్పాటు అయినాయి. ధర్మాన్ని పాటించేవారు పురుషార్థాలలో రెండవదైన అర్థాన్ని, దానితో బాటు సుఖ సంతోషాలను పొందుతారు.
ధర్మానికి మూలపురుషుడు పరమాత్మ. ఆ ధర్మంవల్లనే మానసిక ప్రశాంతి లభిస్తుంది. అధర్మంవలన బాధ, దుఃఖం కల్గుతాయి. కొలిమిద్వారా పుట్టిన వేడివల్ల ఇనుము వేడెక్కుతుంది. బంగారం శుద్ధి చెందుతుంది. అట్లే ధర్మాచరణ వ్యక్తిని, మనసును శుద్ధిపరుస్తుంది.
మానవ దేహానికి కొన్ని ధర్మాలున్నవి. ఆ ధర్మాలు వాటి లక్షణాలను కొనసాగిస్తాయి. శరీరం ఎట్టి అనారోగ్యత చెందకుండా పాటుపడతాయి. వాటివల్ల మానవుడు సహనం, శాంతి వహించటానికి కూడా అవకాశం కల్గుతుంది.
ఇంద్రియ నిగ్రహం, చక్కటి ఆలోచన, సరియైన వాచాలత ధర్మాచరణకు ఎంతో ఉపకరిస్తాయి.
ప్రతి మానవుడు త్రికరణశుద్ధిగా ధర్మాన్ని ఆచరించాలి. శాస్త్ర ధర్మాలను గౌరవించాలి. అపుడు మానవ అభ్యుదయం ధర్మమార్గంలో పయనించగలదు.
ముఖ్యంగా మానవులు మనుష్యుల్లాగే ప్రవర్తించాలి. అంటే వారిలో మానవత్వం ఉండి తీరాలి. ఎదుటివారు కష్టపడుతుంటే వీరు మాత్రం సుఖాలను అనుభవించకూడదు. ఒకవేళ ఎదుటివారికి సాయం చేయలేని స్థితిలో ఉంటే సాయం చేసే వారి చిరునామ అయనా చూపిం చాలి. పక్కవాడిది దోచేసి మనం తృప్తిగా ఉన్నాం. నలుగురిలో గొప్పగా ఉన్నాం. మనలను ఎవరైనా వేలెత్తి చూపడానికి భయపడుతారు. అనుకొంట అది మూర్ఖత్వం. అధర్మమే. ఎవరూ వేలెత్తి చూపకుండా ఉండేలా చేసుకోవాలి గాని అధర్మం చేస్తూ ఇతరులను భయపెట్టకూడదు. ఎంత సంపాదించినా పైకి తీసుకొని పోయేట పుడు కేవలం పాపపుణ్యాలే కాని మణి మాణిక్యాలు కావు. మన తర్వాత ఉన్నవాళ్లు మనం సంపాదిం చిది తింటారో తినరో వారికే విధంగా విధి రాసి ఉందో తెలియదు. కనుక ధర్మ మార్గంలో సంపాదించాలి. వారికి భగవంతుడే విధంగా తినేప్రాప్తిని రాసిపెట్టాడో వారు అలానే ఉంటారు. కనుక ధర్మాన్ని ఎప్పుడూ వదలకూడదు.

-నిమ్మగడ్డ కాశీ విశే్వశ్వర శర్మ