మెయిన్ ఫీచర్

అప్రమత్తత అవసరమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య పిల్లలు చదువులో కాస్త వెనుకబడి ఉన్నా, ఎవరన్నా వారిని మందలించినా, వారిని తోటి పిల్లలతో ఉన్నప్పుడు వారిని కోప్పడినా సరే వారిలో ఆత్మనూన్యత పెరుగుతుంది. వారి ఆలోచన్లు ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయ. వారు ఎవరితో మాట్లాడకుండా ఉంటే వారు ఆత్మహత్యాయత్నం చేస్తున్నారేమో అని అనుమానపడాలి. వారిని ఆ ప్రయత్నాల వైపు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత అటు తల్లిదండ్రుల మీద, ఉపాధ్యాయుల మీద ఉంది. పిల్లలు ఒకవేళ ఇలా ఉంటే వారి పట్ల అప్రమత్తత అవసరమే.
* ఎప్పుడు దిగులుగా, ముభావంగా వుంటారు.
* కుటుంబ సభ్యులు, స్నేహితులకు దూరంగా వుండేందుకు ప్రయత్నిస్తుంటారు.
* ఒంటరిగా వుండేందుకు ప్రయత్నిస్తుంటారు.
* నిద్ర, ఆహారం, వ్యవహారాలలో అంత ఆసక్తిని చూపివ్వరు.
* ఆతృత, వ్యాకులత వారిలో కొట్టచ్చినట్టు కనిపిస్తుంటుంది.
* ఏ విషయంలో నైనా అతిగా ఉద్వేగాలను ప్రదర్శిస్తూంటారు.
* అప్పుడప్పుడు చావులు, ఆత్మహత్యలు గూర్చి మాట్లాడుతుంటారు.
* ఎవరైనా వారిని కాస్త కోప్పడినా సరే ‘నేను చస్తే పీడ వదులుతుంది’ లాంటి మాటలు నిష్ఠూరంగా మాట్లాడుతుంటారు.
* కొంతమంది డైరీలు, పుస్తకాల్లో వారు ఎంత బాధపడుతున్నారో వారిని ఎవరెవరు బాధలకు గురి చేస్తున్నారో కూడా రాసుకుంటూ ఉంటారు.ఈ డైరీలను కూడా చూస్తుండాలి.
* ఆత్మహత్యలు ఎట్లా చేసుకోవచ్చో అని కూడా ఆరాలు తీస్తుంటారు. పైగా ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారని తెలియగానే ఏవిధంగా చేసుకొన్నారో అని అడుగుతుంటారు. అందుకే వీరిని ఓకంట కనిపెట్టుకుని ఉండాలి. వారు ఒకవేళ తప్పు చేసినా మెల్లగా వారు నొచ్చుకోకుండా చెప్పాలి కాని గట్టిగా వారి మనసు బాధపడేట్టుగా చేయకూడదు.
ఇలా ఉన్నట్టు మీకేదైనా అనుమానం వస్తే వారిని దగ్గరకు పిలిచి వారిలో ఆత్మవిశ్వాసం కలిగేలా వారికి మంచి మాటలు చెప్పాలి. అపుడే వారిలో ఆత్మవిశ్వాసం పెరిగి మనం జీవించగలం. సమస్యలు ఎదుర్కోగలం అన్న స్పృహ కలుగుతుంది. కనుక ఈ జాగ్రత్తలు తప్పనిసరి.

-చివుకుల