మెయిన్ ఫీచర్

స్నేహమాధుర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నీవు నాకిపుడు మంచి స్నేహితుడివి. నేటి నుండి మనము కష్టసుఖాలను సరిసమానంగా పంచుకొందాము’ అంటూ శ్రీరామచంద్రమూర్తి, సుగ్రీవుడూ హనుమంతుడూ లక్ష్మణుడూ చూస్తూ వుండగా ప్రతిజ్ఞగావించారు. రాముడూ సుగ్రీవుడూ అగ్ని చుట్టూనూ ముమ్మారు ప్రదక్షిణం చేసి కలకాలము స్నేహితులుగా వుంటామని, ఒకరికొకరు చేతులను తమ చేతుల్లోకి తీసుకుని కౌగలించుకున్నారు. సుగ్రీవుడు- ఈ స్నేహం తర్వాత తాను నిర్భయంగా జీవిస్తాను, నేటి నుండి ప్రశాంతంగా నిద్రపోతానని- అనుకున్నాడు.
రాముడు- తనకొక ఆప్తమిత్రుడు లభించాడనుకుంటాడు. ‘సుగ్రీవా! మిత్రమా! నీవొక మంచి స్నేహితుడవు. నేను విచారంలో వున్నప్పుడు నాకు ఊరట కలిగించావు. నీ మాటలూ, అభిమానం చేత చాలావరకూ నేను పోగొట్టుకున్న మనశ్శాంతిని పొందగలిగాను. కష్టకాలములో వున్నప్పుడు మంచి స్నేహితుడు దొరకడం చాలా అరుదు’ అనడం గమనార్హం.
ఇక రాముడూ, ‘నీవు కోరిన దానిని నేను నెరవేర్చి నిన్ను సంతోష పెట్టెదను’ అని వాగ్ధానం చేయగానే సుగ్రీవుడికి అమిత ఉత్సాహం కలిగింది. ఇంతకాలము బాధతో సతమతమవుతున్న సుగ్రీవునికి ఒక ఆపద్భాంధవుడు లభించినట్లయింది. ఇక్కడ వారు అనుకున్న స్నేహభావాలను మనమూ ఒక్కసారి చూద్దాం.
సుగ్రీవుడు రాముని విచారించకుండా, నిరాశా నిస్పృహలకు తావివ్వకుండా ప్రసన్నతను తిరిగి పొందమంటాడు. విచారంగా వున్నప్పుడు, తాను నేర్చినదియు పాటించునదియు మరచుట అసహజము కాదు. సంతృప్తి చెందిన మానవుడు ఎంత క్లిష్ట పరిస్థితుల్లో వున్నా కూడా, సంపదను కోల్పోయినా, లేక ప్రాణానికి ముప్పు ఏర్పడినా విచారమునకు తావివ్వడు. విధి వ్రాతలకు తబ్బిబ్బు చెందక ప్రశాంతంగా వుండును.
అధైర్యవంతులే విచారానికి లొంగిపోతారు. విచారాన్ని విడిచిపెట్టకపోతే అది సహజ స్వభావాన్ని కబళించి, మనశ్శాంతిని పోగొడుతుంది. ఇది నిజంగా దారుణమైన పరిస్థితి. విపరీతమైన విచారంవలన జీవితంపై విసుగు కలుగుతుంది అంటూ సుగ్రీవుడు తాను ఆ విధంగా మాట్లాడటానికి సాహసించాను అంటాడు. ఇక్కడే స్నేహం గురించి మరికొన్నివిశేషాలు మనకు రామాయణంలో దొరుకుతాయి.
రామునికి గుహునితో స్నేహం భరతుడిని గుహుడు తప్పుగా అర్థం చేసుకునేట్టు చేసింది. కాని గుహుడు వెంటనే భరతా నీవుకూడా రామునిలాగా ఉన్నావా లేదా అని సంశయంచాను. నీకు మీ లక్షణాలు వచ్చాయేమో అంటాడు. అంటే రాముని మీద స్నేహవాత్సల్యం భరతుని అనుమానించేట్టు చేసిందన్నమాట.
అట్లానే రావణునికి తన సోదరుడు మంచి మాటలు చెబితే ఇదంతా నీకిష్టమైన రామునితో కలవడం వల్ల చెబుతున్నావు. శత్రువులతో చేతులుకలిపావు అని అభాండాలు వేస్తాడు. అట్లా మాటాడిన తరువాత విభీషణుడు రామునిదగ్గర ఆశ్రయం కోరి వెళ్లాడు. స్నేహహస్తం కోసం తపించాడు. రాముడు అభయం ఇచ్చాడు. తన సోదరునివలె నిన్ను చూస్తానని మాటిచ్చాడు. వారిమధ్య స్నేహసంబంధం భాతృప్రేమగా మారింది.
ఒక్కసారి ఇద్దరి మధ్యా స్నేహం ఏర్పడితే, ఒకరిపై నొకరికి ప్రేమభావం తప్ప ఇతర భావాలన్నీ అదృశ్యమవుతాయి. స్నేహితుడు ధనికుడా లేక పేదవాడా సంతృప్తిపరుడా లేక అసంతృప్తిపరుడా అనే వాటికి ప్రాముఖ్యం వుండదు. మిత్రత్వానికి ఈ గుణములు అడ్డుగా నుండరాదు. స్నేహితుని కొరకు తన సర్వస్వాన్నీ, సంపద భోగభాగ్యాలనూ, చివరకు ప్రాణమైనా సమర్పించడానికి సిద్ధంగా వుండాలి.
ఈ విధమైన స్నేహం గురించిన లక్షణాలను పలు సందర్భాల్లో రామాయణ భారత భాగవతాల్లో ప్రస్తావించడం మనకు కనిపిస్తుంది. భాగవతంలో మనం కృష్ణకుచేలుల మైత్రి గురించి చెప్పుకోవాల్సి వుంది.
కృష్ణుడు కుచేలుడూ చిన్నప్పుడు ఒకే గురువువద్ద విద్యాభ్యాసం గావించారు. భౌతికంగా ఆ తర్వాత దూరమయ్యారు. ఒకరు సర్వసౌభాగ్యాలతో తులతూగుతూ వుంటే మరొకరు ఆగర్భ దరిద్రంతో బాధపడ్డారు. అయినా వారిమధ్య చిన్ననాటి స్నేహం, అనుబంధం అలాగే వుండిపోయింది. అందుకే పరమాత్మ తన స్నేహితుడు అటుకులు తెచ్చినా ఆనందంగా ఆస్వాదించాడు. కుచేలుడు కోరకపోయినా అన్నీ ఇచ్చాడు. సామాన్యంగా భగవంతుడు మనం ఏది కోరితే అదే ఇస్తాడు. కానీ అడక్కపోతే, ఆయనకు అన్నీ తెల్సునుకావున అన్నీ ఇస్తాడు, కుచేలుడికి ఇచ్చినట్లుగానే.
భారతంలో కూడా మనం దుర్యోధన కర్ణ మైత్రిని గొప్పగా చెప్పకోవాల్సి వుంటుంది. కృష్ణపరమాత్మ కర్ణుడికి తన జన్మ రహస్యాన్ని గర్తుచేస్తూ పాండవులకు పెద్దన్నగానూ, ద్రౌపదికి మరో భర్తగానూ రావల్సిందని చెప్పినా, తననే నమ్ముకున్న తన స్నేహితుడు దుర్యోధనుని వీడి రానన్నాడు. మహాభారత యుద్ధంలో వీరమరణం పొందాడు. ఇక్కడే మనం ద్రోణ ద్రుపదుల స్నేహాన్ని కూడా ప్రస్తావించుకోవల్సివుంది. ఒకరినొకరు అవమానించుకోగా, ప్రతీ కారాలతో ప్రాణాలు తీసుకునేవరకూ వెళ్ళాయి. స్నేహితుని అవమానించరాదన్న విషయం మనకు ఇక్కడ గోచరిస్తుంది.
రామాయణంలో స్నేహం వివిధ జాతుల వారి మధ్యన చోటుచేసుకుంది. మానవుడు వానరుల మధ్యన స్నేహం ఏర్పడింది. దానవుడైన విభీషణుడితో కూడా రాముడు స్నేహాన్ని చివరివరకూ కొనసాగించాడు. వీరందరి మధ్యనున్న స్నేహాన్ని ఎంతో ఆదర్శవంతంగా విజ్ఞులైనవారు పేర్కొనడం కద్దు. స్నేహితులు లేనివారు సామాన్యంగా ఈ లోకంలో మనకు కనిపించరు. స్నేహితుడనేవాడు కేవలం సంతోషాన్ని పంచుకోడానికే గాక, కష్టాల్లో నేనున్నానంటూ ఆదుకోవాలి. అప్పుడే స్నేహమాధుర్యం తీయగా వుంటుంది.

- డా.పులిపర్తి కృష్ణమూర్తి