మెయిన్ ఫీచర్

ఇద్దరమ్మాయలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్ష్యం: ఇరవై మూడు దేశాలు.. గడువు: వంద రోజులు
వాహనం: ఓ చిన్న విమానం.. చోదకులు: ఇద్దరమ్మాయిలు
ఇదేంటి ఇవన్నీ సినిమా టైటిల్స్‌లా ఉన్నాయని అనుకుంటున్నారు కదూ.. ఇది కూడా అలాంటిదేనండీ.. ఆరోహి పండిట్, కీథియర్ మిస్కిటా అనే ఇద్దరమ్మాయిలు ఆకాశంలో పక్షుల్లా, హాయిగా ఎగరడానికి ఉబలాటపడుతున్నారు. అందులోనే వారు సంతోషాన్ని వెతుక్కున్నారు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ పక్షుల్లా ఎగరడంతో పాటు, వీరిద్దరికీ ప్రపంచాన్ని చుట్టేయాలనే కోరిక కలిగింది. అనుకున్నదే తడవుగా వీళ్లిద్దరూ ‘మాహి’ అనే చిన్న స్పోర్ట్స్ ప్లేన్‌లో ప్రపంచాన్ని చుట్టేయడానికి బయల్దేరారు. అదీ కేవలం వందరోజుల్లోనే.. ‘మాహి’ అంటే అందరూ మన క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని పేరు పెట్టారని అనుకుంటున్నారు. కానీ ‘మాహి’ అంటే ‘్భమి’ అని, అందుకే ఆ పేరు పెట్టామని చెబుతున్నారు ఈ మిషన్ డైరెక్టర్ దేవకన్య ధార్. అంతేకాదండోయ్.. ఈ ‘మాహి’కి చాలా ప్రత్యేకతలున్నాయి. మనదేశంలో రిజిస్టర్ అయిన తొలి లైట్ వెయిట్ స్పోర్ట్స్ విమానం ఇదే..
దీని ఇంజిన్ మారుతి బలెనో కారు ఇంజిన్ అంత శక్తివంతమైనది. ఇది రెండు వందలా పదిహేను కిలోమీటర్ల వేగంతో గాల్లో ప్రయాణం చేస్తుంది. ఈ విమానం ఇంధన కెపాసిటీ కేవలం అరవై లీటర్లు మాత్రమే.. దీనిద్వారా వారిద్దరూ ఆగకుండా నాలుగున్నర గంటలు ప్రయాణం చేయవచ్చు. దీని కాక్‌పిట్ వైశాల్యం చాలా తక్కువగా.. అంటే కేవలం ఓ ఆటో సీటంత మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇందులో ఇద్దరు మాత్రమే కూర్చోగలుగుతారు. అందుకని ఎక్కువసేపు ఇందులో కూర్చుని ప్రయాణించడం చాలా కష్టం. అయితే ఈ విమానంలో అనుకోని దుర్ఘటన ఎదురైనప్పుడు ప్యారాచూట్ల సహాయంతో కిందకు దూకే సౌకర్యం కూడా ఉంది.
ఇలాంటి ఫీచర్లున్న ఈ విమానంలో..
‘సాహసమే చేయరా డింభకా.. అన్నది కదరా పాతాళ భైరవి..’ అని పాడుకుంటూ పంజాబ్‌లోని పటియాలా ఎయిర్ బేస్ నుంచి గత ఆదివారం వీళ్లు తమ సాహస ప్రయాణాన్ని మొదలుపెట్టారు.
ఈ ప్రయాణంలో వీళ్లిద్దరూ ఎక్కడ ఉండాలి? విమానాన్ని ఎక్కడ పార్క్ చేయాలి? వినువీధుల్లో వీరిద్దరూ ఏ మార్గంలో ప్రయాణించాలి? వంటి విషయాలను గ్రౌండ్ స్ట్ఫా నిర్ణయిస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్లిద్దరి ప్రయాణాన్ని గైడ్ చేసేది, గ్రౌండ్ స్ట్ఫా.. అందరూ మహిళలే.. అంతా సవ్యంగా జరిగితే భారతదేశం నుంచి చిన్న విమానంలో ప్రపంచాన్ని చుట్టిన తొలి మహిళలుగా వీళ్లిద్దరి పేర్లు చరిత్రలో నిలిచిపోతాయి.
ఆరోహి, కీథియర్‌లు మనదేశంలోనే లైట్‌స్పోర్ట్స్ ఎయిర్‌క్రాఫ్ట్ లైసెన్స్‌ను పొందిన మొదటి వ్యక్తులు. వీరిద్దరూ ముంబై ఫ్లయింగ్ క్లబ్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఏవియేషన్ డిగ్రీని పూర్తిచేశారు. ఆరోహి బాల్యంలో ఒకసారి ఓ మహిళా పైలెట్ ఉన్న విమానంలో ప్రయాణం చేసిందట. అప్పటి నుంచి భవిష్యత్తులో తానూ కూడా పైలెట్ కావాలని నిర్ణయించుకుందట. ఆ కల నెరవేరడంతో పాటు సాహసవంతమైన ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టింది ఆరోహి. ఈ సాహసంలో మరో భాగమైన యువతి కీథియర్. ఇంట్లో నలుగురు అక్కచెల్లెళ్లలో కీథియర్ పెద్దది. అలాగే వారి కుటుంబంలో మొదటి పైలెట్ ట్రైనింగ్ చేసింది కూడా కీథియరే. అలా వీరిద్దరూ సాహసయాత్రను మొదలుపెట్టారు.
ఆరోహి, కీథియర్‌లు వందరోజులు మూడు ఖండాల్లోని ఇరవై మూడు దేశాలను చుట్టేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పటియాలా నుంచి వీరు తమ ప్రయాణాన్ని మొదలుపెట్టి ఆగ్నేయాసియా మీదుగా జపాన్, రష్యా, కెనడా, అమెరికా, గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, యూరప్‌లను చుట్టివస్తారు. ఈ యాత్రకు వాళ్లు మిషన్ ‘డబ్ల్యూఈ’ అని పేరు పెట్టారు. అంటే ‘విమెన్ ఎంపవర్‌మెంట్ (మహిళా సాధికారత)’ అని అర్థం. ‘బేటీ బచావో.. బేటీ పడావో..’ అన్న పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఈ మిషన్‌కు సహాయం చేస్తోంది. మహిళల స్వేచ్ఛను, సాధికారతను ప్రకటించడానికి ఇంతకంటే మంచి మార్గం ఉండదేమో.. అని ప్రోగ్రాం డైరెక్టర్ దేవకన్య అంటున్నారు. వాళ్లు వెళ్లిన ప్రతి దేశంలో ‘అమ్మాయిలను రక్షించాలి, అమ్మాయిలను చదివించాలి’ అనే సందేశాన్ని వినిపిస్తారని కూడా ఆమె చెప్పారు. ఈ యాత్ర నేపథ్యంలో క్రౌడ్ ఫండింగ్ ద్వారా డబ్బును సేకరించి దాన్ని పేద యువతుల వైమానిక శిక్షణకు ఉపయోగిస్తామని దేవకన్య చెబుతున్నారు. ఏది ఏమైనా మీరిద్దరూ ప్రపంచాన్ని ఆనందంగా చుట్టిరావాలి. ఆల్ ది బెస్ట్ ఇద్దరమ్మాయిలూ...

- మహేశ్వరి