ఎడిట్ పేజీ

ఉగ్రవాదానికి విపక్షాల ఊతం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతంలో తిరుమల సమీపంలోని అలిపిరి వద్ద తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్రవాదులు హత్యాప్రయత్నం చేశారు. అయితే, ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఇటీవల అదే తిరుమలలో భాజపా అధ్యక్షుడు అమిత్‌షా స్వామివారిని దర్శించుకొని తిరిగి వస్తుండగా అతని కాన్వాయ్‌పై తెదేపా అభిమానులు దాడి చేశారు. దీంతో చంద్రబాబు చరిత్ర నుండి గుణపాఠాలు నేర్చుకోలేదన్న వ్యాఖ్యలు వినిపించాయి. గోవా సీఎం మనోహర్ పారీకర్ ఎలాంటి భేషజాలకు పోకుండా జనంతో మమేకమై తిరిగే సామాజిక కార్యకర్త. సీఎం కాకముందు ఆయన దేశ రక్షణమంత్రిగా సేవలందించారు. ఇటీవల భీం కోడెగామ్ కేసు సందర్భంగా పోలీసులకు చిక్కిన ఉగ్రవాదుల ల్యాప్‌టాప్‌లో లభించిన లేఖలో పారీకర్ పేరు కూడా ఉంది. ‘్భరతమాతాకీ జై’ అని అంటున్నందునే ఆయన పేరు ఉగ్రవాదుల ‘హిట్‌లిస్ట్’లో చేరింది.
చాలాకాలంగా ఉగ్రవాదం వివిధ రూపాల్లో విశ్వవ్యాప్తంగా విస్తరించింది. ఉగ్రవాదుల, తీవ్రవాదుల, వేర్పాటువాదుల హింసోన్మాదానికి పలు దేశాల్లో జాతి నేతలు ప్రాణాలు కోల్పోయారు. మన దేశంలో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు తీవ్రవాదుల కిరాతకానికి బలయ్యారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీని ఉగ్రవాదులు ‘టార్గెట్’గా చేసుకోగా- విపక్షాల నాయకులు ఇందులో స్వార్థకోణాలను అనే్వషిస్తున్నారు. కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం చిరునవ్వులు చిందిస్తున్నాడు. ఇతడు అనేక ఆర్థిక నేరాల్లో ముద్దాయి. సీపీఎం నాయకురాలు బృందా కారత్ బహిరంగంగానే ఉగ్రవాదులను సమర్ధిస్తున్నది. మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్- ఉగ్రవాదుల కుట్రకు సంబంధించిన లేఖ నమ్మదగినది కాదన్నాడు. దీన్నిబట్టి చూస్తే మన నాయకుల్లో జాతీయవాదం, ఐక్యత లేదని అనిపిస్తుంది.
ఆరువందల సంవత్సరాల పాటు అరబ్బులు, ఆ తర్వాత వ్యాపారానికి వచ్చిన ఈస్టిండియా కంపెనీతో ఫ్రెంచి వారు, పోర్చుగీసు వారు ఇప్పుడు ఇటలీకి చెందిన క్రైస్తవ పెద్దలు దేశాన్ని తమ అధీనంలో ఉంచుకునేందుకు యత్నిస్తున్నారు.
మోదీపై ఇప్పటికి ఐదుసార్లు హత్యాప్రయత్నాలు జరిగాయి. ఇంతకూ ఆయన చేసిన పాపం ఏమిటి? భార్యాబిడ్డలు లేకుండా సన్యాస జీవితం గడుపుతూ దేశం కోసం సేవచేయడం నేరమా? మోదీ జనాకర్షణను చూసి చైనా, పాకిస్తానీయులు సహించలేకపోతున్నారు. మసూద్ సోదరునికి చెందిన పదకొండు మంది ఉగ్రవాదుల ముఠా కరాచీ పోర్టు నుండి చిట్టగాంగ్ మీదుగా ఇండియాలోకి ప్రవేశించింది. జిహాదీ ఉగ్రవాదులు, మావోయిస్టులకు పొరుగు దేశాలతో పాటు మన దేశంలోని మతసంస్థలు, కొన్ని రాజకీయ పార్టీలు సహకరిస్తున్నాయి.
దేశంలోని 16 రాష్ట్రాల్లో అల్లకల్లోలం సృష్టించాలని ఉగ్రవాదులు వ్యూహం పన్నారని పోలీసులు స్వాధీనం చేసుకున్న లేఖల ద్వారా వెల్లడైంది. జమ్మూ కశ్మీర్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, బిహార్, బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాలతోబాటు మరికొన్ని భాజపా పాలిత రాష్ట్రాల్లో విధ్వంసాన్ని సృష్టించాలన్నది ఉగ్రవాదుల పథకం.
కొన్నాళ్ల క్రితం హైదరాబాదులోని గోషామహల్ ప్రాంతానికి చెందిన ఒక పెళ్లిబృందం సంభాషణ పోలీసులకు అందింది. ఈ సంభాషణ దుబాయి నుండి జరిగింది.
‘పెళ్లికి ముహూర్తం కుదిరిందా?’’
‘‘కుదిరింది.. ఏప్రిల్ 18 రాత్రి’’
‘‘పెళ్లికొడుకు ఎప్పుడు వస్తున్నాడు?’’
‘‘బంధువులతో దుబాయి నుండి వచ్చి బారాత్‌లో పాల్గొంటాడు.’’
‘‘కట్నం ఎంత?’’
‘‘నిర్ణయమైన మొత్తం ముట్టింది.’’
ఈ సంభాషణను పోలీసులు ‘డీకోడ్’ చేస్తే తెలిసిన సమాచారం ఏమిటంటే ఉగ్రవాదులు దుబాయి నుండి వచ్చి నిర్ణీత ముహూర్తంలో విధ్వంసం సృష్టిస్తున్నారని. కట్నం అంటే పారితోషికం హవాలా మార్గంలో వారికి అందింది. ఇప్పుడు మన దేశానికి మాత్రమేకాక శ్రీలంక, ఫిలిప్పీన్స్, సిరియా, ఆప్ఘనిస్థాన్ వంటి పలు దేశాలకు సైతం ఉగ్రవాదం ముప్పు పొంచి ఉన్నట్లు తేలింది. చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చివేయాలని ఈ ముఠాలు ప్రయత్నిస్తున్నాయి. ఫ్రాన్స్‌లో ఆమధ్య వందలాది మందిపై ట్రక్కును నడిపి బీభత్సం సృష్టించిన సన్నివేశం ఈ అంతర్జాతీయ కుట్రలో ఒక భాగం.
ఈమధ్య కేంద్ర హోం శాఖ నిర్వహించిన సమావేశంలో ఆ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజత్ దోవల్, హోం సెక్రటరీ రాజీవ్ గౌబా, ఐబి డైరెక్టర్ రాజీవ్ జైన్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానికి రక్షణవ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నట్లు వీరు వెల్లడించారు. మరి 130 కోట్ల మంది భారతీయుల భద్రత మాటేమిటి? గత 70 ఏళ్లుగా ‘ఖద్దరు మాఫియా’ దేశద్రోహాన్ని పెంచి పోషించింది. ఇందిర, రాజీవ్ సహా ఇంకొందరు పార్టీ నేతలు ఉగ్రవాదం కాటుకు బలైపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి బుద్ధిరాలేదు. దేశద్రోహులకు ఏదో ఒక రూపంలో సహాయం లభిస్తోంది.
సినిమా వంటి కళారంగాల్లోనూ ఉగ్రవాదులు చొరబడిపోయారు. హిందీ సినిమాల రూపకల్పనకు ఆరబ్ దేశాల నుంచి హవాలా ముఠాలు ధన సహాయం చేస్తున్నాయి. మాఫియాలు సినీ పరిశ్రమలో భారీగా పెట్టుబడులు పెడుతున్నా ప్రభుత్వాలు ఏ చర్యలూ తీసుకోవడం లేదు.
ప్రస్తుత పరిణామాల పట్ల బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వంటి విపక్ష నేతలు ఏ మాత్రం విచారం వ్యక్తం చేయడం లేదు. ఆమె బెంగాల్‌లో హత్యా రాజకీయాలకు పర్యాయ పదంగా మారింది. కమ్యూనిస్టుల రక్తసిక్త రాజకీయాలను సహించలేక బెంగాల్ ప్రజలు ఈమెకు పట్టం కడితే హింస మాత్రం తగ్గుముఖం పట్టలేదు. భాజపా కార్యకర్తలను దారుణంగా హత్య చేస్తున్నా మమత నోరు విప్పడం లేదు. మోదీని అధికారంలో నుంచి దింపడమే లక్ష్యంగా ఆమె కాంగ్రెస్, వామపక్షాలతో చేయి కలిపేందుకు వెనుకంజ వేయడం లేదు.
1947లో భారతదేశంలో అనేక సంస్థానాలు విలీనమయ్యాయి. రాజా హరిసింగ్ కూడా మిగతా సంస్థానాల వలే కశ్మీరును కూడా ఇండియన్ యూనియన్‌లో విలీనం చేశాడు. ఐనా కశ్మీరులో నేటికీ పాకిస్తాన్ వేర్పాటు వాదాన్ని పోషిస్తున్నది. కశ్మీర్‌లో భారత ప్రభుత్వం బంగారంతో రోడ్లు నిర్మించినా, తాము బీభత్సం సృష్టిస్తామని పాక్ ప్రేరిత ఉగ్రవాద సంస్థ నేతలు స్పష్టం చేస్తున్నారు. హురియత్, జైషే మహమ్మద్, సిమీ, ఐఎస్‌ఐ, లష్కరే-ఎ-తోయిబా- ముస్లిం లీగ్ వంటి దాదాపు నలభై తీవ్రవాద సంస్థలు భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. వారి లక్ష్యం భారత్‌ను ఇస్లామిక్ రిపబ్లిక్‌గా మార్చటం. ఈ సంగతి కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా తెలుసు. మావోలు, మతోన్మాద ఉగ్రవాదులు, క్రైస్తవ మతపెద్దలు కలసి మోదీ వ్యతిరేక ఉద్యమానికి ఆజ్యం పోస్తున్నారు. మోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు వల్ల ఉగ్రవాదులకు ఆర్థికంగా ఇబ్బంది కలిగింది. డంప్‌ల్లో వారు దాచిన పెద్దనోట్లు వ్యర్థమైపోయాయి. అందుకని కాంగ్రెస్ పార్టీ జిగ్నేశ్‌మెమన్ వంటి ఆయుధాల వ్యాపారుల ద్వారా మతోన్మాదులకు నిధులను అందజేస్తున్నది.
ఛత్తీస్‌గఢ్‌లో సల్వా జుడుం కార్యకర్తలు, నాయకులు తీవ్రవాదుల దుశ్చర్యలకు హతులైనారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కేంద్ర మంత్రి వీసీ శుక్లా వంటి నేతలు ప్రాణాలు కోల్పోయారు. ఐనాసరే కాంగ్రెసు మావోయిస్టులకు ఆర్థిక సాయం చేస్తున్నట్లు రానావిల్సన్ లేఖ సాక్ష్యమిస్తున్నది. ఒక్క ఛత్తీస్‌గఢ్‌లోనే భద్రతాదళాలకు చెందిన సైనికులు ఇప్పటివరకు వెయ్యి మంది చనిపోయి ఉంటారు. వారికి భార్యాబిడ్డలు లేరా? మానవ హక్కుల సంఘాల వారు ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోరు? ‘్భరతమాతాకీ జై’అనే వారికి మానవ హక్కులు ఉండవు. చైనా, పాకిస్తాన్ ప్రేరేపించే ఉగ్రవాదులకు, తీవ్రవాదులకు మాత్రమే పౌర హక్కులు ఉంటాయి. ఈ విషయాలను వామపక్ష నేతలు, సెక్యులర్ నాయకులు ఎందుకు ప్రశ్నించరు? మానవ హక్కుల గురించి మాట్లాడే కవులు, రచయితలు, కళాకారులు ఎందుకు నిరసన గళం విప్పరు?
జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (న్యూఢిల్లీ)లోని అధ్యాపక బృం దంలో పెద్దసంఖ్యలో ఉగ్రవాద సానుభూతిపరులున్నారు. విద్యార్థి సంఘం నాయకుడు కన్నయ్య కుమార్ ఊరేగింపు జరిపినప్పుడు కశ్మీరు ఉగ్రవాదులు ఢిల్లీకి వచ్చారు. వారిని ఈ అధ్యాపకులు తమ క్వార్టర్స్‌లో దాచిపెట్టి పోలీసులకు అందకుండా చూశారు. కన్నయ్య కుమార్‌ను హైదరాబాదు సుందరయ్య విజ్ఞానకేంద్రంలో టి.మాస్ సన్మానం చేస్తే విజయవాడలో ఎ-మాస్ సత్కరించింది. ఈ సన్మాన సభల్లో వామపక్ష నేతలు దేశ సమగ్రతకు భంగం కలిగేలా ప్రసంగాలు చేశారు. కాగా, ఓ క్రైస్తవ మత ప్రచారకుడు హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దసరా సందర్భంగా మహిషాసుర జయంతిని, దీవావళికి నరకాసుర జయంతిని జరిపించాడు. వీటన్నింటి సారాంశం ఒకటే. దేశంలోని వివిధ విద్యాసంస్థలు, సాహిత్య, సాంస్కృతిక కళారంగాలను ప్రణాళికాబద్ధంగా ఉగ్రవాదులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రయత్నాలను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాని ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు కాని నిరోధించలేకపోయాయి. ఇటీవల కేరళలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే ఉగ్రవాద సంస్థ విజృంభించింది. ఇది ‘ఐసిస్’ లాంటిది. ఈ సంస్థ సభ్యులను లోగడ స్థానిక రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం పెంచి పోషించారు. ఇప్పుడు వీరు సీపీఎం కార్యకర్తలను కూడా చంపుతున్నారు. ఇటీవల ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘ నాయకుడు అభిమన్యును హత్య చేశారు. పశ్చిమ బెంగాల్‌లో అధికార పార్టీ తృణముల్ కాంగ్రెస్ ప్రత్యర్థులను చంపటం మొదలుపెట్టింది. భాజపా కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని తృణమూల్ మూకలు బీభత్సం సృష్టిస్తున్నాయి.

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్