మెయిన్ ఫీచర్

కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలోచన, మాట, చేత ఈ మూడింటి సమాహారంగా చేయగలగడం ఒక్క మనిషికి మాత్రమే భగవంతుడిచ్చిన గొప్పవరం. ఈ త్రికరణాల్లో స్పష్టత, సత్యత, శుద్ధత లేకుండాపోతోందని అందరూ అనుకోవడం జరుగుతుంది. మరి అనుకుంటున్న వారిలో ‘త్రికరణశుద్ధి’ ఉందనుకోవచ్చా?
మనిషి మనసును ఆలోచనను పట్టించుకోకుండా నేను, నా మాట జరగాలనే వితండ భావనతో నడవడం జరుగుతోంది. ఎవరికివారే సర్వస్వతంత్రులుగా అనుకోవడం తన భావాలే సరియైనట్లుగా ఎదుట వారికే మీ విలువ యివ్వకుండా మాట్లాడటం ఎంతవరకు సబబు?
ప్రతీ మనిషి ఇదే విధంగా ఆలోచిస్తూ ప్రవర్తించుకుంటూ పోతే మనుషులు ప్రవర్తించే తీరుతెన్నులు కర్తవ్యాలు, ధర్మాలు ఇవన్నీ ఏమైపోవాలి.
మనిషి ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి అనేది వేదాల్లో, పురాణాల్లో, శాస్త్రాల్లో, వ్రాయబడి ఉన్నాయంటారు. అంతెందుకు భగవంతుడే విభవ రూపంలో ద్వాపరయుగంలో శ్రీకృష్ణపరమాత్మ ధర్మసంరక్షణ భారం బాధ్యత అంశాలన్నీ ఎంతో చక్కగా నిర్వర్తించి తెలియచేసారు.
అలాగే ముందు త్రేతాయుగంలో శ్రీరాముడిగా మనిషిగా అవతరించి మనిషి బాధ్యతలు, ధర్మాలు ఎటువంటి వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో తెలియచేసి ఉన్నారు.
కలియుగంలో రాజ్యాలు, రాజరికాలు అంతరించినా, ఇంకా ప్రతీ మనిషి రాజరికంగానే తనలోనే రజోగుణాన్ని ఎక్కువగా అదే తమ స్వభావముగా భావించుకొని దానినుండి పైకి రాలేకపోతున్నారు.
ఉదయం నిద్రలేచిన దగ్గరనుంచి మనిషి ఆర్థిక, సామాజిక కుటుంబ స్థాయిలు ఇవన్నీ బాగా ఉన్నప్పటికీ లేనప్పటికీ ఎటువంటి స్థాయిలో ఉన్న మనిషికి ముందు లేకున్నది తృప్తి. ఆరాటం ఏదో కావాలనో, పొందలేకపోయామనో చింతలో కాలం గడుస్తోంది.
మనిషి సైకిలుమీద ప్రయాణంచేసే వానికి మోటారు బళ్ళమీద ప్రయాణం, మోటారు బండి వానికి, కారు సౌఖ్యము దొరికినప్పుడు భగవంతుడు ఇచ్చిన అవకాశంగా భావించలేకపోవడం అదేదో తన కృషి భాగ్యంగా, అదృష్టంగా భావించడం, అహంకరించడం జరుగుతుంది.
ఇన్ని విధాలుగా ప్రతీ మనిషి కష్టాన్ని వాని కర్మఫలమే అయినప్పటికీ భగవంతుడు అనుక్షణం అందరి కష్టాల్లో వారికి ఏదో రూపంలో సహాయం తప్పక అందిస్తుంటారు. మనిషి ఈ విషయం గ్రహించలేకపోవడం జరుగుతుంది. సహాయం అయినా, సంతృప్తి అయినా తన వలనే జరుగుతుంది, అనుకోవడం ప్రధాన కారణం.
మనిషి ఎంతసేపు ఎంత సుఖవంతమైన జీవితం గడుపుతున్నా ఉద్యోగరీత్యా, లేదా గృహ కృత్యాల్లో లేదా సమాజంలో ఏ చిన్నపాటి పనులు రోజుమొత్తంలో చేయవలసి వచ్చినప్పుడు తను మాత్రమే ఎక్కువ కష్టపడిపోతూ తీరిక లేనట్లుగా ఇతరులు తీరుబాటిగా కబుర్లాడుతున్నట్లుగా భావించుకుంటూ ఇతరులు విశ్రాంతి పై విరుచుకుబడి ఆయాసపడిపోవడం మనిషి నిత్యకృత్యములో ఓ భాగమై పోతోంది.
ముఖ్యంగా మనిషి ఇతరులతో సరిపోల్చుకోవడం తేడాలున్నవి లేనివి, ఊహించుకోవడం బాధపడిపోవడం జరుగుతోంది.
కుటుంబ పరంగా, వ్యక్తిపరంగా ఎవరికి వారికి కొన్ని తప్పనిసరి పనులనేవి తాత్కాలికంగా, దీర్ఘకాలానివిగా ఉంటాయ. అంతెందుకు? మనిషి ఊపిరున్నంతవరకు తప్పనిసరిగా ఉంటూనే ఉంటాయి.
వీటికోసం ఎవరి పనులు ఎవరికి వారు పనిచేసుకోవాలి అని కృష్ణపరమాత్మే చెప్పారు.
‘పని’ నేనే చేయాలా? అని నేనే ఎందుకు చేయాలి? అని. లేదా నేను చేస్తూన్నాను, నేనే చేస్తున్నాను. అనే వివిధ భావనలేకుండా పనిచేసుకుంటూ పోవాలి. అదీ ఎలాగంటే ఎవరి శరీరంలోనైనా శ్వాసక్రియలు జరుగుతున్నంత సులభంగా మారుమాట లేకుండా ఎవరి కర్తవ్యాన్ని వారు చేసుకుంటూనే వెళ్లాలి.
ఏదైన అడ్డంకి వచ్చినపుడు కూడా ఏ ఫలితాన్ని ఆశించకుండా, నిష్కామంగా, నిర్విరామంగా భగవంతునికి సేవ చేస్తున్నామన్న భావనతో చేసే ప్రతి పనినీ భగవంతుడు మెచ్చుకుంటాడు. ఎవరో వూరికినే కూర్చు న్నారనో, లేదా వారు ఎక్కువ ఆనంద పడుతున్నారనో అస్తమానం అనుకో కూడదు. ఒకవేళ అలాంటి ఆలోచన వచ్చినా కూడా మరునిముషం అంతా భగవంతుని ఇచ్ఛ ప్రకారం ప్రతివారి జీవితం నడుస్తుంది అనుకొని మన పని మనం చేయాలి. అపుడే ఎవరికి ఇవ్వవలసిన ఫలితాలను వారికి భగవంతుడు ఇస్తాడు.

- శ్రీమతి గంటి కృష్ణకుమారి 9441567395