మెయిన్ ఫీచర్

పాపసంహారిణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిల్వపత్రంతో ఆ సదాశివుని పూజించితే మూడు జన్మల పాపం సంహారమవుతుందని శివపురాణం వచిస్తుంది.
బిల్వపత్ర నమస్తేస్తు శివపూజసాధన
మూలతో భవరూపాయ మధ్యతో మృడరూపిణే
అగ్రతః శివరూపాయ మధ్యతో మృడరూపిణే
స్కందే వేదాన్తరూపాయ తమరాజాయతే నమః
ఓ బిల్వ వృక్షమా నీకు నా నమస్కారం. నీవు వక్షరాజువు. నీవే శివపూజా సాధనం. నీవు మూలంలో భవరూపాన్ని, ఆది మద్యాంతరములందు ఈశ్వర రూపానివి. నీ దళాలు వేద స్వరూపాలు. నీ మ్రాను వేదాన్త స్వరూపం. వృక్షాల్లో రాజువైన నీకు నమస్కారం.
ఇంతటి మహిమాన్వితమైన బిల్వాన్ని శివునికి ప్రియంగా పెద్దలు చెబుతారు.లక్ష్మీదేవి తపోమహిమ వలన వృక్షములలోకెల్ల శ్రేష్ఠమైన బిల్వవృక్షము ఉద్భవించినదని శ్రీసూక్తమ్ వివరిస్తుంది. ఆ బిల్వ ఫలములు నా లోపలవున్న అజ్ఞానమును, బయటవున్న దారిద్య్రమును తొలగింప జేయుగాక అని ప్రార్థించటం చూస్తున్నాం.
ఆదిత్య వర్ణే తపసోధిజాతో వనస్పతి వృక్షోధ బిల్వః
తస్య ఫలాని తపసానుదన్తు మాయాన్త రాయాశ్చ బాహ్యాం అలక్ష్మీః
ఈ బిల్వ వృక్షానికి ఒక ప్రత్యేకత ఉంది. పుష్పాలు లేకుండానే ఫలాలు ఉద్భవిస్తాయి.
వామన పురాణంలో ఈ బిల్వము లక్ష్మీదేవి హస్తాలనుండి ఉద్భవించిదని చెప్పారు. అలాగే లక్ష్మీదేవి బిల్వారణ్యంలో తపస్సుగావించినదని కాళికా పురాణంలో చెబుతుంది. బిల్వ ఫలములు దారిద్య్రాన్నీ, దురదృష్టమునూ, బాధలనూ పోగొట్టునని కూడా వివరిస్తుంది. ప్రజల యొక్క అజ్ఞాన మూలకములైన దారిద్య్ర దుఃఖాదులను పరిహరించడానికై లక్ష్మీదేవి గావించిన తపశ్చర్యాదుల మూలంగా బిల్వ వక్షమూ, దాని ఫలాలూ ఉద్భవించాయని బ్రహ్మాండపురాణ ఉవాచ. మరొక చోట, సూర్య తేజస్సుతో, సమాన కాంతి కలిగిన లక్ష్మీదేవి బిల్వారణ్యం మధ్యమందు వసిస్తూ ఉన్నట్టు భావించి ధ్యానించినచో సర్వదుఃఖాలూ నశిస్తాయనిఅంటారు.
శ్రీమహావిష్ణువు, శివలింగాన్ని బిల్వదళములచే పూజించాడని మరొక గాథ వుంది. ఆ పూజకు ప్రసన్నుడైన శివుడు ఆయనకు సర్వజగత్తును పాలించే శక్తినిచ్చినట్టు వరాన్నిచ్చాడంటారు. బిల్వాన్ని ‘శ్రీవృక్షము’ అనీ పిలుస్తారు. బిల్వ దళానికి మూడు పత్రాలుంటాయి. ఈ మూడు పత్రాలను శివుని త్రినేత్రాలకు ప్రతీకలుగా భావిస్తారు. అవియే శివుని త్రిశూలాన్ని సూచిస్తాయని మరి కొందరంటారు. ఇంకొందరు అవి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, మూర్తిత్రయాన్ని సూచిస్తాయంటారు.
‘ఎవరికి ఎలాంటి కోర్కెలున్నా శంకరుని బిల్వదళములచే శ్రద్ధతో పూజించిన యెడల అవి అన్నీ సిద్ధించడమేగాక వారికి భగవత్ సాక్షాత్కారము కలుగుతుంది. బిల్వ పత్ర పూజతో ఇహపర సౌఖ్యాలు కలుగుతాయ. అంతేకాక చివరకు మోక్షం కూడా లభిస్తుందని శివరహస్యంలో యాజ్ఞవల్క్య మహర్షి నుడివారు.
యక్షుల రాజైన కుబేరుడు శివప్రేమకు పాత్రుడైనాడు. ఒక నిమ్నకులస్తుడైన భక్తుడు శివపూజార్హమై బిల్వ వృక్షాలను పెంచినందున అతనికి శివసాయుజ్యం లభించిందంటారు. శివడుండి అనే అతన్ని ఒక వనగజం ఎత్తుకుపోగా, అది ఆతన్ని విసిరివేయగా బిల్వ వక్షముల మధ్యన పడ్డాడు. ఎలాంటి ఆపద అతనికి కలుగలేదు. ఆ తర్వాత అతను శివరాత్రి నాడు నాలుగు యామములు శివుని పూజించి శివకైవల్యాన్ని పొందాడు. ఒక భిల్ల యువతి నర్మదా తీరంలో నివసిస్తూ ఆమె ఒక మారేడు విత్తనాన్ని పాతగా, అది మొలచి ఒక వృక్షం అయింది. ఆ వృక్షం క్రింద ఆ వనిత ఒక బాణలింగాన్ని నిలిపింది. రోజూ బిల్వపత్రాలు పై నుండి లింగం మీద పడుతూ వుండేవి. రోజూ ఆ లింగాన్ని ఆమె నీటితో శుభ్రం గావించేది. ఇలా ప్రతిరోజూ చేస్తూ వుండేది. అలా చేయడం వలన ఆమె పాపాలన్నీ పటాపంచలైనాయి. ఇలా ఎందరెందరికో శివసాయుజ్యం లభించినట్టు శివపురాణం చెబుతుంది. కార్తికపురాణకథల్లో సామాన్యులు సైతం మనస్ఫూర్తిగా నోరారా శివా అని పిలిచికైలాసప్రాప్తిని పొందారని చెబుతారు.
లింగరూపియైన మహాదేవుడు బిల్వవక్షం కింద వుండగా, ఆయనను బిల్వ దళాలతో పూజిస్తే, అలాంటి పుణ్యాత్ముడు తప్పక మోక్షాన్ని పొందుతాడట.
బిల్వాష్టకంలో చెప్పినట్లుగా, కాశీక్షేత్రమున వసించుచూ, కాలభైరవ దర్శనము చేసుకొనుచూ, ప్రయాగలో మాధవుని దర్శించిన ఫలమంతా కూడా ఒక బిల్వదళాన్ని శంకరుని శిరస్సుపై పెడితే లభిస్తుందనిచెప్తారు.

- డాక్టర్ పులివర్తి కృష్ణమూర్తి