మెయిన్ ఫీచర్

అవగాహన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌మోహన్, మోహన్ అనే ఇద్దరు పిల్లలు మంచి స్నేహితులు. వారిద్దరిదీ ఒకటే బడి. ఒకే దగ్గర ఇళ్లు కూడా ఉండడంతో వారి స్నేహం రోజురోజుకూ గట్టిపడసాగింది. ఒకరికి తెలియనిది మరొకరు చెబుకుంటారు. ఒకరికి ఇష్టమైంది మరొకరికి ఇష్టం లేకపోయినా తింటారు. ఎక్కడికైనా ఇద్దరూ కలసే వెళ్తుంటారు. మొదట్లో వీరి స్నేహాన్ని చూసి ఇతర పిల్లలు రామ్ అని ఒకరిని, మరొకరిని మోహన్ అని పిలవడం అలవాటు చేసుకొన్నారు. చదువుకునేటపుడైనా, ఆటల్లోనైనా ఇద్దరూ సమ ఉద్దీలుగా ఉండేవారు. కొంతకాలానికి వీరిని చూసి ఇతర పిల్లలకు అసూయ మొదలైంది. వీరిద్దరినీ విడగొట్టాలనుకొనేవారు.
కాని వీరిద్దరికీ ఒకరి మీద ఒకరికి చెబితే పోనీలే అనేవారే కాని ఒకరినొకరు అనుమానించుకొనేవారు కాదు.
***
ఒకసారి అనుకోకుండా రామ్ పక్క ఊరికి వాళ్ల తల్లిదండ్రులతోవెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో ఈవిషయం మోహన్‌కు చెప్పే అవకాశమూ లేకపోయింది. అక్కడ రెండు రోజులు అనుకొన్నది పదిరోజులు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.
అంతలో స్కూల్‌లోపరీక్షల సమయం చెప్పారు. టీచర్లు కొత్త పాఠాలు, వాటికి సంబంధించిన ప్రశ్నలు జవాబులు కూడా చెప్పేశారు.
కాని, రామ్ ఊరినుంచి రాలేదు. మోహన్‌ను రామ్ గురించి అడిగితే నాకు తెలియదు రామ్ ఎక్కడికి వెళ్లాడో నాకు చెప్పలేదు అన్నాడు.
ఇదే మంచి సమయం అనుకొని అసూయ గల పిల్లలు రామ్ గురించి మోహన్ తో చెప్పారు.
మోహన్ మాత్రం ‘అదేం కాదు. వారి పేరెంట్స్‌తో వెళ్లి ఉంటాడు. సమయం చిక్కక నాతో చెప్పి ఉండడులే. వచ్చాక చెబుతాడు.దానిదేముంది’అని అన్నాడు.
దాని తర్వాత కొత్త పాఠాలు, క్వశ్చిన్ ఆన్సర్స్ రామ్‌కు ఎలా తెలుస్తాయి అని పిల్లలు మోహన్ దగ్గర ఆరా తీసారు.
దానికి కూడా మోహన్ ‘ఏముంది? రామ్ వచ్చాక నేను నోట్స్ ఇస్తాను. ఒకరోజు చదువుకుంటే ఏదైనా అర్ధం కాకపోతే నేను చెబుతాలే’అన్నాడు.
***
అంతలో రామ్ వచ్చాడు. రామ్, మోహన్ ఇద్దరూ ఆ రోజు మాట్లాడుకునే అవకాశం రాలేదు.
పక్కరోజు నుంచి పరీక్షలు మొదలైయ్యాయి.
ఈ అసూయ ఉన్న పిల్లలు మోహన్ నోట్స్ తీసేసి దాచేశారు.పైగా రామ్ దగ్గరకు వెళ్లి లేనిపోనివి మోహన్ గురించి చెప్పారు.రామ్‌కు నా విలువ ఇపుడు తెలుస్తుంది. నాకు చెప్పకుండా వెళ్తాడా.. అని మాతో అన్నాడు. నేను నోట్స్ ఇవ్వను అని కూడా అన్నాడు. నీకు కావాలంటే మేము నోట్స్ ఇస్తాము అని చెప్పారు.
రామ్ అన్నీ విని ‘పోనీలే ఏం చేద్దాం. మోహన్‌కు చెప్పకుండా వెళ్లాను కదా. అందుకే అట్లా అని ఉంటాడు. నోట్స్ ఇవ్వకపోతే పోనీలే. నేను పాఠం చదువుతాను. అంతగా నాకు అర్థం కాకపోతే మోహన్‌నే అడుగుతాను. అపుడు చెబుతాడు. వాడికి కోపం పోతుంది’అని చెప్పాడు.
అట్లానే మోహన్ దగ్గరకు వెళ్లి ఈ మాటలకు వ్యతిరేకంగా రామ్ అన్నట్టు చెప్పారు. అపుడు మోహన్ కూడా‘పోనీలే ఊర్లు తిరిగి వచ్చాడు కదా. అలసిపోయి, పరీక్షలు కూడా కదా భయంతో అట్లా మాట్లాడి ఉంటాడు. నేనే వెళ్లి పాఠం చెబుతాను. అపుడు అర్థం చేసుకొంటాడు’ అని చెప్పాడు.
***
తీరా మోహన్ రామ్ దగ్గరకు వెళ్దామని నోట్స్ చూస్తే మోహన్‌కు నోట్స్ దొరకలేదు. అయినా రామ్ దగ్గరకు వెళ్లి నోట్స్ గురించి చెప్పి తనకు గుర్తు ఉన్నంత వరకు పాఠం చెప్పి మార్కులు తక్కువ వస్తాయని అపోహ పెట్టుకోకు. ఇపుడు టైము సరిపోక పోయినా తర్వాతి పరీక్షల్లో నీకు మంచి మార్కులు వస్తాయి. అని రామ్ కు ధైర్యం చెప్పి మోహన్ వచ్చాడు. రామ్ కూడా మోహన్ చెప్పినట్లే చేశాడు.
***
పరీక్షలు అయిపోయాయి. రిజల్స్ కూడా వచ్చేశాయి.
వీరిద్దరి మధ్య కొట్లాటలు వస్తాయనుకున్న ఇతర పిల్లలు వీరు స్నేహంగా ఉండడం చూసి విస్తుపోయారు. రామ్ దగ్గరకు వెళ్లి నీకు మోహన్ నోట్స్ ఇవ్వలేదు కదా.మరి నీకు కోపం రాలేదా అని అడిగారు. దానికి రామ్ ‘కోపం ఎందుకు. మోహన్ పాఠమే నాకు చెప్పాడు. అయినా ఒకవేళ చెప్పకపోయినా నేను బాధపడేవాడిని కాను. నేను ఆ పాఠాన్ని టైమున్నప్పుడు చదువుకునేవాడ్ని. ఒకవేళ అర్థం కాకపోతే మోహనే చెప్పేవాడు. అట్లా చెప్పకపోతే టీచర్‌నే అడిగేవాణ్ణి . దీనికోసం మోహన్ స్నేహాన్ని ఎందుకు వదిలేస్తాను అని అన్నాడు.
మోహన్ దగ్గరకు వెళ్లినీ నోట్స్ రామ్ నీకు తెలియకుండా తీసేసుకొన్నాడు. అందుకే మంచిమార్కులు రామ్‌కు వచ్చాయి. నిన్ను చదువనీయకుండా చేశాడు రామ్ స్నేహం మానేయి అని చెప్పారు.
అపుడు మోహన్ ‘పోనీలే. రామ్ లేనప్పుడు పాఠం చెప్పేశారు కదా. నోట్స్ తీసుకొని మంచి పనే చేశాడు. నేను పాఠం విన్నాను కదా చాలు అనుకొని ఉంటాడు. అయినా పరీక్షల్లో ఎప్పుడూ ఒకేలా మార్కులు రావు. మార్కుల కన్నా పాఠం అర్థం అయిందా లేదా అని చూసుకోవాలి. దీనికోసం రామ్‌తో స్నేహం ఎందుకు మానేస్తాను అని అన్నాడు.
దీనితో వీరిద్దరి స్నేహం ఎంత గట్టిదో ఇతర పిల్లలు తెలుసుకొన్నారు. అపుడు రామ్, మోహన్‌ల స్నేహాన్ని వారి అవగాహనను ఈ ఇతర పిల్లలు తెలుసుకొని స్నేహం అంటే ఏమిటో దానినెట్లా కాపాడుకోవాలో తెలుసుకున్నారు.
అప్పట్నుంచి అందరూ అందరితో స్నేహంగా ఉండడం నేర్చుకున్నారు.

-- ప్రసన్న