మెయిన్ ఫీచర్

కాలదోషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మనుషులు నిరంతరం ఆశాపాశలతో కాలచ్రకంలో ఇరుక్కుని ఉంటారు. నేడు ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరూ వారి, వారి, జీవనక్రమంలో పూర్తి నిమగ్నమైనా భగవంతుని గురించి తన పరలోకం గురించి ఆలోచించే వ్యవధే లేనట్టు ఉంటున్నాడు.
‘‘ఉదయం లేచిన దగ్గర నుండి నిరంతర ం లౌకికమైన వ్యాపకాలే! చిన్నా పెద్దా తేడాల్లేకుండా వయస్సు తారతమ్యం కాని, పేద, ధనిక అన్న వ్యత్యాసం కాని లేనట్టు అంతుపట్టని కార్యక్రమాలలో సతమతమవుతుంటారు.
ఇటువంటి పరిస్థితుల్లో, మనిషిగా జన్మించుట ఒక వరం. ఆ మానవ జన్మను సార్థ్క్యం ఛేసుకోవాలి కాని వ్యర్థపరచుకోకూడదు.
ప్రతి ఒక్కరికి భవిష్యత్‌పై ఆశ - కోరికలుంటూంటాయి. కానీ, నిరంతరం గతం గూర్చిన దిగులు, వర్తమానంలో వ్యర్థమైన ఆలోచన్లు, ఇట్లా సాగుతుంటే భవిష్యత్తు అంధకారంగా తయారు అవుతుంది.
‘‘దురాశ దుఃఖానికి దారి’’ మహాభారతం చెబుతుంది. మహాభారతంలో లేనిది లోకంలో లేదు అన్నట్టుగానే దుర్యోధనుని లోభం కారణంగా అంతా తనకే రాజ్యం కావాలనే తాపత్రయం పడి తను నశించి అందరి నాశనానికి కారణమయనట్లుగానే నేడు అత్యాశ పరులు తయారు అవుతున్నారు. దుర్యోధనుని ఉదాహరణ చూసి కూడా అర్థం చేసుకోకుండా పరుల సొమ్మును ఆశిస్తున్నారు.
నేడు తల్లిదండ్రులైనా ఇతర బంధువులైనా పుత్రవాత్సల్యం బంధుప్రేమతో వ్యవహరి స్తున్నారు. ఎవరికి వారు తమకెందుకులే అనుకొంటూన్నారు. దోచుకునే సంస్కృతి తెలిసినా వారిని అడ్డగించటం లేదు. మంచిమాటలు పెడదోవ పట్టిన వారికి చెప్పడం లేదు. కాని, ఇది మంచిది కాదు. అన్యాయం, చెడు చేయడం ఎంత పాపమో పాపపు కార్యాన్ని చేస్తున్నా వద్దని కూడదని చెప్పగలిగీ చెప్పకపోతే అంతే పాపం వీరికి ప్రాప్తిస్తుంది.
మనుషులు ఉన్న వారైనా, లేనివారైనా వేదనతో సతమతమవుతున్నారు. కలిమిలేములు అనేవి మనిషి గత జన్మల కర్మఫలమే. కష్ట్ఫేలే అన్నట్లుగా ఎంత ధార్మిక ప్రవర్తన సత్య, సాధు జీవనం చేయ కలిగితే త్రికాలాల్లోనైనా ఏ జన్మలకైనా మంచిగానే జరుగుతాయి!
మనుషుల్లో సహనం, సర్దుబాటు, అత్యంత అవసరమైన తృప్తి అనేది రోజు రోజుకీ మృగ్యం అయపోతోంది. ప్రతీవారిలో ప్రతీ విషయానికి అసహనం, కోపం, ఎదుటివారి చిన్నపొరపాటైనా సరే చిన్న తేడా కూడా తట్టుకోలేకపోవడం ఏదో అసంతృప్తితో జీవనం గడుస్తోంది. కుటుంబంలోనైనా, సమాజంలోనైనా అనుకున్నట్లే ఏదీ జరుగదు కదా!
మనిషి ఎంతసేపూ తను అనుకున్నట్లు ప్రతీది జరగాలని తనమాటే నెరవేరాలన్నట్లు తపించడం కనబడుతుంది. ఈ నేను, నా, నామాటలకై తపన అనేవి నేను ఎవరిని అనే ధ్యాస వైపు, భగవంతునిపై మళ్ళించగలిగితే ధన్యులు.
ప్రతీ చోట, ప్రతీ విషయానికి ఏదో వంక వెతుకుతూ అసంతృప్తితో వేగే బదులుగా ఇలా జరిపించేది తను కాని ఇతరులు కాని కాదని జరగవలసి ఉంది కనుకనే జరుగుతున్నాయనే భావనకు వస్తే సహనం సర్దుబాటుకు మనిషి అలవాటుపడటం జరుగుతుంది.
16వ అధ్యాయం 12వ శ్లోకం ఆశాపాశ .... కామక్రోధా పరాయణా! మనుషులు ఆశాపాత పరంపరలచే ఎల్లప్పుడు బంధించబడుచుందురు. నేను అన్ని పనులు చేయకలుగుచున్నాను. ఇంకనూ చేయగలను. అనే భావనను మనిషి ప్రదర్శించడం దాని ఫలితంగా రాగద్వేషాలు వగైరా, వగైరా లన్నీ ఉత్పన్నం అవుతాయి. వాటి నుండి బయటకు రాలేకపోవడం జరుగుతుంది.
నేడు మనిషి ముసలి వయస్సు వచ్చినా, వైద్యానికి అందని అంతుచిక్కని దీర్ఘవ్యాధి బారిన పడిన కూడా పరమాత్మ తపన కలగటం లేదు సరికదా, బ్రతుకు సుఖాల మీద వ్యామోహం ఏమాత్రం తగ్గడం లేదు వాటికై ఒకటే పోరాటాలు.
మనిషి ఆశతో కోరికలను విడిచిపెట్టకపోతే భగవంతుని చేరే దారే దొరకదు. మనిషికి కోరిక కలిగి నెరవేరకపోతే కోపం వస్తుంది. ఒకవేళ నెరవేరితే ఆనందం కలిగి నేనే చేసానన్న అహం పెరిగు తుంది.
మనిషికి కోరికలు, ఆశపడటాలు జీవనదీక్షలో బంధనాలే. ఆశే అన్నిటికి మూలం, ఆనందం కలిగినా దుఃఖం కలిగినా కారణం మాత్రం ఆశే!
పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండవు. అవి మన గత జన్మల కర్మల ఫలితాలే. ఈ ఆశా, పాశాలు అనుకూల, ప్రతికూలాలు పూర్వ జన్మ వాసనలను బట్టి అందుతుంటాయ.
కనుక ఇప్పుడైనా సరే ప్రయత్నపూర్వకంగా భగవంతుని నామస్మరణ చేస్తే పరమేశ్వరుడు చెప్పినట్టుగా కలియుగంలో నామస్మరణే పాపహారిణి కనుక పూర్వపు వాసనలు, నేటి దురవస్థలు తొలగిపోతాయ.
అహంకారంతో దుర్యోధనుడు భారతంలో కురుక్షేత్ర యుద్ధానికి కారణమయ్యాడు. దీనికి దృతరాష్ట్రుని పుత్ర వ్యాహమంటారు.
అవసరం ఉన్నా లేకపోయినా, అందని వాటికై అర్రులు చాచడం, అన్నీ తనకే స్వంతమవ్వాలనే తాపత్రయ పడటం మనిషి మానాలి. త్యాగంలోనే మహనీయత ఉందని గుర్తించాలి. సంతృప్తితో కూడిన జీవితమే నిజమైన జీవితమని తెలుసుకోవాలి.

- శ్రీమతి గంటి కృష్ణకుమారి, సెల్: 9441567395