ఎడిట్ పేజీ

బోధన, సాధనల సంగమ స్థలి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరగతి గది రెండు అంశముల సంయోగం. ఉపాధ్యాయుడు తన జ్ఞానాన్ని విద్యార్థులకు అందజేసే వేదిక- తరగతి గది. టీచర్ సమక్షంలో విద్యార్థి ఉంటాడు. కానీ, అది సాధన (లెర్నింగ్) కాదు. తరగతి గదిని విద్యార్థి సాగదీస్తాడు. అది ఆ విద్యార్థి మేధస్సు, సామర్థ్యం పైన ఆధారపడి ఉంటుంది. గురువు చెప్పిన బోధనా విషయాలను మననం చేసుకుంటారు. విద్యార్థులు తమ మేధస్సుతో దానిని సంయోగపరుస్తారు. విద్యార్థి జ్ఞానం కేవలం ఉపాధ్యాయునిదే కాదు, విద్యార్థి తన మేధస్సుతో తన భావాలను కలుపుతాడు. ఉపాధ్యాయుడు చెప్పిన విషయాలను విశే్లషిస్తాడు. తిరిగి దాన్ని సహచర విద్యార్థులతో చర్చిస్తారు. ఉపాధ్యాయుడు ఇచ్చిన జ్ఞానం నుంచి విద్యార్థి సాధించటం, పాటించటం అన్నదే విద్య. తరగతి గది రెండు ఆత్మల, మేధస్సుల సంయోగం. దానిలో విద్యార్థి సమాజం భావనలను, తన అనుభవాలను దానిలో కలిపి జీర్ణం చేసుకుంటాడు. అందుకే విద్యార్థి ఉపాధ్యాయుని భుజాలపై నిలుచుంటాడు. తరగతి గది పసిపిల్లలకు ఆ శక్తిని ప్రసాదిస్తుంది. ఆ శక్తే గురువుకు సంతృప్తినిస్తుంది. తరగతి గది బోధన, సాధనల సంయోగ క్షేత్రం.
సామాజిక మార్పులను చూపే అద్దం..
చైతన్యం గల ఉపాధ్యాయుడు తరగతి గదినే ప్రపంచంగా మారుస్తాడు. దేశంలో ఉండే సామాజిక, రాజకీయ క్లిష్ట సమస్యలను తన పాఠంలో చెబుతాడు. నేను గణిత ఉపాధ్యాయుణ్ణి. అంకెలతోనే ఆడుకుంటాను. దానిద్వారా సామాజిక సమస్యలను స్పష్టంగా చూపించే అవకాశం దొరుకుతుంది. ఉదాహరణకు ‘గ్రాఫ్’లో సమాజంలో ఉండే వివిధ వర్గాల జనాభా నిష్పత్తిని చూపించవచ్చు. అలాగే ‘గ్రాఫ్’లలో ప్రభుత్వం ఆ సంవత్సరంలో ఏ వర్గానికి ఎంత డబ్బు కేటాయించిందో చూపించవచ్చు. దీనితో పిల్లలకు క్లిష్టమైన సామాజిక సమస్యలను తన పాఠంలోనే గురువు చూపిస్తాడు. యుద్ధాల వల్ల ఎంత డబ్బు ఖర్చయిందో అంకెల ద్వారా చూపిస్తాడు. అంకెలు దేశంలోని ప్రతి రంగంలో ఖర్చుపెట్టే దాన్ని గురించి పిల్లలకు గ్రాఫ్‌లలో చూపిస్తారు. తరగతినే ఒక సామాజిక ప్రయోగశాలగా మారుస్తాడు గురువు. ఉపాధ్యాయుడు తరగతి గదిని తన చతురతతో సామాజిక అవగాహనకు, రాజకీయ అవగాహనకు మార్చగలుగుతాడు. ఉపాధ్యాయుడుకి తరగతి గదే తను చెప్పే సామాజిక పరిణామాలకు ఒక సాధనం. ప్రపంచంలో తరగతి గదే మార్పుకు అంకురార్పణ చేస్తుంది. ఉపాధ్యాయుడు దానిని తన లక్ష్యం ప్రకారమే తీర్చిదిద్దుతాడు. అందుకే ఉపాధ్యాయుడు సామాజిక, రాజకీయ మార్పులు చేయగల శక్తి ఉన్నవాడని అంటారు. తరగతి గది రూపకల్పన ఉపాధ్యాయుని దృక్పథం పైనే ఆధారపడి ఉంటుంది. తరగతి గది రూపురేఖలను నిర్ణయించే శక్తి ఉపాధ్యాయునకున్నది. ఉపాధ్యాయుని సామాజిక, రాజకీయ లక్ష్యాలకు తరగతి గది ఒక సాధనం.
జ్ఞానబోధ ప్రధానం...
పాఠశాల ప్రధాన కర్తవ్యం జ్ఞానబోధ. 6 సంవత్సరాల వయసు పిల్లలకు జ్ఞానబోధ ఏమిటని కొందరు అడుగుతారు. పిల్లలకు ఆసక్తి కలిగించే ఆటలపై, ఇతర అంశాలపై తగిన స్ఫూర్తిని పాఠశాలలో కలిగించాలి. అదే జ్ఞానబోధ. ఆట ఆడేటప్పుడు పిల్లల్లో ఒక బంధం ఏర్పడుతుంది. గోల్‌కొట్టేవాడు ఒకడే. ఆ గోల్ కొట్టేవారినే హీరోలనుకుంటారు. కానీ వారిని గోల్‌వరకు తీసుకువచ్చింది మాత్రం ఫార్వర్డ్ టీమ్. కాపలా కాస్తున్నది కార్నర్ ప్లేయర్. కాపాడుతున్నది వెనుకనుండి షాట్ కొట్టేవాడు. ఆటగాళ్ల మధ్యలో గాఢమైన బంధం ఏర్పడుతుంది. మొత్తం టీమ్ కలసి విజయం సాధిస్తుంది. ఈ స్ఫూర్తిని పాఠశాలలు తరగతి గదిలోకి తీసుకుపోతాయి. ఆ స్ఫూర్తిని తరగతి గదిలో కలిగించటమే పాఠశాల నిర్వాహకుల విధి. ఆటకు, తరగతి గదికి మధ్యనున్న గీతలను కలిపితే సాధన అవలీలగా జరుగుతుంది. వివిధ రంగాల్లో విద్యార్థులు ఆసక్తి చూపితే ఆ దిశగానే వారిని ప్రోత్సహించాలి. కొంతమంది నాట్యంతో ప్రేరేపించబడతారు. కొందరు సంగీతంతో ప్రేరేపింపబడతారు. కొందరు కోలాటం ఆడతారు. పాఠశాల వివిధ కళల సమన్వయకర్తగా ఉంటుంది. ఒక పుస్తకంలోంచి ఇంకో పుస్తకంలోకి వెళ్లటం సాధన కాదు. ఒక రంగంలో ఉండే తన్మయత్వాన్ని వేరే రంగానికి మార్చటం పాఠశాల లక్షణం. పాఠశాల జ్ఞానబోధనను రకరకాలుగా చేస్తూ విశిష్టతను సంపాదిస్తుంది. జ్ఞానబోధ పద్ధతే పాఠశాలను విస్తరింపజేస్తుంది. అందుకే పిల్లలు పెరిగి పెద్దవారతున్నా ‘ఇది నా స్కూల్’ అంటారు. జీవితాంతం తమ తల్లిదండ్రులను జ్ఞప్తికుంచుకున్నట్లు పాఠశాలను గుర్టుపెట్టుకుంటారు.

-చుక్కా రామయ్య