మెయిన్ ఫీచర్

సర్వసౌభాగ్యదాయకాలు... వ్రతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రావణ మాసం వచ్చిందంటే చాలు స్ర్తిలు ఎంతో ఉత్సాహంగా కనిపిస్తారు. ఈ మాసంలో వచ్చే ప్రతి మంగళవారమూ, శుక్రవారమూ అత్యంత ప్రీతికరంగా మహాలక్ష్మీ అమ్మవారిని సేవించుకునే సుదినాలు. ఈ మాసంలోనే మంగళగౌరీ వ్రతాన్నీ, వరలక్ష్మీ వ్రతాన్నీ ఆచరిస్తారు. లక్ష్మీ భర్త విష్ణుమూర్తిది శ్రవణా నక్షత్రం. ఆ విధంగానే కృష్ణపరమాత్మ జన్మించిన మాసం శ్రావణమాసం. కొత్తగా వివాహమైన స్ర్తిలు శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో ‘మంగళగౌరీ వ్రతం’ ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని చేయడంవలన అమంగళం కలుగకుండా వుంటుందంటారు. సౌభాగ్యవతిగా కలకాలం వర్ధిల్లుతారు. ఈ వ్రతంలో ఎక్కువగా, మామూలుగా ఉపయోగించే పూజా వస్తువులేగాక తెల్లటి వస్త్రంపై తొమ్మిది బియ్యపురాసులూ, ఎర్రని వస్త్రంపై 16 గోధుమ రాసులూ పోయడం, కలశం పెట్టడం, 16 పోగుల వత్తిని చేయడం, 16 లడ్డూల వాయనం ఇవ్వడం, 16సార్లు వ్రతాన్ని చేయడం, 16 జంటలకు భోజనం పెట్టడం లాంటివి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సర్వసౌభాగ్యాలనూ ప్రసాదించే మహాలక్ష్మి సమేత గౌరీదేవికి పూలూ, పండ్లూ, చందనం, కుంకుమ, గాజులు, కుంకుమ భరిణ, నూనె, గోరింటాకు, కాటుక, సింధూరం, దువ్వెన, అద్దం వుంచి, వాటిని ముత్తయిదువులకు దక్షిణగా సమర్పిస్తారు. ముఖ్యంగా అత్తగారికి పాద నమస్కారం చేస్తారు. అర్చకులకు నూతన వస్త్రాలూ, పూలమాల, గ్లాసు దక్షిణగా సమర్పించుకుంటారు. అత్తగారికి మాత్రం 16 లడ్డూలపై ఒక రవిక గుడ్డను కప్పి, దానిపై కొంత సొమ్మును వుంచి, అత్తగారికి నమస్కార పూర్వకంగా వాయనం ఇవ్వాలి. కుంకుమ, పసుపు, గాజులకు ఈ వ్రతంలో ఎంతో ప్రాధాన్యత వుంది. సామాన్యంగా ఈ వ్రతాన్ని వివాహం అయిన మొదటి సంవత్సరంలోనే చేస్తారు. కొందరైతే వివాహం గాకముందు కూడా ప్రారంభించి, అయిదు సంవత్సరాలపాటు కొనసాగిస్తారు. ఈ గౌరీవ్రతంలో శనగలు, చలిమిడి ముఖ్య నైవేద్యంగా పెట్టడం ఆనవాయితీ. 16రకాల పూలతో కొందరు మంగళగౌరిని పూజిస్తారు. పేరంటానికి ముతె్తైదువులను పిలిచి తాంబూలంతోపాటు, పండ్లూ, పూలూ, రవికగుడ్డా, శనగలు వాయనంగా ఇస్తారు. కాటుక పెడతారు. పసుపు రాస్తారు. కుంకుమ పెడతారు. పాదాలకు నమస్కరిస్తే ముతె్తైదువులు అక్షితలతో దీవిస్తారు. పెళ్ళి సమయంలో ఈ వ్రతాన్ని తప్పనిసరిగా పెళ్ళికూతురితో చేయిస్తారు. ఆ సమయంలో పెండ్లి కుమార్తెకు బంగారంతో చిన్న మంగళ సూత్రాలూ, నల్లపూసలూ ఇస్తారు. సౌభాగ్యవతిగా ముతె్తైదువులు దీవిస్తారు.
ఇక శ్రావణ శుక్రవారం వ్రతం చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ వ్రతాన్ని పుణ్యస్ర్తిలు తప్పనిసరిగా ఆచరించాలి. శ్రావణ శుక్రవారం రోజున చేస్తే పాపాలు తొలగిపోవడమేగాక మహాలక్ష్మీ ప్రసన్నం కలుగుతుంది. మహాలక్ష్మీదేవి కొలువున్న ఇంట్లో దేనికీ లోటుండదు. ధనానికి దేవత మహాలక్ష్మీదేవి. ఆమె కరుణాకటాక్షాలుంటే ధనం, ధాన్యం, సంతానం, బుద్ధి, ధైర్యం, శౌర్యం, వివేకం వంటివి పుష్కలంగా వుంటాయి. ప్రతి ఇల్లూ కళకళలాడుతూ సంతోషంగా అందరూ సుఖమయ జీవనాన్ని పొందుతారు. ప్రతి శుక్రవారమూ శ్రావణమాసంలో కొందరు మహాలక్ష్మీ అమ్మవారిని మూడురకాల పిండి వంటలతో నైవేద్యంపెట్టి, కొత్త చీరా, గాజులూ పెట్టి ఆరాధించి, ఆ తర్వాత తాము ధరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించేవారు, ఇంటిని ఎంతో శుచిగా, శుభ్రంగా వుంచుకోవాలి. అమ్మవారు అద్దంలోనూ, తామర పూలతోనూ, ఏనుగులూ, గుర్రాలూ, రత్నాలూ, గోవులలోనూ- వుంటుందని అంటారు. గుమ్మానికి పసుపురాయాలి. కుంకుమ పెట్టాలి. మామిడి తోరణాలు కట్టాలి. ముగ్గులు వేయాలి. అన్ని వ్రతాల్లో లాగానే ఈ వ్రతంలో కూడా మామూలుగా యధావిధిగా అమ్మవారిని పూజించి, ఒక తోరం కట్టుకుంటారు. తెల్లటి దారాన్ని తొమ్మిది పోగులు తీసుకుని, పసుపు రాసి, ఆ దారానికి తొమ్మిది పూలుకట్టి, తొమ్మిది ముడులతో తోరాలను తయారుచేసి వ్రత పూజలో వుంచి, వ్రత సమాప్తికాగానే ధరిస్తారు. ఈ తోరంకు కొందరు తమలపాకులు కూడా కడతారు. కలశం పెడతారు. పెద్ద కొబ్బరికాయకు కళ్లు, ముక్కూ, చెవులూ, నోరూ దిద్ది, బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. తొమ్మిది రకాల పిండి వంటలుచేసి నైవేద్యం పెడతారు. వాయనాలు ముతె్తైదువులకు ఇవ్వడం ముఖ్యంగా భావించి, ఆశీర్వచనం అందుకుంటారు. వ్రతం ఆచరించినవారికీ, వ్రతాన్ని చూసినవారికీ మహాలక్ష్మీదేవి వరలక్ష్మిగా వరాలను ప్రసాదిస్తుంది. సౌభాగ్యాన్నిస్తుంది. ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఐశ్వర్యం సిద్ధిస్తుంది. వరలక్ష్మీ వ్రతకథను విని అక్షతలు శిరస్సుపై వేసుకోవాలి. మతె్తైదువులకు తాంబూలాలు ఇచ్చి సత్కరించి, ప్రసాదం అందరికీ ఇచ్చి, తామూ స్వీకరించాలి. రాత్రికి ఉపవాసం వుండాలి.
శ్రావణ శుక్రవారంనాటికి స్ర్తిలు కొత్త నగలు కొంటారు. ఆ నగలను వరలక్ష్మీ అమ్మవారికి అలంకరించి పూజచేస్తారు. కొన్ని ప్రాంతాలలో అత్తవారు కోడళ్లకు ‘శ్రావణపట్టీ’అని ఆభరణాలు తెస్తారు.
మంగళగౌరీ, వరలక్ష్మీ వ్రతాలను మహిళలు నిష్ఠతో భక్తిపూర్వకంగా ఆచరించి సౌభాగ్యంతో, సర్వసుఖ సంపదలతో వర్ధిల్లగలరు.

- డా.పులివర్తి కృష్ణమూర్తి