మెయిన్ ఫీచర్

శంకరుని మెప్పించిన రామచరిత మానస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రయాగ వద్ద బాంద్రా జిల్లాలో రాజాపురము పేరుగల గ్రామం ఉన్నది. అక్కడ ఆత్మారామ్ దూబే పేరుగల ప్రఖ్యాత పండితుడు సరయూ నదీ పరీవాహక ప్రాంతంలో నివసిస్తూండేవాడు. క్రీ.శ.1554 సం. శ్రావణ శుద్ధ సప్తమిన 12 నెలలు గర్భంలో వున్న పిదప ఈయన జన్మించారు.
పుట్టిన సమయంలో బాలుడు ఏడ్వలేదు కానీ అతని నోటి నుండి రామ శబ్దం మాత్రం వస్తూ ఉండేది. అతని నోట ముప్ఫై రెండు పళ్ళు ఉండేవి. అతని శరీరము పొడవు ఐదు సంవత్సరాల బాలుడిలాగా ఉండేది. ఈ రకమైన అద్భుతమైన బాలకుని చూచి ఆయన తండ్రి అమిత భయభీతుడయ్యాడు. తులసీదాసు తల్లి చాలా దుఃఖించేది. ఆమె బాలునికి అరిష్టం వుందనే బాధతో దశమి రాత్రుల ఉత్సవాలపుడు, పిల్లవానిని తీసుకొని తమ దాసీలతోసహా ఆమె అత్తగారింటికి పంపింది. ఆ తరువాత ఆమె ఈలోకం నుంచి నిష్క్రమించింది. చునియా అనే పేరుగల దాసి ప్రేమతో ఆ పిల్లవాని పాలన, పోషణ చేస్తూ ఉండేది. అపుడు తులసీదాసుకు ఐదున్నర సంవత్సరాలు వచ్చాయి. అపుడు దాసి కూడా మరణించింది. అప్పటినుండి బాలుని ఆలనా పాలనా చూసేవారు లేకపోయారు.
ఆయన ఇంటింటికీ వెళ్లి భిక్షాటన చేసి జీవిస్తూండేవాడు. ఈ బాలునికి జగజ్జనని పాఠ్వతీమాత కరుణించి ఆమె బ్రాహ్మణ వేషం ధరించి ప్రతిదినమూ ఆ బాలుని వద్దకు వెళ్లి అతనికి తన స్వహస్తాలతో భోజనం తినిపించేది.
ఇక్కడ శంకర భగవానుని ప్రేరణతో రామేశ్వరంలో నివసించే అనంతానందజీ ప్రియశిష్యుడైన నరహర్యానందజీ ఈ బాలునికి కొరకు వెదకి ఈ బాలునికి ‘రామబోలో’ అని నామకరణం చేసి ఆయన ఈ పిల్లవానిని తనతోపాటు అయోధ్యకు తీసుకెళ్ళాడు. తర్వాత నరసహరి స్వామి వైష్ణవులకిచ్చే పంచ సంస్కారములు కావించి, రామబోలాకు రామ మంత్ర దీక్షనిచ్చాడు. ఆ బాలుని యొక్క బుద్ధి అఖండ ప్రజ్ఞ ప్రగాఢమైంది. ఒక్కసారి గురువు నోట వినగానే అది ఏదైనా అది బాగా కంఠస్థమయ్యేది. నరసదాసు రామచరిత్రను తులసీదాసుకు వినిపించాడు.
కొద్ది రోజుల తర్వాత ఆయన కాశీకి వెళ్ళాడు. అక్కడ శేష సనాతుని వద్దకు వెళ్లి తులసీదాసు 15 సంవత్సరాలు వచ్చేవరకూ వేద వేదాంగాలు అధ్యయనం చేశారు. తర్వాత భరద్వాజ గోత్రపు ఒక అందమైన స్ర్తితో వివాహం జరిగింది. ఒకసారి ఆయన భార్య తన సోదరునితో తన పుట్టింటికి వెళ్లింది. వెంటనే తులసీదాసు కూడా ఆ గ్రామానికి వెళ్లాడు. తనను వదిలి ఉండలేక తనకోసం వచ్చిన అతనిని చూసిఆయన భార్య ఆశ్చర్యపోయింది. నీవు నాపై చూపించే ప్రేమలో సగమైనా భగవంతునిపై చూపితే నీ జన్మ ధన్యమవుతుంది కదా లౌకిక సౌందర్యానికి ఇంత విలువ ఇవ్వనక్కర్లేదని ఆయనతో చెప్పింది. అంతే తులసీదాసుకు ఈ మాటలు కర్ణకఠోరంగా విన్పించాయి. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అత్తవారిల్లు వదలిపెట్టి అక్కడనుంచి వెళ్లిపోయాడు.
తర్వాత తులసీదాసు ప్రయాగ వెళ్లాడు. అక్కడ గృహస్తు వేషం పరిత్యజించి సాధువు వేషం ధరించాడు. మరలా తీర్థయాత్రకు వెళుతూ కాశీ చేరాడు. కాశీ వెళ్లి తులసీదాసు రామకథ చెప్పడం మొదలుపెట్టాడు. అక్కడ వారికి ఒక ప్రేతము కలిసి ఆంజనేయస్వామి ఎక్కడ ఉంటాడో, ఆయన చిరునామా తెలిపింది. అక్కడ హనుమంతులవారిని కలుసుకొని శ్రీ రఘునాధుల మహారాజులవారి దర్శనం కావలెనని ప్రార్థించాడు.
హనుమంతలవారు ఇలా అన్నాడు- నీకు చిత్రకూటములో రఘునాధులవారి దర్శనమవుతుందని చెప్పాడు. చిత్రకూటము చేరి రామఘాట్ చేరాడు. ఒకరోజు ప్రదక్షిణం చేయాలని బయలుదేరాడు. మార్గమధ్యములో ఆయనకు శ్రీరామచంద్రుని దర్శనమైంది. భగవంతుడు తన స్వహస్తములతో చందనం తీసికొని తులసీదాసు శిరస్సుపై ఉంచాడు. వెంటనే అంతర్థానమైనాడు.
1628 సం.లో ఆయన హనుమంతులవారి ఆజ్ఞతో అయోధ్య చేరాడు. అక్కడ కొన్ని రోజులు ఉండి ఆరో రోజున ఒక వటవృక్షము క్రింద ఆయనకు భరద్వాజ మహర్షి, యాజ్ఞవల్క్య మహర్షుల దర్శనమైంది.
ఆయన మనస్సులో కవితాధారణశక్తి స్ఫురించింది. ఆయన సంస్కృత భాషలో పద్యరచన చేయసాగారు. రాత్రివేళ ఎన్ని పద్యాలైతే వ్రాస్తాడు. తెల్లవారేసరికి అవి లుప్తమై (మాయమై)పోయేవి. ఇలాంటి సంఘటనలు ప్రతిరోజూ జరుగుతుండేది. ఎనిమిదవ రోజున తులసీదాసుకు స్వప్నములో శ్రీ శంకర భగవానులు ప్రత్యక్షమై ఇలా ఆదేశించాడు. ‘‘నీవు నీ మాతృభాషలో రచనను కొనసాగించు అని’’. 1631 సం. ప్రారంభమున శ్రీరామనవమి రోజున ‘శ్రీరామ చరిత మానసము’ రచన వ్రాయడం మొదలుపెట్టాడు. రెండు సంవత్సరాల 7 నెలల 26 రోజులకు గ్రంధ రచన సమాప్తమైంది. పిమ్మట భగవంతుని ఆజ్ఞ మేరకు తులసీదాసు కాశీ వెళ్లి భగవాన్ విశ్వనాథునికి మరియు మాతా అన్నపూర్ణాదేవికి శ్రీరామచరిత మానసము వినిపించారు. ఆ రోజు రాత్రివేళ శ్రీ విశ్వనాథుని మందిరంలో ఆ కావ్యాన్ని ఉంచాడు. మరుసటి రోజు ఉదయం మందిరం తలుపు తీయగానే ఆ పుస్తకముపైన ఈ విధంగా లిఖించి ఉన్నది.
‘‘సత్యం శివం, సుందరం’’- దాని క్రింద శ్రీ శంకర భగవానులవారి సంతకం ఉన్నది. రామచరిత మానస్‌చదివిన వారికి కూడా రాముని దర్శనం కలుగుతుంధని రామచరిత మానస్ చదివిన వారు చెప్తుంటారు. కలి దోషం అంటకుండా ఉండాలని అనుకున్నవారు రామచరిత్‌మానస్‌ను చదివితే వారికి ఎట్టి కలిదోషాలు అంటవు. అంతేకాక రామచంద్రుని కరుణాకటాక్షాలు లభిస్తాయ.

-చీమల మఱ్ఱి బాలకృష్ణ