మెయిన్ ఫీచర్

ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

**కొందరికి ఫిట్స్ వస్తుంటాయి. ఇలాంటివారు ఫిట్స్ కోసం మందులు వాడుతుంటారు. వీరు గర్భధారణ చేయవచ్చా లేదా అనుకొంటారు. ఇందులో ఏమీ అనుమానం అక్కర్లేదు. ఫిట్స్ ఉన్నప్పటికీ గర్భధారణకు ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వైద్యులను ముందుగానే సంప్రదించి ఫిట్స్‌కు వాడే మందుల మోతాదును తగ్గించుకుంటే చాలు. అట్లాకాకపోతే హోమియో మందులు వాడితే ఫిట్స్ పూర్తిగా తగ్గుతుంది అంటారు. కనుక ఆ హోమియో మందులు వాడి పూర్తిగాపోగొట్టుకున్నా మంచిదే. ఫిట్స్‌కు వాడే మందుల్లో కొన్ని పుట్టబోయే బిడ్డకు అవయవ లోపాలు కలిగించేవి అయ్యి ఉండవచ్చు. కనుక వాటిని ముందుగానే తెలుసుకుంటే మంచిది. బిడ్డకు హానికరం కాకుండా మోతాదును తగ్గించిన తర్వాత మాత్రమే గర్భధారణకు ప్లాన్ వేసుకోవాలి **.
===========================================================

మాతృత్వం ఓ వరం. తనకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా, అందంగా ఉండాలనీ ప్రతి తల్లీ కోరుకుంటుంది. బిడ్డ తల్లి ఆరోగ్య రక్షణకు వైద్యులు ఎన్నో విషయాలు చెబుతుంటారు. అనుభవజ్ఞులు కొన్ని సూచనలు చేస్తుంటారు. ఎవరు ఎన్ని చెప్పినా ఏదో ఒక అనుమానం గర్భిణులకు రావడం సాధారణమే. గర్భం ధరించకముందు ఏదైనా తిండి, మందుల విషయంలో అంత జాగ్రత్త పాటించకపోయినా ఫర్వాలేదు కానీ గర్భధారణ తరువాత మాత్ర జాగ్రత్తలు తప్పని సరిగా తీసుకోవాల్సిందే. మందులు అన్నవన్నీ కూడా అనేకానేక రసాయనాల మిశ్రమం. డాక్టరు చెప్పితే తప్పని సరి పరిస్థితుల్లో మాత్రమే మందులు వేసుకోవాలి. కానీ ఏ తలనొప్పో కాళ్లు నొప్పో అనుకొంటే మాత్రం ఏ మందులు వాడకపోవడమే మంచిది.
కొందరికి ఫిట్స్ వస్తుంటాయి. ఇలాంటివారు ఫిట్స్ కోసం మందులు వాడుతుంటారు. వీరు గర్భధారణ చేయవచ్చా లేదా అనుకొంటారు. ఇందులో ఏమీ అనుమానం అక్కర్లేదు. ఫిట్స్ ఉన్నప్పటికీ గర్భధారణకు ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వైద్యులను ముందుగానే సంప్రదించి ఫిట్స్‌కు వాడే మందుల మోతాదును తగ్గించుకుంటే చాలు. అట్లాకాకపోతే హోమియో మందులు వాడితే ఫిట్స్ పూర్తిగా తగ్గుతుంది అంటారు. కనుక ఆ హోమియో మందులు వాడి పూర్తిగాపోగొట్టుకున్నా మంచిదే. ఫిట్స్‌కు వాడే మందుల్లో కొన్ని పుట్టబోయే బిడ్డకు అవయవ లోపాలు కలిగించేవి అయ్యి ఉండవచ్చు. కనుక వాటిని ముందుగానే తెలుసుకుంటే మంచిది. బిడ్డకు హానికరం కాకుండా మోతాదును తగ్గించిన తర్వాత మాత్రమే గర్భధారణకు ప్లాన్ వేసుకోవాలి. గర్భధారణలోను ఫిట్స్ మందులు వేసుకొంటే పుట్టబోయే బిడ్డలల్లో చెవి, ముఖానికి సంబంధిచిన ఎముకల ఆకృతిలో మార్పులు, న్యూరల్ ట్యూబ్ లోపాలు, గుండెజబ్బులు రావచ్చు అని వైద్యులు చెబుతారు. అందుకేముందుగా డాక్టరు ను సంప్రదించిన తర్వాతనే గర్భధారణ ఆలోచనలు చేయాలి.
అంతేకాదు ఎర్గోటమైన్ మెథరిజడ్ లాంటి యాంటీ మైగ్రేన్ మందులు కూడా వాడకూడదు. కొందరికి ఉండే మైగ్రేన్ ఎక్కువగా ఉంటుంటుంది. వారు ఈమైగ్రేన్‌కు కంట్రోల్లో ఉంచడం కోసం మందులు రెగ్యులర్‌గా వేసుకోవాల్సి వస్తుంది. అట్లాంటి వారు కూడా గర్భధారణ కోసం ప్రయత్నాలు చేసేటపుడు డాక్టర్ సలహాను పాటించాలి. లేనట్లయతే నెలలు నిండకుండానే బిడ్డ పుట్టే ప్రమాదాల్లాంటివి ఏర్పడవచ్చు.
ఏ బిడ్డ పుట్టబోతున్నాడో అని కూడా టెస్టులు చేయించుకోవాలనుకొంటారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. ఎక్స్‌రే పరీక్షలు కూడా చేయించుకోకుండా ఉంటేనే మంచిది.
సాధారణంగా జలుబు, దగ్గు చిన్నపాటి జ్వరం వచ్చినపుడు డాక్టరు సలహాలేకుండానే కొన్ని మందులు వాడుతుంటాం. కానీ గర్భధారణ సమయంలో మాత్రం ఇలాంటి మందులను కూడా దూరం ఉంచితేనే మేలు. ఒకవేళ తప్పని సరిగా జలుబు జ్వరం పీడిస్తుంటే మాత్రం వెంటనే డాక్టరును సంప్రదించడమే మేలు. కొన్ని రకాల యాంటీ బయాటిక్స్ వాడితే పుట్టబోయే బిడ్డలో ఎముకల ఎదుగుదల్లో లోపాలు కనబడవచ్చు. కామెర్లవంటి జబ్బులు కూడా వచ్చే అవకాశాలుంటాయి. పుట్టిన పిల్లల్లో చెవుడు లాంటి కూడా ఏర్పడవచ్చు. అందుకే డాక్టరు సలహా లేనిదే ఏ మందులు గర్భం ధరించిన స్ర్తిలు వాడకూడదని తల్లి కాబోయే ప్రతి మాతృమూర్తి గుర్తుంచుకోవాలి.

-- మానస