మెయిన్ ఫీచర్

శివశబ్దం ముక్తికారకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘శివం కరోతి శంకరః’ అంటే శుభాలను కలిగించేవాడు శంకరుడు. తనను ఆరాధించినవారికీ తనను నమ్మినవారికీ శివుడు ఆలోచించకుండానే వరాలిస్తాడు. శివునిపూజించిన వారికి లేనిది అంటూ ఏమీ ఉండదు.నిష్కల్మష మనస్కులై శివుణ్ణి మనసారా స్మరించుకొంటే సంసారసాగరాన్ని అవలీలగా దాటుకొని ప్రాపంచిక బంధాలనుండి విముక్తి పొంది శివసాయుజ్యం తప్పక లభ్యమవుతుంది. వేదవాఙ్మయం మేఘములు కేశములుగానూ, మెరుపు రంగుగానూ, ఉరుము గర్జనగానూ, ప్రచండవాయువు ప్రళయ స్వరూపంగానూ రుద్రుని ఊహించి శివుడిని కపర్ది; వ్యోమకేశుడు, నీలినిఖంటి, వర్షీయుడు అన్న పేర్లతో కీర్తించారు.
శివుడు మంగళస్వరూపుడు. శివా అని ఒక్కసారి అన్నా శివుడు అన్నివేళలా తన భక్తుని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటాడు. ‘స్వస్తి శివం కర్మాస్త్వితి’ అనగా కర్మములు శివునిచే కాపాడబడి భద్రంగా ఉంటాయని వేదం చెబు తుంది. శివుణ్ణి ‘సంసార గహన తారకమూర్తి’ అనీ కీర్తిస్తారు. శివుడు అభిషేక ప్రియుడు. కాసిని నీళ్లు శివలింగంపై పోస్తూ శివనామాన్ని జపిస్తే చాలు అఖల సంపదలను అనుగ్రహిస్తాడు.
శివలింగానికి ఆద్యంతాలు లేనట్టే శివుని మహిమలకు కూడా అంతులేదు. ఈ శివయ్యకు బిల్వపత్రం అంటేమహాఇష్టమట. బిల్వపత్రంతో పూజించినవారు శివస్వరూపులే కాని వేరుకాదు. బిల్వ ప్రత వీక్షణ, స్పర్శనం కూడా పుణ్యాన్నిస్తాయ. లోకంలో ఇంతటి మహిమాన్వితమైన వృక్షం మరొకటి లేదు. సాక్షాత్ శివ స్వరూపానికి ప్రతీక బిల్వం. శ్రీహరి లక్ష్మీదేవి ఇరువురు ఒక పర్యాయం మహాదేవుని గురించి తపము చేయసాగారు. వారు అలా తపము చేయు సమయంలో లక్ష్మీదేవి హస్తమునుండి ఒక దివ్య వృక్షము వెలువడింది. ఆ వృక్షమే మారేడు వృక్షము. అదే బిల్వవృక్షం. మాతా లక్ష్మీదేవి హస్తమునుండి వెలువడినది కనుక శ్రీ వృక్షము.
శ్రవణానక్షత్రమున్న శ్రావణమాస సోమవారాలు శివపూజకు ప్రత్యేకమైనవి. శివకేశవులకు అభేధం. శ్రావణ శనివారాలు కలియుగవేంకటేశ్వరునికి, సోమవారాలు కైలాసనాథునికి పూజలు చేయాలని ఐతిహ్యం. పరమశివుని బిల్వ పత్రములతో పూజిస్తే దారిద్య్రం కంటి చూపుమేర కనపడదు.
బిల్వములు ముఖ్యంగా మూడురకములుగా లభించును. అవి ఏక బిల్వం, త్రిదళం, పంచదళం. ఈ మూడింటికి ఒక ప్రత్యేకత ఉంది. ఏక బిల్వం పరమశివ స్వరూపం. త్రిదళం వచ్చి శివుని మూడు కన్నులు, పంచదళ బిల్వము శివుని పంచముఖములు అయిన సద్యోజాతము, వామదేవుడు, తత్పురుషుడు, అఘోరుడు, ఈశానుడు అని భావిస్తారు.
సమస్త లోకాల్లోని పుణ్య తీర్థములు ఈ బిల్వ వృక్షముయొక్క మూల భాగమున నివసిస్తాయ. గంథము పుష్పములతో బిల్వ వృక్ష మూలాన్ని పూజించిన వారు అంత్యకాలమున శివలోకము చేరుతారు. బిల్వ వృక్ష మూలమున శివుని అర్చిం చి దీపారాధన చేసేవారు తత్వజ్ఞాన సంపన్నులవుతారు. మారేడు వృక్షముయొక్క వేర్లు, చెట్టు నీడ ఎంత దూరం వ్యాపిస్తాయో అంత దూరం ఆ నేల పరమ పవిత్రమైందిగా భావిస్తారు. ఎప్పుడూ బిల్వ మూలములందు జలం వుంచితే శివుడు సంతుష్టుడగును. బిల్వవృక్షాన్ని ప్రతిరోజు పూజించిన వారికి కష్టములు దూరమగును. సంతాన ప్రాప్తి కలుగుతుంది. సూర్యోదయమునే శుచి అయి మారేడు చెట్టుకు ప్రదక్షిణ చేసి శివుని బిల్వ దళములతో అర్చిస్తే సమస్త శ్రేయస్సు సుఖశాంతులు లభిస్తాయ. ప్రతిరోజు మండలంపాటు నలభైసార్లు మారేడు వృక్షమునకు శివుని సమేతంగా పూజిస్తే సమస్త నీచగ్రహ శక్తులు సమస్త రోగములు తొలగి మనశ్శాంతి ఆనందం పొందుతారు. ఈ బిల్వ వృక్షం కింద పంచాక్షరి జపించినట్టయితే అశ్వమేధ యాగఫలం సంప్రాప్తిస్తుంది. మారేడు వృక్షం కింద ఉత్తమ బ్రాహ్మణునికి అన్నదానం చేసిన దరిద్రమన్నది జీవితంలో రాదు.
ఇంతటి మహిమాన్వితమైన బిల్వపత్రాలతో శివుని పూజించినవారికి ఇహపరసుఖాలు అబ్బు తాయని వేరుగా చెప్పనక్కర్లేదు కదా.
శివ శబ్దం కల్యాణకరమైన ముక్తినిచ్చు పదం. శివస్తోత్రం పరమ పావనం. శివనామం అనే దావానలంతో సమస్త పాపరాసులూ అనాయాసంగా భస్మమైపోగలవు. శివనామం స్మరిస్తూ అసువులు బాసిన వ్యక్తి ఎన్నో జన్మలుగా చేసిన ఘోర పాతకముల నుంచి విముక్తి పొంది మోక్షగతిని పొందుతాడన్నది కూడా పురాణాలు పల్కుతూన్నాయి. అట్లాంటిమంగళకరుడైన శివుని బిల్వపత్రాలతో పూజిస్తే ఇహపరసుఖాలు లభ్యమవుతాయ.

- గున్న కృష్ణమూర్తి