మెయిన్ ఫీచర్

సగం ఇక్కడ నుంచే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతోషమే సగం బలం. మనిషి ఆరోగ్యం గా ఉండాలంటే మొట్టమొదట సంతోషంగా ఉండాలి. సంతోషం ఎక్కడ ఉంది అన్న ప్రశ్న వస్తోందా? అయతే ఇదిగోండి మీకు సంతోషం పంచే వస్తువులు- సంతోషం అనేది ఎక్కడో ఉండదు. మీలోనే ఉంటుంది. దాన్ని కాస్త బయటకు తీయాలి అంతే. మీ మనసు ఏదోగా అనిపిస్తే కాసేపు మీ పిల్లలతో పిచ్చాపాటి మాట్లాడండి. మీ పిల్లలు కాకపోయనా చుట్టుపక్కల పిల్లలతోనైనా కాసేపు గడపండి. మీరు ఉద్యోగినులు అయితే లంచ్ టైమ్‌లోనో,లేక ఆఫీసు అవర్స్ అయిపోయిన తరువాత కాసేపు మీ కొలిగ్స్‌తో ఆఫీసు, ఇల్లు విషయాలు తప్ప ఏ సినిమా గురించోలేక టీవీ సీరియల్స్ గురించో కాసేపు మాట్లాడండి. అదీ ఇదీ కాదంటే కాసేపు రాజకీయాల గురించి మాట్లాడండి.
సమయం చిక్కగానే మీకిష్టమైన పాటలు వినండి. మీకిష్టమైన పుస్తకం అని చూడక ఏదైనా ఒక మ్యాగ్‌జైన్‌నోలేక మహానుభావుల జీవిత చరిత్రలోఅదీ కుదురకపోతే ఏదైనా కథనో, నవలనో ఏదో ఒక బుక్ చదవండి. మీకిష్టమైన బొమ్మలు గీయండి. ఓ కూనీ రాగం తీయండి. మీకిష్టమైన సినిమా చూడండి. మీకిష్టమైన వాళ్లతో మాట్లాడండి.
ఇవి ఏవీ కుదరకపోతే కాసేపు ఆరుబయట తిరగండి. ప్రకృతిని పరిశీలించండి. ఏదైనా పార్కుకు వెళ్లి అక్కడ చెట్లు, పూలు, కాయలు అక్కడున్న పచ్చిక వీటితో కాసేపు గడపండి. మీ మనసు ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఏదీ మీకు వీలుకానప్పుడు మీ ఫోనే మీకు మంచి నేస్తం అనుకోండి. దానిలో మీకిష్టమైన విషయాన్ని గూగుల్ వెళ్లి అందులో వెతికి చదవండి. లేదా బొమ్మలు చూడండి. మీ మనసుకాదే మీరు ఆనంద డోలికల్లో ఊగుతారు.

--గాయత్రి