మెయిన్ ఫీచర్

ఆహారం విషయంలో అతివల మాటేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాల్సింది ముఖ్యంగా మధ్యతరగతి మహిళలే. సాధారణంగా భారతీయ స్ర్తి తనింట్లో అందరికీ వడ్డించి వారంతా కడుపునిండా తిన్న తరువాత తాను తింటుంది. ఇక్కడే అసలు ఇబ్బంది పడుతోంది. మిగిలింది తినడమో లేక అసలు మిగలేదు ల్లే మంచినీళ్లు తాగి పడుకుందాం అనుకొనేవారు ఎక్కువగా ఉన్నట్టు కొన్ని సర్వేలు చెబుతున్నాయి.
ఇప్పుడు చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు. వారంతా ఆదివారం రాగానే కాస్త తీరికగా ఉంటుంది. మహిళలకు ఈ తీరిక దొరకడం లేదు. ఎందుకంటే ఆదివారం పిల్లలకు భర్తకు కూడా సెలవే. కనుక వారి వారికిష్టమైనవి చేసి పెట్టి ఇంట్లో రాబోయే వారానికి కావాల్సిన పనులు చక్కబెట్టుకుని తాను తినబోయే సరికి నీరసంమనో, లేక అతిథులు రావడమో జరిగి తాను తినడం వాయిదా వేసుకొంటున్నారు. మరికొంతమంది కాసేపు ఏదో తిన్నామనిపించి కాసేపు పడుకుని సాయంత్రం తిందాములే అనుకొంటున్నారట. సాయంత్రం కూడా ఇద తంతు .. ఇలా ఆహారం సరిగా తీసుకోక కొందరు మహిళలు రోగాలను ఆహ్వానిస్తున్నారు.
మరికొంతమంది చేసిన పౌష్ఠికాహారాన్ని ఇంట్లో వారికి పెట్టి తిరిగి వారు మళ్లీ కోరుకుంటారేమో అన్న ఆలోచనతో దాన్ని దాచేసి వీళ్లు సద్ది అన్నం తినడానికి అలవాటు పడిపోతున్నారు. ఇట్లా చేయడం కూడా జబ్బులను ఆహ్వానించడమే.
ఇలా పడతులు ఆహార విషయంలో నిర్లక్షం చేస్తూ పోతే పోషకాహార లేమి జరుగుతుంది. దానితో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అసలే సమాజంలో అసమానతలను ఎదుర్కోవడం ఒక వైపు కష్టంగా ఉంటే ఇంకా ఇలా పోషకాహార లేమితో మరోవైపు మహిళలు అనారోగ్యాల బారిన పడడం ఎంత మాత్రం సబబు అన్న దాన్ని చూసుకుంటూ ఎవరికి వారు వారి ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వారు పని చేసే దాన్ని బట్టి ఆహారాన్నితప్పని సరిగా వేళప్రకారం తీసుకోవాలి.
కొంతమంది సన్నగా ఉండాలంటూ కావాలని ఆహారాన్ని తీసుకోకుండా డైట్ కంట్రోల్‌లో ఉంటున్నాం అంటారు. ఆ డైట్ కంట్రోల్ కూడా ఒక్కోసారి విషమించి అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. కనుక సన్నగా ఉండాలనుకోవడం మంచిదే కానీ సరియైన ఆహారం తీసుకోకపోవడం మంచిది కాదు. సన్నగా కావడానికి నడక, వ్యాయామాలు చేయాలి కానీ తిండి మానకూడదు.
గ్రామీణులే కాక నగరాల్లోను, ఉద్యోగస్థులైన మహిళలూ మగపిల్లలకు ఒక రకమైన ఆహారాన్ని ఆడపిల్లలకు మరోరకమైన ఆహారాన్ని అందిస్తున్నారు. ఆడపిల్లలు చదువుకోవడానికి పంపిస్తున్నా ఆటలు ఆడకూడదనే, స్కూలు తప్ప ఇంకోచోటికి వెళ్లకూడదనే నియమాలు పెడుతున్నారు. వారు ఆటలు ఆడకపోవడం వల్ల కూడా వారిలో శారీరిక మానసిక లోపాలు ఏర్పడుతున్నాయి. ఆడమగ అనే వ్యత్యాసాలు చూపించక ఎదుగుతున్న పిల్లలందరికీ సరియైన సమతులాహారం అందేట్లు చర్యలు తీసుకోవాలి. ఇది అమ్మస్థానంలో ఉన్న మహిళలపైనే ఉంటుంది. కనుక అమ్మలూ పౌష్ఠికాహారాన్ని తీసుకోవడం ఎంత ముఖ్యమో పిల్లలకు అందివ్వడమూ అంతే ముఖ్యం.
మరికొందరు మహిళలు వారాలు, ఉపవాసాలు అంటూ ఆహారాన్ని సరిగ్గా తీసుకోరు. ఇలాంటి మహిళల్లో కూడా నీరసం, రోగ నిరోధక శక్తి తగ్గడం లాంటివి కనిపిస్తాయి. ఒకవేళ ఉపవాసం ఉండాల్సి వస్తే ఆహారానికి బదులుగా పండ్లు పాలు లాంటివి తీసుకోవాలి. అంతేకానీ కడుపు మాడ్చుకోకూడదు. అపుడే వారు వారి కుటుంబం కూడా హాయిగా ఉంటుంది.

--సుజాత