మెయిన్ ఫీచర్

పిల్లలతో మాట... భవితకు బాట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలను అప్పుడప్పుడూ కాదు ఎప్పుడూ పట్టించుకోవాలి. వారిది చిన్న మనసు. ఉత్తిగనే మనసు చిన్నబుచ్చుకుంటారు. బుంగమూతి పెట్టేసుకొంటారు. నన్ను పట్టించుకోవడం లేదని ఫిర్యాదులు కూడా చేస్తుంటారు. ఇవన్నీ చిన్నప్పుడు మామూలే అనుకొంటే పొరపాటు. ఇవే పెద్దయ్యాక పిల్లల్లో వ్యక్తిత్వ లోపాలుగా పరిణమిస్తాయి. మా అమ్మ చిన్నప్పుడు నన్ను బాగా చూసుకొనేది కాదు అని పెద్దయ్యాక పక్కవారికి చెబుతుంటారు. అంటే వారి మనసుపై ఆ ప్రభావం ఎంతగా ఉందో ఊహించుకోవచ్చు.
సాధారణంగా మొదటి పిల్లలను ముద్దుచేస్తారు. తల్లిదండ్రులే కాక ఇంట్లో వారు వీధిలో వాళ్లు కూడా ముద్దు చేస్తుంటారు. ఇది సహజమే. కానీ రెండవ వారిని ఇంట్లోకి ఆహ్వానించాక సీను మారిపోతుంది. మొదటి వారి ప్రత్యేక దృష్టి రెండవ వారిపై మారిపోతుంటుంది. ఇది మామూలే. రెండవ వారు చిన్నపిల్లలు, శిశువు సంబంధించిన పనులు వారిగురించి ఆందోళన అమ్మకు ఉంటూ ఉంటుంది.
రెండవ వారిని చూడడంలో మొదటి వారిని నిర్లక్షం చేయడం ఉండదు కానీ నువ్వు ఇది చేసేయ్ అనేస్తుంది అమ్మ. చాక్లెట్స్ కావాలా? అదిగో ఆ ఫ్రిజ్‌లో ఉన్నాయి తీసుకో. నేను తమ్ముడికి పాలు పడుతున్నాను అంటుంది. ఇది నిజమే కావచ్చు. ఆ మొదటి బిడ్డకు అది అవమానంగా అనిపిస్తుంది. తనను చూడడం లేదని అందరూ ఇప్పుడు పుట్టిన బిడ్డనే చూస్తున్నారని అనుకొంటారు.
కొందరు పిల్లలు తమ్ముళ్లను, లేదా చెళ్లెల్లను శత్రువుల్లాగా కూడా చూస్తారు. నిన్ను మాత్రమే అమ్మ చూస్తుంది. నాకు తెలుసులే అనేస్తుంటారు. అందుకే జాగ్రత్తలు తప్పనిసరి.
ముందు పుట్టిన బిడ్డకు గర్భిణిగా ఉన్నప్పటి నుంచి రాబోయే తమ్ముడి గురించో లేక చెల్లెలు గురించో చెబుతూ ఉండాలి. అపుడే వారు రెండవవాళ్లపై ప్రేమను పెంచుకుంటారు.
వీలైతే సీసాతో పాలు పడుతున్నట్లు అయితే మొదటి బిడ్డను జాగ్రత్తగా చూడమని చెప్పాలి. నువ్వు పెద్దవానివి కనుక నువ్వే ఈ చిన్నవాడిని చూడాలి అని చెబుతుండాలి.
ఇలా చేస్తుంటే చదువుకునే వయస్సు వచ్చినపుడు ఇద్దరూ కలసి చదువుకుంటారు. ఒకరికొకరు చెబుకుంటారు. ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించడమే కాదు రెమ్మలు కొమ్మలు కూడా వేస్తుంది. అదే జీవితాంతం ఉండిపోతుంది.
ఎవరికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను వారికి ఇస్తూనే ఉండాలి. మొదటి బిడ్డ కోసం ప్రత్యేక శ్రద్ధ తల్లిదండ్రులిద్దరూ పంచాలి. స్కూల్‌కు వెళ్లే వయస్సు ఉంటే మరింత జాగ్రత్త తీసుకోవాలి. స్కూలులో పేరెంట్స్ మీటింగ్‌కు తప్పనిసరిగా హాజరు కావాలి. లేకపోతే అదిగో నేను చెప్పాను కదా. మీకు నేను అక్కర్లేదు. ఎప్పుడూ చెల్లెలు ఉంటే చాలు అనేస్తాడు మొదటి బిడ్డ. ఈ మాటలకు రాకుండా తల్లే ఎక్కువ బాధ్యత తీసుకొని చూడాలి. రెండవ వారి ముందు పెద్దవాళ్లను తిట్టకూడదు. నవ్వులాటకైనా వారిని ఎద్దేవా చేయకూడదు. ఇది కూడా వారి వ్యక్తిత్వలోపంగా పరిణమిస్తుంది.
పిల్లలు చదువుకునేటపుడు వారికి కావాల్సిన పెన్సిల్, రబ్బరు, పుస్తకాలు ఇలాంటి వన్నీ వారికి ఎప్పుడడిగితే అప్పుడు అందిస్తూ ఉండాలి. మొదటి బిడ్డనే రెండవ బిడ్డ కోసం ఏం చేస్తే బాగుంటుందో చెప్పమని కూడా అడగాలి. అపుడు వారు పెద్దరికం వహించి సలహాలిస్తారు. అవి ఒకవేళ పిల్లచేష్టగా అనిపించినా వారి ముందు నవ్వకుండా నిజమే చాలా బాగుంది అనేయాలి. వారిని దగ్గర తీసుకొని వారు చేసే పనులను భేష్ అని మెచ్చుకుంటూ ఉండాలి.
వారికోసం పజిల్ బుక్స్, లేదా ఇండోర్ గేమ్స్ అన్నీ ఇస్తుండాలి. ఇవి అన్నీ నువ్వు నేర్చుకుని తమ్ముడికి నేర్పించాలి అని కూడా చెబుతుండాలి.
ఇద్దరినీ అసలు పోల్చి చూడకూడదు. వారిద్దరు అంటే మీకు ఎంత ముఖ్యమో కూడా చెప్పాలి. వారికి ఏదైనా నేర్పిద్దాం అనుకొంటే మెల్లగా చెప్పాలి. ఒకటికి నాలుగు సార్లు అర్థమయ్యేట్టు చెప్పాలి. కానీ విసుగు తెచ్చుకోకూడదు. నువ్వు అయితే ఇలా చేసేవాడివి, ఇప్పుడు చూడు వీడు ఎంత తెలివిగా చేస్తున్నాడో అన్నారంటే చిక్కులు కోరి తెచ్చుకున్నట్టు అవుతుంది. కనుక చాలా జాగ్రత్తలతో ఇద్దరు పిల్లల్ని పెంచాల్సి వస్తుంది. పిల్లలంటే కేవలం చదివించడం పెద్దచేయడమే కాదు వారితో పెద్దలూ ఆడుతూ పాడుతూ ఉండాలి. వారి స్కూల్‌లోనో ఆడుకునే చోటనో ఎక్కడైనా వారికేదైనా సమస్యలున్నాయా అని తెలుసుకోవాలి. కొందరు పిల్లలు మొండిగా ఉంటారు. ఎన్ని సార్లు చెప్పినా వినరు. అలాంటి వారికి మనమే చేసి చూపించి లాభాలను వివరించాలి. అపుడు వారు మీ మాటను ఆచరించడానికి ముందుకు వస్తారు.

- మాగంటి రాధిక