మెయిన్ ఫీచర్

రాఖీ ప్రాశస్త్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొంతమంది పండితులు శ్రావణ పూర్ణిమనాడు రాజాస్థానాలకు, జమీందారుల దగ్గరకు వెళ్లి వేదాశీర్వాదాన్ని చదివి వారి దగ్గర నుంచి పారితోషకాలను పుచ్చుకునేవారు. వారిని శ్రావణీకులు అనేవారు. ఈ శ్రావణీకులే రాజరిక వ్యవస్థ ఉన్నకాలంలో గోవులను, మునులను, బ్రాహ్మణులను, సర్వ జనులను కాపాడి శాంతిని కూర్చవలసిందిగా రాజుల నుదుట బొట్టుపెట్టి తీపి తినిపించి రక్షణ మంత్రాన్ని పఠిస్తూ రాజుల దక్షిణ హస్తానికి రక్ష కట్టేవారు. నేడు ఆ రక్షనే అక్కచెల్లెళ్లు అన్నదమ్ములకు కడుతున్నారు. ఆ రక్షాబంధమే రాఖీగా మారింది.

శ్రావణ పౌర్ణిమనే రాఖీ పూర్ణిమ. రాఖీ అంటే తోరము. తోరం పట్టుదారముతో లేదా నూలుదారంతో చేయబడుతుంది. రాఖీ అనేది ఒక ఆభరణం లాంటిది. రంగుదారంతో లేదా కాగితంతో చేసి, దానికి తోరం జోడించి, దానిని సోదరి సోదరుని ముంజేతికి కట్టడం సాంప్రదాయం. బొట్టుపెట్టి హారతినివ్వడం, సోదరుడు, సోదరికి కట్నకానుకలు సమర్పించడం ఆచారం.

‘‘హయగ్రీవ జయంతి‘‘గా, ‘‘జంధ్యాల,‘‘,‘‘రాఖీ’’,‘‘నార్లీ’’ పూర్ణిమగా పేరెన్నిక గన్న శ్రావణ పౌర్ణమి సర్వజనులకు పర్వదినం. ఉపవాసాలకు ఉద్దిష్టమైన పండుగ కాక, హిందువులలో అన్ని తరగతుల వారూ నిర్వహించుకునే పర్వం ఇది. వర్షాకాలపు రాకకు సంతసిస్తూ, మధుర పదార్థాలు భుజించడం అనుసరణీయమైన ఆచారం. వరుణ దేవుని కరుణకోసం కొబ్బరి కాయలు సమర్పించడం చేత ‘నార్లీ’ లేదా ‘నారికేళ’ పూర్ణమి అని మరో పేరుంది. దక్షిణ భారతావనిలో శ్రావణ పూర్ణిమను ‘పౌవతి పౌర్ణమి’ అంటారు. ఆ రోజున విష్ణు, శివ, గణేశులను పూజిస్తారు. ముంబాయి ప్రాంతంలో నార్లీ పూర్ణిమ అనబడే ఈ దినం నాడు వరుణుని కరుణ కోసం సముద్రుని పూజించే ఆచారం ఉంది. ఆ రోజులలో సముద్రం ప్రశాంతంగా ఉంటుందని నమ్మకం కనుక పూర్వకాలంలో సముద్రాంతర వర్తకానికి ఈ రోజునే ప్రారంభించే వారు, తిరిగి రావడానికి ఈరోజునే ఎంచుకునే వారు. యజ్ఞోపవీతాలు, నారికేళాలు శ్రావణ పూర్ణిమ నాడే సముద్రంలో పడవేసేవారు. పూర్వకాలంలో శ్రావణ పూర్ణిమనాడు ఉపాకర్మానంతరం వేదవిద్య ప్రారంభించడం జరిగేది. ఉపాకర్మ పండుగకాక అధ్యయయానికి సంబంధించిన కర్మ. ఉప నయనమనగా అదనపు కన్ను. గురువు తన ప్రజ్ఞాప్రాభవముల చేత వటువునకు జ్ఞాన నేత్రమును తెరిపించడమన్నది పరమార్థం. యజ్ఞం, ఉపవీతంతో కలిస్తే యజ్ఞోపవీతం. ఉప వీతమంటే దారము. యాగకర్మచేత పునీతమైన మూడు పోచల దారం. సృష్టి, స్థితి, లయకారులైన త్రిమూర్తులను సూచించేవి ఒక్కో ముడిలోని మూడు తాళ్ళు. జంద్యాల పౌర్ణమి నాడు చేయు కర్మనే ఉపాకర్మ. మాతా పితరుల వల్ల ఏర్పడేది ప్రథమ జన్మకాగా, వౌంజీ బంధనం వల్ల ఏర్పడునది ద్వితీయ జన్మ అయినందుకే ‘‘ద్విజులని’’ పేరు. శ్రావణి పర్వాన్ని ద్విజులు వేద శాఖలకు చెందిన రుషుల అనుగ్రహానికై రుషి పూజ, రుషి తర్పణాలు చేస్తారు. శతపథ బ్రాహ్మణం ప్రకారం గౌతమ, భరద్వాజ, విశ్వామిత్ర, జమదగ్ని, వశిష్ఠ, కశ్యప, ఆత్రిలను సప్త రుషులు అంటారు. అయితే మరీచి, అత్రి, అంగీరస, పులహ, క్రతు, పులస్త్య, వసిష్ఠులను సప్త రుషులుగా మహాభారతం చెపుతున్నది. వేదకాండర్షుల అనుగ్రహం ఉపాకర్మానుష్ఠానం చేయ కలుగుతుంది. సంవత్సర పాప నాశనానికి విరజాహోమం చేస్తారు. ‘‘శ్రౌతస్మార్త నిత్య నైమిత్తిక కామ్య కర్మానుష్ఠాన యోగ్యతా సిద్ధ్యర్థం నూతన యజ్ఞోపవీత దారణం’’ నిర్దేశితమైనది. వేదశాస్త్ర పురాణేతిహాసాది సమస్త వాజ్మయార్థం పితృతర్మణం, బ్రహ్మయజ్ఞం చేస్తారు. ఉపాకర్మకు యజుర్వేదులకు పౌర్ణిమ తిథి, రుగ్వేదులకు శ్రవణ నక్షత్రం, సామవేదులకు హస్తా నక్షత్రం ప్రధానాలు. శ్రావణంలో ఉపాకర్మ కారణాంతరాలవల్ల చేయలేకపోతే ఆషాఢ లేదా భాద్రపద పౌర్ణమిల నాడు చేస్తారు.

రాఖీ పౌర్ణమి ప్రాశస్త్యం

సర్వరోగ ఉపశమనం, సర్వాశుభ వినాశనం కోసం ధర్మజుడు శ్రీకృష్ణుడిని ఉపాయం అడుగగా, రక్షాబంధన విధి ఉపదేశించినట్లు, దేవాసుర యుద్ధంలో ఇంద్రునికి ఇంద్రాణి రక్షాబంధంనం చేసి, విజయం సాధింప చేసినట్లు శ్రీకృష్ణుడు వివరించిన సందర్భం పురాణ కథనం. రక్షాబంధనం భార్య, భర్తకు కట్టాలని ఉన్నా, ఆచరణలో సోదరియో, కూతురో కట్టే ఆచారాన్ని వ్రతోత్సవ చంద్రిక వివరిస్తుంది. శ్రావణ పౌర్ణిమనే రాఖీ పూర్ణిమ. రాఖీ అంటే తోరము. తోరం పట్టుదారముతో లేదా నూలుదారంతో చేయబడుతుంది. రాఖీ అనేది ఒక ఆభరణం లాంటిది. రంగుదారంతో లేదా కాగితంతో చేసి, దానికి తోరం జోడించి, దానిని సోదరి సోదరుని ముంజేతికి కట్టడం సాంప్రదాయం. బొట్టుపెట్టి హారతినివ్వడం, సోదరుడు, సోదరికి కట్నకానుకలు సమర్పించడం ఆచారం. రాఖీ ప్రాధాన్యతను బట్టే ఒక స్ర్తి, పురుషునికి రాఖీ పంపి లేదా కట్టి ఆతని రక్ష కోరే ఆచారం ఏర్పడింది. దానిని అందుకోవడం తోనే ఆతడు ఆమెకు సోదరుడై రక్షకుడవుతాడని భావన.

- సంగనభట్ల రామకిష్టయ్య...9440595494