ఐడియా

వంటశాలే బ్యూటీ పార్లర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొట్టకు విరామం లేకుండా మహిళ కిచెన్‌లో టిఫిన్లు, భోజనాలు, ఆరగా ఆరగా కాఫీలు, టీలు అందించే గృహిణికి బ్యూటీ పార్లర్‌కి వెళ్ళే ఆస్కారం లేదు. ఇంట్లో దొరికేవాటితోనే ముఖం కాంతిగా వుండేందుకు చిట్కాలు ఇవి.
బచ్చలి ఆకులను పేస్టులా చే సి ముఖానికి రాసుకుంటే ము ఖం కాంతివంతంగా ఉండటమే కాక మొటిమలు రాకుండా ప్రివెంటివ్‌గా వుం టుంది.
పెరుగును ముఖానికి, ఒంటికి రాకుంటూ వుంటే శరీరం కాంతివంతంగా వుండి ముడతలు పడకుండా వుంటుంది.
పాలు, తేనె, బాదం పప్పు పొడిలో కలిపి ముద్దగా చేసి చర్మానికి రాసుకుంటే ఎండిన ముఖం సున్నితంగా, అందంగా మారుతుంది.
ప్రతిరోజూ దూదిని మజ్జిగలో ముంచి ముఖానికి రుద్దుకొని పావుగంటయ్యాక చల్లని నీటితో ముఖం కడుక్కుంటే ముఖంలో గరుకుదనం పోయి మృదువుగా వుంటుంది.
పనిచేస్తున్నపుడుగాని, ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడుగాని, ప్రతి గంటకోసారి చన్నిళ్ళు లేదా గోరువెచ్చని నీటిని మొహంమీద చిలకరించుకుంటూ వుండాలి.
ప్రతిరోజూ కాసేపు నిర్మలంగా కూర్చుని ధ్యానం చేయడం మంచిది. ఇష్టదేవతా పద్యాలు, శ్లోకాలు నోటితో అనుకుంటూ మెదడు ప్రశాంతంగా వుండాలి.
ఇంట్లో శ్రమించినా, రెస్ట్ తీసుకున్నా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పూట తేలిక వ్యాయామం చేయడం చాలా అవసరం.
బట్టలుతికే సమయాల్లో చేతులకు రబ్బర్ గ్లౌజ్స్ ధరించడం అవసరం. కాళ్ళని/ పాదాల్ని తరచూ నీటిలో తడుపుతుండటం మంచిది కాదు. తడిసిన భాగాల్ని ఎప్పటికప్పుడు పొడి టవల్‌తో తుడుచుకుంటూ వుండాలి. అప్పుడప్పుడు చేతులకు, పాదాలకు మాయిశ్చరైజింగ్ లోషన్‌ను కాని, బేబీ లోషన్‌ను కాని పట్టిస్తుండాలి.
వంటింట్లో అలసిపోయిన స్ర్తిలు వెంటనే విశ్రాంతి తీసుకుంటూ కనురెప్పలపై దోసకాయ చక్రాలని కాసేపు ఉంచుకోవాలి. దీనివల్ల కళ్ళు మంటలు తగ్గుతాయి. కాసేపు మైండ్ ప్రశాంతంగా వుంటుంది.
జాగింగ్, వాకింగ్, సిటప్స్, స్టమక్ ఎక్సర్‌సైజ్‌లు, షోల్డర్ ఎక్సర్‌సైజులు, బాక్‌బోన్, నెక్ ఎక్స్‌ర్‌సైజులు స్ర్తిలు గాఢంగా ఊపిరి పీల్చుతూ మెల్లిగా వదులుతూ చేయాలి.
మేకప్ జాగ్రత్తలు, ముఖానికి చర్మానికి, జిడ్డు కారే ముఖాలకి, సబ్బుల వాడకం (లిక్విడ్ హెర్బల్ సోప్స్) ఎన్నో ఇంకో వ్యాసంలో వివరిస్తాను.
ఏదేమైనా అడ్డమైన లోషన్స్, సోప్స్, మేకప్ సామాన్లు, ఫేషియల్స్ వాడరాదు అని గ్రహించాలి.

- బి.విజయలక్ష్మి