మెయిన్ ఫీచర్

అమ్మ ప్రేమకు నిదర్శనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మతనంతోనే అసలైన పరిపూర్ణత వస్తుందని భావిస్తుంది మహిళ. అందుకే మరణానికి కూడా సిద్ధబడి బిడ్డను కంటుంది అమ్మ. తన శరీరాన్ని చీల్చుకు పుట్టిన బిడ్డను కళ్లారా చూసుకుని అప్పటివరకు పడిన కష్టాన్ని మరిచిపోయి మురిసిపోతుంది తల్లి. అందుకే పెళ్ళైంది మొదలు సంతానం కోసం ఎదురుచూస్తుంది. మహిళే కాదు ఆ ఇంట్లోని వారు కూడా పెళ్ళైంది మొదలు కొత్తతరం కోసం ఎదురుచూస్తారు. అమ్మాయి శుభవార్త ఎప్పుడు చెబుతుందా? అని అడుగుతూ ఉంటారు. మహిళకు సంతానభాగ్యం లేకపోతే అదో శాపంగా భావిస్తారు. కానీ నేడు శాస్తవ్రిజ్ఞానం ప్రతిసృష్టి అవకాశాలను పెంచింది. ప్రపంచవ్యాప్తంగా సంతాన సాఫల్య వైద్యం అనేది ఓ విస్తృత మార్కెట్. దానికి పెట్టుబడి మాత్రం తల్లి కావాలనే ఆకాంక్షే! తల్లికావడానికి ఐవిఎఫ్ నుంచి సరోగేసి దాకా అనేక మార్గాలు. అయితే గర్భం దాల్చడం, చివరిదాకా ఆ గర్భాన్ని కాపాడుకుని బిడ్డను కనడం ఎంత కష్టమో చెబుతుంది సోషల్ మీడియాలో వైరలవుతున్న ఈ ఫొటో..
సోషల్‌మీడియాలో సంచలనంగా మారిన ఆ ఫొటోలో ఏముందంటే.. రోజుల బిడ్డ.. ఆ బిడ్డ చుట్టూ హృదయాకారంలో పేర్చిన సిరంజీలు.. అమ్మ ప్రేమకు, కష్టానికి చిహ్నాలు ఆ సిరంజీలు. అవి ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా పదహారు వందలా పదహారు సిరంజీలు.. నాలుగు సంవత్సరాలుగా.. అంటే బిడ్డ కావాలని డాక్టరు దగ్గరికి వెళ్లినప్పటి నుండి బిడ్డ పుట్టేవరకు ఆ తల్లి వాడిన ప్రతి ఇంజక్షన్‌ను దాచి ఉంచారు వారు. ఒక్క బిడ్డను కనడానికి వాళ్లు పడిన పాట్లకు అవి సూచికలు.. ఆమె భరించిన నొప్పి, వేదనకు అవి గుర్తులు.. సిరంజీలతో శరీరం తూట్లు పడుతున్నా లెక్కచేయకుండా బిడ్డను కనడంపై మనసును లగ్నం చేసింది ఆ తల్లి. ఆమె వేయించుకునే ప్రతి సిరంజీని దాచి ఉంచింది. బిడ్డ పుట్టాక ఆ సిరంజీలన్నింటినీ ఒక్కచోట చేర్చి, బిడ్డను మధ్యలో పడుకోబెట్టి సిరంజీలను హృదయాకారంలో పేర్చి ఈ అపురూపమైన ఫొటో తీయించి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు ఆ తల్లిదండ్రులు. అలా ఆ ఫొటో సోషల్‌మీడియాలో వేలషేర్లతో, లక్షల లైకులతో వైరల్ అయింది.
ఈ ఫొటోలో ఉన్న పాప పేరు లండన్ ఓనియల్. వీరిది లండన్. పాప తల్లిదండు లు పెట్రీషియా, కింబర్లీ ఓనియల్.. ఆరు సంవత్సరాల క్రితం పెట్రీషియా, కింబర్లీలు ఇద్దరూ ప్రేమలో పడ్డారు. కలిసి ఉంటున్నారు. వారిద్దరికీ సంతానం కావాలని కోరుకున్నారు. అయితే సంతానం కలగలేదు. నిజానికి ఆమెకు అప్పటికే తన పాత సంబంధం వల్ల ఏడేళ్ల కూతురుంది. అతనికి కూడా పాత సంబంధం వల్ల పధ్నాలుగేళ్ల కొడుకున్నాడు. కాబట్టి ఇద్దరిలోనూ ఎటువంటి లోపం లేదు. కానీ సంతానం మాత్రం కలగడం లేదు. కొన్నాళ్లు ఎదురుచూసిన తరువాత ఇద్దరూ ఫెర్టిలిటీ సెంటరుకు వెళ్లారు. డాక్టరు సాయంతో ప్రయత్నాలు, టెస్టులు చేశారు. వారి ప్రయత్నం సక్సెస్ కూడా అయ్యింది. కానీ పెట్రీషియాకు బ్లడ్ క్లాటింగ్ సమస్య ఉండటంతో ఆ గర్భం నిలబడలేదు. తరువాత ఐవీఎఫ్ ద్వారా సంతానం ప్రయత్నం చేద్దామని చెప్పాడు డాక్టర్. వీర్యకణాల్ని, అండాన్ని ట్యూబులోనే ఫలదీకరణ జరిపించి గర్భంలోకి ప్రవేశపెట్టడాన్ని ఐవీఎఫ్ అంటారు. రోజూ బ్లడ్ థిన్నర్ ఇంజక్షన్లు, ఐవీఎఫ్ సిరంజ్‌లు.. కానీ ఫలితం లేదు. డాక్టరును మార్చారు. అనేకానేక ప్రయత్నాలు చేశారు. మూడుసార్లు ఫలదీకరణ పిండాన్ని గర్భంలోని ప్రవేశపెట్టారు. కానీ కడుపు నిలవలేదు. చాలా ప్రయత్నాలు, పరీక్షలు, చికిత్సలు.. తర్వాత కడుపు నిలబడింది. అయినా సరే నెలలు నిండేదాకా టెన్షనే.. ఇంజెక్షన్లూ, మందులతో ప్రసవ సమయం రానే వచ్చింది. ప్రసవం దాకా పడిన యాతన, బాధ ఫలించి చివరకు ఆగస్టు 3న పండంటి బిడ్డకు జన్మనిచ్చింది పెట్రీషియా. పుట్టిన బిడ్డకు లండన్ ఓనియల్ అనే పేరు పెట్టారు ఆ తల్లిదండ్రులు. తరువాత ఆ తల్లిదండ్రులకు వచ్చిన ఆలోచన ఫలితమే ఈ ఫొటో. అప్పటివరకు ఆమె వాడిన సిరంజీలను అన్నింటినీ పాప చుట్టూ హృదయాకారంలో పేర్చి ఫొటో తీసి ఆగస్టు 10న సోషల్ మీడియాలో పోస్టు చేశారు ఆ తల్లిదండ్రులు. అదీ ఈ ఫొటో వెనుక దాగి ఉన్న మాతృప్రేమ. మరి ఇలాంటి మాతృప్రేమకు షేర్లు, లైకులు రాకుండా ఉంటాయా.. చెప్పండి!
*