మెయిన్ ఫీచర్

భావనకు రూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతునికి రూపం లేదు. నామం లేదు. భగవంతుడు నిస్సంగుడు. గుణరహితుడు. అవ్యక్తుడు. భక్తుడు కోరుకున్న విధంగా తన్ను తాను సృజియించుకోగల నేర్పరి కూడా ఆ భగవంతుడే.
భక్తి అనే సాధనం చేత రూపనామాలు లేని భగవంతుని మెప్పించి తాను కోరుకున్న విధంగా రూపుకట్టించుకని తన చర్మచక్షువుల ఎదుటి నిలబెట్టుకోగల శక్తి సంపన్నుడు భక్తుడు.
భక్తుడికి, భగవంతునికి అబేధం. భక్తి సామ్రాజ్యంలో భగవంతుని ఏ రూపుతోనైనా ఏ బాంధవ్యంతోనైనా భావించవచ్చు. భగవంతుడు భావనారూపి. కోరుకున్న భావనకు అనుగుణంగా వ్యక్తమయ్యేవాడే భగవంతుడు.
కోరిన కోర్కెలు ఈడేర్చేవాడు భగవంతుడే. ఇతడు అధికుడని కానీ ఇతడు అనల్పుడని కానీ భగవంతునికి ఏ ప్రాణి మీద ఆసక్తి జనించదు. భక్తునికే నాకీ రూపంలోని భగవంతుడే సర్వ సృష్టికి కర్తకర్మక్రియ అనే భావం ఉంటుంది. ఆ భావానికి తగ్గట్టుగానే భగవంతుని రూపలావణాదులను అతడు కోరుకుంటాడు.
గుణాతీతుడైన భగవంతుడిని గుణసహితులైన భక్తులు సేవిస్తుంటారు. రజస్తమోగుణమున్న భక్తులు ఆర్భాటంగా భగవంతుని పూజిస్తే సత్వగుణమున్న భక్తులు భగవంతుని సాత్విక రూపంలో సత్వగుణంతో కొలుస్తారు.
ఎవరేవిధమైన కోరికలతో పూజించినా భగవంతుడు భాగవతులను సేవించేవారితోను, మానవత్వం కలిగిన వారితోను తోడునీడగా ఉంటాడు. వారి కోరికలను ఈడేరుస్తాడు. స్వార్థ బుద్ధి విడనాడి సర్వమూ ఈశ్వరమయంగా భావించేవారికి తన్ను తాను దత్తం చేసుకొంటాడు భగవంతుడు.
రూపం లేకపోయినా భక్తుని కోసం రూపం దాలుస్తాడు. హిరణ్యకశ్యపుడు తనను నరమృగరూపంలో వచ్చి సంహరించాలి అని కోరుకుంటే శ్రీమన్నారాయణుడు వాని కోర్కెననుసరించి నరసింహుడై వచ్చి హిరణ్యకశ్యపుని సంహరించాడు.
మానవుడుగా వచ్చి తనను ఎదుర్కోవాలని, తనతో పోరాడి మరీ మరణదండన విధించాలనుకొన్న రావణాసురుని కూడా శ్రీమన్నారాయణుడు శ్రీరాముడై వచ్చి పదితలల రావణునితో పోరి మరీ సంహరించాడు.
ఇలా ఎవరు ఏవిధంగా కోరుకుంటే ఆ విధంగా వారిని కరుణించిన కరుణాసింధువు భగవంతుడు. అమృతోత్పాదన కోసం దేవదానవులు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని క్షీరసాగర మధనం చేస్తున్నపుడు తమకు క్షీరసాగర మధనం చేయడం రావడం లేదని వాపోతే వారికోసం తాను కూర్మరూపాన్ని ధరించి మందర పర్వతానికి కుదురుగా నిలిచాడు.
ఆ భగవంతుడే మాలో ఒకడుగా ఉంటూ మేము చేసే మాయలను ఎదుర్కొంటూ మమ్ము సంహరించాలనుకొన్న దానవులను కృష్ణ రూపంలో దేవకీదేవి నందుల కుమారుడిగా పుట్టి యశోదానందనుడుగా పెరుగుతూ ఎందరో రాక్షసులను సునాయాసంగా మట్టుపెట్టాడు. ఎందరి భక్తులకో కోరుకున్న రూపంలో లీలావిలాసాలను చూపెట్టాడు.
ఆ భగవంతుణ్ణి నేడు కలియుగంలో కూడా సత్వగుణసంపన్నులకు, సత్యథారణ చేసేవారికి, ధర్మం తప్పనివారికి అండదండలనిస్తూ ఎల్లవేళలా కాపాడుతున్నాడు.
కనుక మానవులందరూ సదా ధర్మాన్ని ఆచరిస్తూ సత్యాన్ని ధారణచేసి ఏమరక భగవంతుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి.

- చివుకుల రామమోహన్