మెయిన్ ఫీచర్

పిల్ల్లల్లో సామాజిక స్పృహ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలందరికీ బొమ్మలంటే చాలా ఇష్టం. కొత్త బొమ్మ వారి చేతికి అందింది అంటే అసలు దాని వదిలిపెట్టకుండా ఆడుకుంటూ ఉంటారు. అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా అంతే. ఇంకా కొంతమంది పిల్లలైతే ఆ కొత్త బొమ్మ ఎలా తయారైంది అనే ఆసక్తిని కూడా చూపిస్తుంటారు. సాధారణంగా పాపాయిలు, టెడ్డీబేర్స్ లాంటి బొమ్మలైతే వాటికి దుస్తులు కుట్టుటం రకరకాల టోపీలు తయారు చేసి పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు.
ఇంకాకొంతమంది కీ ఇస్తే నడిచే బొమ్మలతో ఆడుకోవడానికి ఇష్టాన్ని చూపిస్తుంటారు. నేడు వీడియో గేమ్స్ ఆడడంలో మునిగిపోతున్నారు. కొత్తదేదైనా వీడియో గేమ్ వస్తే చాలు ఎవరు నేర్పించకుండానే వారే ఎలా ఆడాలో కూడా తెలుసుకొనే బుడతల్ను మనం చూస్తుంటాం.
అట్లాంటి బుడతడు రియాన్. ఈ రియాన్ వాళ్ల అమ్మ టాయ్స్ రివ్యూ చానల్ లో నడిపేది. కొత్తబొమ్మలతో ఆడుకోవడమెలా నో ఆమె ఆ వీడియో చానల్‌లో చూపించేది.
అయితే కొత్త బొమ్మ తేగానే ఆమె కొడుకు రియాన్ చాలా చిన్న వయస్సులోనే ఆసక్తితో బొమ్మను చూడడం, దానితో ఆడుకోవడం చూసి అసలు నా కొడుకుతోనే వీడియో చేస్తే ఎలా ఉంటుంది అని అనుకొని ఆపనికి శ్రీకారం చుట్టింది.
అంతే రియాన్ కు రెక్కలొచ్చినట్టు అయింది. అమ్మతో కలసి ఆడుకోవడం పిల్లలెవరికైనా వెన్నతో పెట్టిన విద్యనే కదా. అట్లానే రియాన్ తన బొమ్మలు, అమ్మ తో చేసిన వీడియోగేమ్స్‌ను చానల్‌లో అప్‌లోడ్ చేసేస్తున్నారు. అంతే రియాన్ టాయ్స్ రివ్యూ పేరిట వచ్చే యూట్యూబ్ చానల్‌ను అందరూ ఆసక్తితో చూడడం మొదలుపెట్టారు. అట్లానే ఆ ఛానల్ ద్వారా డబ్బులు సంపాదించడం కూడా మొదలైంది. అట్లా ఇపుడు అధికంగా సంపాదించేవాళ్లల్లో రియాన్ పేరు ఒకటి.
చైన్నై నగరంలో అపార్ట్‌మెంట్స్ లో పిల్లలంతా చేరి వారి దగ్గర ఉన్న వైరేటి బొమ్మలతో ఒక ఎగ్జిబిషన్‌లాగా చేస్తున్నారు.ట. ఆ ఎగ్జిబిషన్‌ను చూడడానికి వచ్చేవారి దగ్గర గేట్ ఫీజు వసూలు చేస్తున్నారఉ. అట్లా వసూలు అయిన డబ్బును అనాథాశ్రమాలకు ఇస్తున్నారు. పిల్లలు అరేంజ్ చేసిన ఎగ్జిబిషన్స్‌లో వారు తయారు చేసిన బొమ్మలను కూడా పెట్టి పెద్దలను కూడా ఆకర్షింప చేస్తున్నారు.
అట్లానే ఇంకొంతమంది పిల్లలు అపార్ట్‌మెంట్స్ లోప్రతి ఇంటికి వెళ్లి వారి దగ్గర మిగిలిన ఆహార పదార్థాలను రోజు తీసుకొని వచ్చి బిచ్చగాళ్లకు ఇస్తున్నారు.
ఇలా పిల్లలంతా ఏదో ఒక సామాజిక బాధ్యతను తీసుకోవడం రాబోయే రోజులకు మంచిపరిణామం అని మానసిక వైద్యులు అంటున్నారు.

- లక్ష్మీ ప్రియాంక