మెయిన్ ఫీచర్

దైవచింతన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతమైన విశ్వంలో ఒక జీవి, అదే ఏ జీవికి లేని ఆలోచన, మాట్లాడటం మొదలైన లక్షణాలు కలిగివుండటం విశేషణం. ఈ విశేషమే మనిషిని జ్ఞానమువైపునకు నడిపించాలి. కాని జరుగుతున్నదేమిటంటే పురోగమనం కంటే తిరోగమనమే జరుగుతోంది.
మనిషిగా పుట్టాక జీవించడం కోసం జీవులందరికి ఆహారం అవసరం.
పుట్టినది మొదలు తిండి తాపత్రయం తర్వాత నిద్ర అవసరం. ఈ రెండూ తీరితే సరికాదు కదా. వీటిలో వివిధ రకాలకై ప్రయత్నం, మనిషి జన్మ దానికి తగిన లక్ష్యము ఏమీ లేకుండానే జీవనం నచ్చినపుడు నిద్రలేవడం, పగలును రాత్రి చేయడం, రాత్రిని పగలు చేయడం, ఆ విధంగానే తిండి వేళలు కూడా.
పుట్టిన ప్రతి జీవికి కష్టాలనేవి సామాన్యం. మనిషి మాత్రం ఎవరికివారు తను మాత్రమే కష్టపడుతున్నాననే భ్రమ కలిగి జీవిస్తుంటారు. ఒక్కొక్క వ్యక్తి జీవన విధానం, సామూహికమైనా మనిషి యొక్క నడవడి తీర్చేదిద్దేది కేవలం దైవచింతన మాత్రమే. ప్రపంచమంతా దైవచింతన గూర్చి ఆధ్యాత్మికత అనే పేరుతో వేర్వేరు మతాలు, సంప్రదాయాలు, వివిధ కోణాలలో తెలియజేస్తున్నాయి. వంతులుగా తీర్చిదిద్ది భగవంతునికి దగ్గరగా చేర్చేది దైవభక్తి, దైవచింతన.
కష్టాలు, నష్టాలు, దుఃఖాలు అనేవి శ్రీమన్నారాయణుడు మనిషిగా అవతారం ఎత్తిన శ్రీరామునికి కూడా తప్పనివి. తాను మనిషిగా పుట్టి కష్టాలను, నష్టాలను అనుభవించి అవి సంభవించినపుడు ఎలా దృఢంగా ఉండాలనే విషయాలను ధర్మప్రవర్తన కలిగి ఉండాలనేదానిని తెలియజేశారు.
అడవులలో కందమూలాలు తింటూ జీవించడం, నేలపై నిద్రించడం, తల్లిదండ్రులను, ఇతరులను ఎడబాసి ఉండడం, చివరకు భార్యను కూడా ఎడబాటు పోరాటం- ఇలా అనేకానేక విషయాల సమాహారం శ్రీరామావతారంలో జరిగాయి.
దైవచింతన, దైవంమీద భక్తి, నమ్మకం ఉన్నపుడు ఏ నష్టం కూడా కష్టంగా అనిపించదు. కష్టం సుఖం భావన కేవలం మానసికం. ఒక్కో విషయం నిన్న, రేపు, నేడు అనే కాలగతులను మనిషి అనుభవంలోనికి వస్తూంటాయి. నేడు అనుభవిస్తున్న కష్ట సుఖాలన్నీ కూడా గత జన్మ ఫలాలే! దైవచింతన వలన సుఖమైనా, కష్టమైనా అనుభవించగలిగితే ఎంతటి కష్టం అయినా చిన్నదిగాను, సుఖం పెద్దదిగానూ కనబడతాయి.
నేను బాగుంటేనే రేపటికి పునాది కాగలదు. నేడు ఎన్నో మాయామోహాలు ఆకర్షిస్తూంటాయి. సాత్వికుడు, భగవత్‌భక్తుడు, యోగ్యుడు అయిన తుంబరుడు గంధర్వుడు అంత గొప్పవాడు క్షణిక అజ్ఞానం, ప్రారబ్ధంవలన తాత్కాలిక ఆకర్షణవలన నారదుల శాపానికి గురయ్యాడు. కురుక్షేత్ర సంగ్రామంలో ధృతరాష్ట్రునికి యుద్ధ విషయాలు శ్రీ్భగవద్గీత విషయాలు వినిపించిన సంజయుడు తుంబురులవారే!
మనిషికి అన్నీ చేస్తూన్నాననే భావన విడిచిపెట్టాలి. అన్నిటికి మూలాధారం, సృష్టికర్తయైన భగవంతునిగా గుర్తించాలి. నిన్న అనగా గత జన్మలో ఎలా ఉన్నా చేయగలిగినది ఏమీ లేదు. రేపు అనగా భవిష్య జన్మ ఏదో ఎలాగో అనేది తెలియంది లేదు. నేడు వర్తమానం ధర్మవర్తనులుగా ప్రవర్తించడం, దైవచింతన కలిగి ఉండడం ఎంతైనా అవసరం. ధర్మవర్తనం, దైవచింతన మనుష్యులకు, భగవంతునికి దగ్గరవుటకు ఎంతగానో అత్యావశ్యకము.

-ఎ.ఎస్.నాగభూషణశర్మ