మెయిన్ ఫీచర్

వర్ణవివక్షపై విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిక్కటి నలుపు..
కానీ ఆ కళ్లలో అంతులేని ఆత్మవిశ్వాసం..
మాడిపోయిన బిస్కట్..
కానీ ఆ మాటల్లో లెక్కలేనంత ధైర్యం..
ముఖం అద్దంలో చూసుకో..
కానీ ఆ మెదడు ఎంతో స్మార్ట్.. స్పెషల్..
ఇవన్నీ పదకొండు సంవత్సరాలకే ఫ్యాషన్ వెబ్‌సైట్ సీఈఓ అయిన ఖెరిస్ రోజర్స్‌కు చెందుతాయి. చిక్కటి నలుపు, మాడిపోయిన బిస్కట్, ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా..? వంటి మాటలన్నీ ఆమె ఎదుర్కొన్న అవమానాలు.. కానీ ఆ వెక్కిరింతలను చిన్నారి తన విజయానికి సోపానాలుగా మార్చుకుంది. వివరాల్లోకి వెళితే..
ఖెరిస్ రోజర్స్ పదకొండు సంవత్సరాల చిన్నారి. ఆమె నల్ల జాతీయురాలు. స్కూల్లో అందరూ ఆమె రంగును చూసి ఆటపట్టించేవారు. మాడిపోయిన బిస్కట్ అని పిలిచేవారు. వెక్కిరించేవారు. ఖెరిస్ ప్రతిరోజూ ఈ విషయాన్ని తల్చుకుని ఏడ్చేది. తనలోని ఆత్మవిశ్వాసం, చిలిపితనాన్ని చంపుకుని ప్రతి చిన్న విషయానికి ఏడ్వడం మొదలుపెట్టింది. కానీ తనలోని బాధను ఎవరికీ చెప్పుకోలేదు. రోజురోజుకీ ఆమెలో వచ్చిన మార్పుని గమనించిన ఆమె తల్లి కూతురిని బుజ్జగించి విషయాన్ని అడిగింది. అమ్మ స్కూలును మార్చేసింది. విషయం తెలుసుకున్న ఖెరిస్ బామ్మ తన గురించి మనవరాలికి చెప్పింది. ఖెరిస్ బామ్మ కూడా చాలా కష్టాలు పడ్డారట.. వర్ణవివక్షను ఎదుర్కొన్నారట.. ఈ విషయం తెలుసుకున్న ఖెరిస్ ఏడాది క్రితం ఒక సొంత వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. దీనిద్వారా ఇప్పటివరకు పదివేల టీషర్టులకు పైగా అమ్మింది. ఇంతకూ ఈ టీషర్టుల ప్రత్యేకత ఏంటో తెలుసా! ఈ టీషర్టుల ద్వారా ఆమె ఓ సందేశాన్ని చేరవేస్తుంది. అదేంటంటే 3ఫ్లెక్సిన్ మై కంప్లెక్షన్2. ఇదే ఆమె కంపెనీ పేరు కూడా. ఇప్పుడు ఖెరిస్ ఫ్యాషన్ ప్రపంచంలో ఓ సంచలనం.. అతి చిన్న వయసులోనే న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో అడుగుపెట్టిన డిజైనర్‌గా గత ఏడాది అందరి ప్రశంసలు అందుకుంది ఖెరిస్. అంతేకాదు.. ఆమెకు సూపర్ మోడల్ కావాలని ఉందట.. అలాగే తన సంస్థను ఇంకా విస్తరించి ఏదో ఒకరోజు ఆమె సొంత స్టోర్ తెరవాలని కలలు కంటోంది. పాడటం, డాన్స్ చేయడం, నటించడం ఖెరిస్‌కు ఇష్టమైన వ్యాపకాలు. అందుకే ఆమె ఎంటర్‌టైనర్ కావాలనుకుంటోంది. తనలా వర్ణ వివక్ష ఎదుర్కొన్నవాళ్లందరికీ ఓ సందేశాన్ని ఇస్తోంది ఖెరిస్. 34ఎవరైనా మిమ్మల్ని ఏడిపిస్తే పట్టించుకోకండి. మీ గురించి మీరేమనుకుంటున్నారో అది చాలా ముఖ్యం. మీరు కూడా నాలా చేయండి. అదేంటంటే.. మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అన్నప్పుడు మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకోండి. మీలో ధైర్యం నింపే మాటలు చెప్పుకోండి.. నేను చాలా స్మార్ట్.. స్పెషల్.. వెరీ క్రియేటివ్.. అని మీకు మీరే చెప్పుకోండి. ఇతరులు అనే మాటలు పొరపాటున కూడా మీ ఆలోచనల్లోకి రానివ్వకండి. అప్పుడే రెట్టించిన ఉత్సాహంతో ముందడుగు వేయగలుగుతారు22 అని చెబుతోంది పదకొండు సంవత్సరాలు పూర్తిగా నిండని ఈ చిన్నారి సీఈఓ. మరి అంతటి ఆత్మవిశ్వాసం ముందు ఎంత పెద్ద ప్రపంచమైనా చిన్నబోదూ..