మెయిన్ ఫీచర్

ఆత్మవిశ్వాసమే ఆయుధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక కాలు లేదు.. పైగా రొమ్ము కేన్సర్..
అయినా ఏమాత్రం భయం లేదు. తొట్రుపాటు అసలే లేదు. అందుకేనేమో ఇంగ్లీష్ చానల్‌ను ఈదేస్తానంటోంది.. ఇంగ్లీష్ చానల్ ఈదడం అనే ఆలోచనే.. చాలా భయం కలిగిస్తుంది. కానీ ఈ మహిళ చాలా ధైర్యంగా స్వీకరించింది. ఆమే వికీ గిల్బర్ట్. వికీ సాధారణ మహిళ కాదు. ఈమెకి ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం కాలు పోయింది. దాని నుంచి కోలుకునే లోపే ఆమెకి రొమ్ము కేన్సర్ అని తెలిసింది. ఇటీవలే చికిత్సను పూర్తిచేసుకున్న వికీ ఇంగ్లీష్ చానల్‌ను ఈదాలనే సాహసానికి పూనుకుంది. వివరాల్లోకి వెళితే..
దృఢంగా, ఆరోగ్యంగా ఉన్నవాళ్లకే ఇంగ్లీష్ చానల్ ఈదాలంటే పెద్ద సాహసం. అలాంటిది ఒక కాలు కోల్పోయి, రొమ్ము కేన్సర్ నుంచి కోలుకుంటున్న వికీకి ఇది చాలా కష్టతరమైన పని. ఇరవై ఆరు సంవత్సరాల క్రితం వికీకి బోన్ కేన్సర్ ఉంది అని చెప్పారు. అలా ఆమెకు కుడికాలును తీసేశారు. ఏడాది తర్వాత.. ఆమెకు కేన్సర్ అని పొరపాటున అంచనా వేశామని, నిజానికది నిరపాయకరమైన సిస్ట్ మాత్రమేనని చెప్పారు. రెండు సంవత్సరాల క్రితం ఆమెకు మరో చేదు వార్త ఎదురైంది. వైద్య పరీక్షల్లో వికీకి తీవ్రమైన రొమ్ము కేన్సర్ ఉందని తేలింది. అయినా ఏమాత్రం కలత చెందలేదు. పైగా ‘కేన్సర్ చాలా భయంకరమైన జబ్బే. దాని చికిత్స నరకమే.. కీమోథెరపీ మనిషిని చాలా దెబ్బతీస్తుంది. మానసికంగా, శారీరకంగా మనిషి కుంగిపోతాడు.. కానీ నేను దాన్ని ఎదిరించాలనుకున్నాను. నాకు వేరే దారిలేదు. దీనితోనే నేను ఆనందంగా జీవించాలి. ఉన్న జీవితాన్ని మార్చే శక్తి నాకు లేదు. పోయిన నా కాలు తిరిగి పెరగదు. కాబట్టి ఉన్నదాంట్లోనే ఉత్తమంగా జీవించాలి. అలా ఆత్మవిశ్వాసంతో ముందుకెళుతున్నా.. రొమ్ము కేన్సర్ చికిత్స తర్వాత నాకు కొత్త జీవితం లభించింది. కేన్సర్ తిరగబెట్టే ప్రమాదం శారీరక కసరత్తు వల్ల బాగా తగ్గిపోతుందన్న అవగాహన వచ్చింది. దీన్ని నాలా కేన్సర్‌తో బాధపడుతున్న వారితో పంచుకుని.. నా వంతు కృషి చేయాలన్నదే నా ఆకాంక్ష..’ అని చెబుతుంది వికీ.
వికీ రోజూ ఉదయం ఆరుగంటలకే సరస్సులో మూడు, నాలుగు కిలోమీటర్లు ఈదుతుంది. ఈతకొట్టి వచ్చాక ఆమె చాలా ఉత్సాహంగా ఉంటుంది. నీళ్లలో కాలులేకుండా చేతికర్రతో ఈదడం కష్టం కదా.. అని ఎవరైనా అంటే.. ‘కష్టమే.. కానీ ఇష్టం కూడా ఉందిగా.. కొన్నిసార్లు చేతికర్రతో నీటిలోకి వెళ్లడం కష్టమే.. అలాంటి సమయంలో నేను కూర్చుని వెళ్లడానికి ప్రయత్నిస్తాను. కానీ అదంత సౌకర్యంగా ఉండదు. ఒకసారి నీటిలోకి వెళితే.. అక్కడ లభించే స్వేచ్ఛ, ఆనందం.. నాకు మరెక్కడా లభించదు’ అని నవ్వుతూ చెబుతుంది వికీ. రోజువారీ ఈత శిక్షణ ముగిశాక ఆమె తల్లిగా మారిపోతుంది. పిల్లలను ఎంతో శ్రద్ధగా చూసుకుంటుంది. కేన్సర్ అనేది ఆమె గతం. ఇప్పుడు ఆమె దృష్టంతా వేసవిలో ఈదబోతున్న ఇంగ్లిష్ చానల్‌పైనే ఉంది. ఇంగ్లిష్ చానల్‌ను ఈదబోతున్న రిలే టీమ్‌లో ఆమె భాగమవబోతోంది. ఈ చానల్‌ను ఈదాలంటే చాలాకష్టం. అలలు, జెల్లీఫిష్, సీసిక్‌నెస్.. ఇలాంటి సమస్యల్ని అధిగమించగలగాలి. భయాన్ని విడనాడాలి. ఈ శిక్షణ, ఈత.. కేన్సర్‌ను దూరంగా ఉంచుతాయన్నది వికీ ఆశ. ఏది ఏమైనా వికీ ఆశ నెరవేరాలని, ఇంగ్లండ్, ఫ్రాన్స్‌ల మధ్య ఉండే ఇంగ్లీష్ చానల్‌ను ఈదుతూ దాటాలని ఆశిస్తూ.. ఆల్ ది బెస్ట్ వికీ..