మెయిన్ ఫీచర్

పెద్దలే మార్గదర్శకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూడు గుణముల ఏకత్వమే తపస్సు. మూడు గుణముల ఏకత్వం అనగా శారీరిక, వాచిక, మానసికముల సమన్వయమైన పరివర్తన. వాటి ప్రభావమే తపస్సు. త్రిగుణముల ఏకత్వాన్ని, త్రిగుణముల త్రిపుటి యొక్క సంపూర్ణత్వాన్ని అనుభవించినటువంటి మనిషి మహాత్ముడు.
రజోగుణ, తమోగుణముల ఏకత్వాన్ని నిర్మూలనం చేసి , ఇంద్రియముల దోషములను నిర్మూలనము చేసి, మూడు గుణముల ఏకత్వాన్ని అనుభవించే పరిస్థితికే తపస్సు అని పేరు.
సాత్వికము చేత రజస్సును అరికట్టి, రజస్సు ద్వారా తమస్సును అరికట్టి మూడింటి తత్వమును ఏకత్వంగా భావించే స్థితియే తపస్సు.
చివరకు సాత్వికమును కూడా తీసివేయాలి. ఉదా.కు కాలిలోముల్లు విరిగిందనుకోండి. ఆ ముల్లును తీయడానికి ఎటువంటి పరికరము ఉపయోగించే అవసరం లేదు. ఆ ముల్లును తిరిగి మరో ముల్లుతో తీయవచ్చు. తరువాత తీసిన ముల్లును, తీయబడిన ముల్లును రెండిని విసర్జించాలి. అదేవిధంగా ఈ రజస్తమోగుణాలనే ముండ్లు బాధిస్తూ ఉంటాయి. రజోగుణం, తమోగుణం, అనే ముళ్లను తీసే వరకే సత్వగుణాన్ని భద్రపరుచుకోవాలి. ఆరెండిటిని తీసేసిన తరువాత సత్వగుణమునే ముల్లును కూడా విసర్జించాలి.
సత్వగుణం బంగారు గొలుసువంటిది. రజోగుణం రాగి గొలుసు వంటిది. తమోగుణము ఇనుప గొలుసువండిది. ఈ మూడు కూడా బంధనములే. బంధము సమానమే. కానీ గొలుసు విలువల్లో తేడా ఉంది. ఏది ఏమయినా బంధన బంధనే. బంగారం కానీ, రాగి కానీ , ఇనుము కానీ ఏదయినా బంధనే కనుక ఈ బంధన విడిపించుకోవాలి. ఈ మూడింటిని దైవార్పణ గావించినప్పుడు సర్వకర్మలు భగవంతుని ప్రీతి కోసం అవుతాయి.
మనసుని స్వాధీనపరుచుకోవడానికి అభ్యాసం వైర్యాగం అత్యవసరమని గీత బోధించింది. అభ్యాసం అంటే లౌకిక సంబంధములైన అభ్యాసములు కావు. శారీరకముగా, మానసికముగా, వాక్కు రీతిగా పవిత్రమైన అభ్యాసములు. ఈ మూడు కూడాదైవ సంబంధమైన కార్యములలో ప్రవేశపెట్టాలి. నిర్మలంగా ఉండాలి. అవే నిజమైన తపస్సుకి సరైన ప రికరములు. ఇటువంటి ప రికరములను అభివృద్ధి కావించుకుని, పవిత్రమైన జన్మను సార్థకము చేసుకొనుటకు దైవానుగ్రహమునకు పాత్రులు అగుటకు నిత్యం దైవ ప్రార్థన అవసరము.
అయితే భగవంతుని ధ్యానించుటకు ఒక కాలం, ఒక వయస్సు అనే నియమములు ఏమాత్రం లేవు. కనుకనే సర్వేషు, కాలేషు అని గీతాచార్యులు ప్రధానమైన ఆదర్శమును అందించారు. గీతాచార్యుడు సుఖదుఃఖములు, కష్టనష్టములు, శీతోష్ణములు, లాభాలాభములు, దూషణ భూషణలు ఇవన్నీ సమంగా భావించమని బోధించారు.
భక్తుని యొక్క లక్షణములు 64గా నిరూపించింది భగవద్గీత. అభ్యాస వైరాగ్యములు ఈ రెండింటి యందు ఈ అర్హతలు యిమిడి ఉన్నవి. శారీరక తపస్సు, వాచక తపస్సు మానసిక తపస్సు ఈ మూడింటి సమ్మిళతమైన ధర్మము అభ్యాసం చేసుకోవాలి. వైరాగ్యం అంటే వస్తు దోషమును గుర్తించి కర్తవ్యకర్మలను ఆచరిస్తూ ఫలాపేక్షను ఏమాత్రం హృదయమునందు చేర్చుకొనక సాక్షీభూతుడుగా ఉండడమే.
ఈ రెంటిని మనిషి సక్రమంగా అమలుపరుచుకున్న ఇంతకుమించి పెద్ద సాధనలు చెయ్యనవసరం లేదు.
ఇటువంటి అర్హతలు మనిషిలో అభివృద్ధి అవ్వాలంటే బాల్యం, యవనం వయస్సులు చాలా ప్రధానమైనవి. ఇంద్రియశక్తి, దేహ పటుత్వం, ఆరోగ్యం, ప్రతిజ్ఞాశక్తి, జ్ఞాపకశక్తి ఇటువంటి నవ్యమైన భవ్యమైన శక్తులు మనిషిలో పుష్కలంగా ఉన్నప్పుడు ఇటువంటి సాధనము చేయుటకు వీలవుతుంది. అందువల్ల దైవప్రార్థన చిన్నతనం నుంచి అలవరుచుకోవాలి. పెద్దలు పిల్లలకు భగవంతుని ప్రార్థన గురించి వివరించాలి. బోధించాలి. పెద్దలే అన్నివిధములుగా పిల్లలకు మార్గదర్శకులు కావాలి.

- శివాని