మెయిన్ ఫీచర్

గూగుల్..గురువు కాగలదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలక, బలపం పట్టి బుడిబుడి అడుగులు వేస్తూ బడివైపుకు వడివడిగా సాగే అమాయకపు చూపుల చిన్నారికి మంచి చెడులు వివరించే దిక్సూచి గురువు. ‘గురు’ అంటే చీకటిని పారద్రోలడం అని అర్థం. విద్యార్థులలోని అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి సమాజశ్రేయస్సుకోసం పాటుపడే మహోన్నత వ్యక్తిగా మలిచేవాడు గురువు. వ్యక్తి అనేవాడు ఏం నేర్చుకున్నాడు అనేది అతడు తన జీవితంలోని ఏయే వ్యర్థ అంశాలను వదిలించుకోగలిగాడు అన్న దానిపై ఆ వ్యక్తియొక్క జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. వ్యర్థమైన చెడు అలవాట్లను వదిలించుకోగలగాలి అంటే.. నైతిక విలువలు కలిగి ఆదర్శవంతమైన గురువు బోధనల వల్లనే అది సాధ్యం. విద్యార్థి.. గురువునే దేవుడిగా భావిస్తాడు! తన బోధనలనే మహాప్రసాదంగా స్వీకరిస్తాడు. నేటి ఈ 21వ శతాబ్దంలో అత్యున్నత గురువులకు కరువు రాబోతున్నదా?! అన్నట్లుగా అనిపిస్తున్నది.
విద్యాలయాలలో ఒకప్పుడు లింగ వివక్ష, అంటరానితనం, వర్ణ వివక్షత తిష్టవేసి కూర్చుంటే.. నేడు ఈ అంశాలు రూపాంతరం చెంది, ర్యాగింగ్, అత్యాచారాల రూపంలో పేట్రేగిపోతున్నారు. వేధింపులు నిత్యకృత్యాలుగా మారుతున్నాయి. తులసి వనం లాంటి ఉపాధ్యాయ వృత్తిలో గంజాయి మొక్కల లాంటి ప్రబుద్ధులు అక్కడక్కడ తారస పడడం, ఉపాధ్యాయ లోకానికి కొంత అప్రతిష్ఠను కలిగిస్తున్నది. ఇలాంటి పరిస్థితులు ఎదురుకావడం నేటితో (సెప్టెంబర్ 5- ఉపాధ్యాయ దినోత్సవం)నైన స్వస్తి కావాలని కోరుకుందాం.
కాలం మారింది, బోధన అవసరాలు మారాయి. బోధించే పద్ధతులలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రోజురోజుకు గురువు స్థానాన్ని ‘గూగుల్’ ఆక్రమిస్తుంది. నేటి విద్యార్థి గురువుకన్నా ‘గూగుల్’ గురువును ఎక్కువ నమ్ముతున్నాడు! వేదకాలంనుండి నేటివరకు అపార మేధోసంపద కలిగిన ఆచార్యులు మన భారతదేశం కలిగియున్నది. వారినే అనుసరిస్తూ.. జీవితాలలో అత్యున్నత శిఖరాలను అధిరోహించినవారు ఉన్నారు. ఎన్ని ఆధునిక పద్ధతులు బోధన అంశాలలోకి చొచ్చుకు వచ్చిననూ.. ఉపాధ్యాయుని స్థానం పదిలమనే చెప్పవచ్చును. అరిస్టాటిల్ చెప్పినట్లు అమ్మనాన్నలు జన్మనిస్తారు. గురువులు విద్యార్థులకు మంచి జీవితాన్నిస్తారు. ఈ సూక్తిని నిజంచేస్తున్న ఎంతోమంది స్ఫూర్తిదాతలు మన దేశంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. వారికి విద్యార్థులు జీవితాంతం ఋణపడి ఉంటారు.
ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థికి ఒక రక్షణ వలయం. తన జీవితానికి రక్ష. అతడే విద్యార్థికి స్నేహితుడు, సోదరుడు, అండదండలనిచ్చే మహోన్నతుడు. తన వృత్తిలో అంకిత భావాన్ని కలిగియుండి స్వీయ క్రమశిక్షణను పాటిస్తూ, నియమ నిబద్ధతలతో విధులను నిర్వర్తించే ప్రతి ‘గురువు’ సమాజమనే తోటకు వనమాలే.. వెలకట్టలేని పరిరక్షకుడే.
విద్యార్థులు తమకు తామే ఏదైనా నేర్చుకోగలం, ఎంతైనా సాధించగలం అనే ఆలోచనలకు తావివ్వకుండా, మీ జీవితాలను స్ఫూర్తివంతంగా మలిచే గురువుల బోధనకు అడ్డుతగలకండి. వారిని గౌరవించండి. విద్యార్థికి ఉపాధ్యాయుడు పాఠశాల స్థాయిలో తండ్రిలా వ్యవహరిస్తూ.. కళాశాల స్థాయిలో స్నేహితుడిలా మార్గనిర్దేశనంచేస్తూ సమాజశ్రేయస్సుకై తాను అన్ని పాత్రలను పోషించవలసి వస్తుంది. అలాంటి మహోన్నత గురువులకు మనసారా.. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.

-సూరం అనిల్ 90594 57045